- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Babylon గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
యుద్ధం జరిగేటప్పుడు అనేకుల జీవితాలను నాశనం చేయాలని బబులోనీయులు ముట్టడి దిబ్బలు వేసి కోటలు కట్టినప్పుడు ఫరో తనకున్న మహా బలమైన గొప్ప సైన్యంతో వచ్చినా ఆ రాజుకు ఏమాత్రం సహాయం చేయలేడు.
నిబంధనను భంగం చేసి తన ప్రమాణాన్ని నిర్లక్ష్యం చేశాడు. ప్రమాణం చేసి కూడా అలాంటి పనులు చేశాడు కాబట్టి అతడు ఏమాత్రం తప్పించుకోలేడు.
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అతడు నేను పెట్టుకున్న ఒట్టును తృణీకరించి నా నిబంధనను భంగం చేసినందుకు నా జీవం తోడు నేను అతనికి ప్రతిఫలమిస్తాను.
నేను అతనికి వలవేసి నా ఉచ్చులో బిగించి బబులోనుకు తీసుకెళ్లి అతడు నా పట్ల నమ్మకద్రోహిగా ఉన్నాడు కాబట్టి అక్కడ అతనికి శిక్ష విధిస్తాను.
అతని సైన్యంలో ఎంపిక చేయబడిన వారందరు కత్తివేటుకు చనిపోతారు, తప్పించుకున్నవారు గాలికి చెదిరిపోతారు. అప్పుడు యెహోవానైన నేనే ఈ మాట చెప్తున్నానని మీరు తెలుసుకుంటారు.
“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఎత్తైన దేవదారు చెట్టులో చిటారు కొమ్మ ఒకటి తీసి దానిని నాటుతాను; దాని పైనున్న కొమ్మల్లో ఒక లేత కొమ్మను త్రుంచి అత్యున్నత పర్వతం మీద నాటుతాను.
ఇశ్రాయేలు దేశంలో ఎత్తైన పర్వతం మీద నేనే దానిని నాటుతాను. అది కొమ్మలు వేసి ఫలించి ఘనమైన దేవదారు చెట్టు అవుతుంది. అన్ని రకాల పక్షులు దానిపై గూళ్ళు కట్టుకుంటాయి; దాని కొమ్మల నీడలో అవి ఆశ్రయాన్ని పొందుతాయి.
యెహోవానైన నేనే పొడవైన చెట్లను చిన్నవిగా, నీచమైన చెట్లను గొప్ప చెట్లుగా మార్చగలనని, పచ్చని చెట్టుని ఎండిపోయేలా, ఎండిన చెట్టుని పచ్చని చెట్టులా చేస్తానని అడవిలో ఉన్న అన్ని చెట్లు తెలుసుకుంటాయి. “ ‘యెహోవానైన నేనే ఈ మాట అంటున్నాను. నేనే దానిని నెరవేరుస్తాను.’ ”
“మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు.
అమ్మోనీయుల పట్టణమైన రబ్బా మీదికి ఒక మార్గాన్ని, అలాగే యూదా దేశంలో ఉన్న ప్రాకార పట్టణమైన యెరూషలేము మీదికి ఒక ఖడ్గం వచ్చేలా మరో మార్గాన్ని ఏర్పాటు చేయాలి.
దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు.
యెరూషలేము గురించి తన కుడి వైపున శకునం కనిపించింది ఏర్పాటు చేయమని, చంపమని, యుద్ధధ్వని చేయమని, గుమ్మాలకు ఎదురుగా పడగొట్టే యంత్రాలు ఏర్పాటు చేయమని, ముట్టడి దిబ్బలు వేయమని చెప్పాడు.
అతనితో ఒప్పందం చేసుకున్న వారికి ఇది తప్పుడు శకునంగా కనిపిస్తుంది, కాని అతడు వారి అపరాధాన్ని వారికి గుర్తు చేసి వారిని బందీగా తీసుకెళ్తాడు.
“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరు బహిరంగంగా తిరుగుబాటు చేసి మీ అపరాధాన్ని గుర్తుకు తెచ్చారు, మీరు చేసేవాటన్నిటిలో మీ పాపాలను బయట పెట్టుకున్నారు. మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు బందీలుగా కొనిపోబడతారు.
“ ‘అపవిత్రుడా ఇశ్రాయేలీయుల దుష్ట అధిపతీ, నిన్ను శిక్షించే రోజు సమీపించింది; నీ శిక్షాకాలం ముగింపుకు చేరుకుంది,
ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు.
శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’
“మనుష్యకుమారుడా! నీవు ప్రవచించి ఇలా చెప్పు, ‘అమ్మోనీయుల గురించి వారి అవమానాల గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఒక ఖడ్గం, ఒక ఖడ్గం, వధ కోసం దూయబడింది, నాశనం చేయడానికి మెరుగు పెట్టబడి, మెరుపులా తళతళలాడుతూ ఉంది!
నీ గురించి శకునగాండ్రు తప్పుడు దర్శనాలు చూస్తుండగా, నీ గురించి అబద్ధపు శకునాలు చెప్తున్నప్పుడు, ఎవరి దినమైతే వచ్చేసిందో, ఎవరి శిక్షా సమయం ముగింపుకు చేరుకుందో, ఆ దుర్మార్గుల మెడ మీద ఆ ఖడ్గం పెట్టబడుతుంది. వారి మెడ ప్రక్కనే అది నిన్ను పడవేస్తుంది.
“ ‘ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టు. నీవు సృజించబడిన స్థలంలోనే, నీ పూర్వికుల దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను.
నేను నా ఉగ్రతను నీపై కుమ్మరించి నా కోపాగ్నిని నీ మీదికి ఊదుతాను; నాశనం చేయడంలో నేర్పరులైన క్రూరుల చేతికి నిన్ను అప్పగిస్తాను.
నీవు అగ్నికి ఆహుతి అవుతావు, నీ రక్తం నీ దేశంలో చిందించబడుతుంది, నీవు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోబడవు; ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను.’ ”
“మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.
కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది.
అతడు అతని సైన్యం నా కోసమే శ్రమించారు కాబట్టి అతడు చేసిన దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఈజిప్టు దేశాన్ని అతనికి అప్పగించాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.