Babylon గురించి బైబిల్ వచనాలు: Took Jehoiachin, &c captive to Babylon
Took Jehoiachin, &c captive to Babylon గురించి వచనాలు
అతడు యెరూషలేము నగరవాసులందరినీ అనగా దేశంలో ఉన్న బీదలను తప్ప అధికారులందరిని యుద్ధవీరులను హస్తకళాకారులను కంసాలివారిని మొత్తం పదివేలమంది బందీలుగా తీసుకెళ్లాడు.
నెబుకద్నెజరు యెహోయాకీనును బందీగా బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు యెరూషలేము నుండి రాజు తల్లిని, రాజు భార్యలను, రాజభవన అధికారులను, దేశంలోని ప్రముఖులను కూడా తీసుకెళ్లాడు.
బబులోను రాజు ఏడు వేలమంది యుద్ధములలో ఆరితేరిన బలాఢ్యులైన పరాక్రమశాలులందరిని, వేయిమంది హస్తకళాకారులను, కంసాలివారిని కూడా తీసుకెళ్లాడు.