కంటెంట్‌కు వెళ్లండి

Babylon గురించి బైబిల్ వచనాలు: Treatment of the Jews in

9 వచనాలు · 73 కోణాలు

Treatment of the Jews in గురించి వచనాలు

  1. యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, పన్నెండవ నెల, ఇరవై ఏడవ రోజున ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, అతడు యూదా రాజైన యెహోయాకీనును చెరసాల నుండి విడిపించాడు.

  2. అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల స్థాయి కంటే ఉన్నత స్థాయిని అతనికిచ్చాడు.

  3. కాబట్టి యెహోయాకీను తన జైలు దుస్తులు తీసివేసి, ఇక తన జీవితాంతం రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు.

  4. అతడు బ్రతికి ఉన్నంత కాలం, రాజు ప్రతిరోజు క్రమంగా యెహోయాకీనుకు బత్తెం ఇచ్చాడు.

  5. రాజు, రాజ్య పరిచర్య చేయడానికి ఇశ్రాయేలీయులలో రాజకుటుంబానికి, రాజవంశాలకు చెందిన కొంతమందిని తీసుకురమ్మని తన ముఖ్య అధికారియైన అష్పెనజును ఆదేశించాడు.

  6. ఆ యువకులు ఏ శారీరక లోపం లేనివారై, అందంగా ఉండి, విద్యా ప్రావీణ్యత కలిగి తెలివి కలవారై, త్వరగా గ్రహించే వారై రాజభవనంలో సేవ చేయటానికి సామర్థ్యం కలిగి ఉండాలి. వారికి బబులోనీయుల భాష చదవడం వ్రాయడం నేర్పాలి.

  7. రాజు తన బల్ల నుండి వారి కోసం ఆహారం, ద్రాక్షరసం కొంత భాగాన్ని ప్రతిరోజు వారికి కేటాయించాడు. వారు మూడు సంవత్సరాలు శిక్షణ పొంది ఆ తర్వాత వారు రాజుకు సేవ చేయాలి.

  8. యూదా నుండి ఎంపిక చేసిన వారిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా ఉన్నారు.

  9. ప్రధాన అధికారి దానియేలుకు బెల్తెషాజరు అని, హనన్యాకు షద్రకు అని మిషాయేలుకు మేషాకు అని అజర్యాకు అబేద్నెగో అని క్రొత్త పేర్లు పెట్టాడు.