కంటెంట్‌కు వెళ్లండి

Assyria గురించి బైబిల్ వచనాలు

204 వచనాలు · 59 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వ్యభిచారం చేసి అలసిపోయిన దాని గురించి ఇలా అన్నాను, ‘అది వారితో చేసినట్లే వారు దానితో వ్యభిచారం చేశారు.’

  2. వేశ్యతో గడిపినట్లుగా వారు ఆమెతో గడిపారు. అలాగే వేశ్యలైన ఒహోలాతో, ఒహోలీబాతో గడిపారు.

  3. వీరిద్దరు వ్యభిచారం చేసి హత్యలు చేశారు కాబట్టి నీతిమంతులైన న్యాయాధిపతులు వీరికి తగిన శిక్ష విధిస్తారు.

  4. “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: వారి మీదికి నేను అల్లరిమూకను రప్పిస్తాను. శత్రువులు వారిని భయపెట్టి దోచుకుంటారు.

  5. అల్లరిమూక వారిని రాళ్లు రువ్వి చంపుతుంది. ఖడ్గంతో చంపుతారు. వారి కుమారులు కుమార్తెలను చంపి వారి ఇళ్ళను కాల్చివేస్తారు.

  6. “కాబట్టి స్త్రీలందరూ మిమ్మల్ని అనుకరించకుండా హెచ్చరికగా ఉండేలా నేను దేశంలోని అసభ్య అంతం చేస్తాను.

  7. మీరు మీ అసభ్య ప్రవర్తనకు శిక్ష అనుభవిస్తారు, విగ్రహారాధన పాపానికి పర్యవసానాలను భరిస్తారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”

  8. అష్షూరును చూడు, ఒకప్పుడు లెబానోను దేవదారులా, అందమైన కొమ్మలతో అడవిలా ఉండేది; దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కన్నా ఎత్తుగా ఉండేది.

  9. సమృద్ధియైన జలాలు దానిని పోషించాయి, లోతైన నీటి ఊటలు దానిని ఎత్తుగా పెరిగేలా చేశాయి; వాటి ప్రవాహాలు దాని మొదలు చుట్టూ ప్రవహించాయి, పొలంలో ఉన్న చెట్లన్నిటికి దాని కాలువలు నీరు అందించాయి.

  10. కాబట్టి పొలం లోని చెట్లన్నిటి కన్నా ఆ చెట్టు ఎత్తుగా ఎదిగింది; నీరు సమృద్ధిగా ఉన్నందున, దాని కొమ్మలు విస్తరించి, పెద్ద శాఖలుగా ఎదిగాయి.

  11. ఆకాశ పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి, అడవి జంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టాయి; గొప్ప జనాంగాలన్నీ దాని నీడలో నివసించాయి.

  12. నీరు సమృద్ధిగా ఉన్న చోటికి దాని వేర్లు వ్యాపించాయి, కాబట్టి అది విస్తరించిన కొమ్మలతో ఎంతో అందంగా ఉంది.

  13. దేవుని తోటలో దేవదారు వృక్షాలు కూడా దానితో పోటీపడలేకపోయాయి, సరళ వృక్షాలు దాని కొమ్మలతో సమానం కాలేవు, అక్షోట వృక్షాల కొమ్మలు దాని కొమ్మలతో పోల్చబడలేవు, దానికి ఉన్నంత అందం దేవుని తోటలో ఉన్న ఏ చెట్టుకు లేదు.

  14. విస్తారమైన కొమ్మలతో నేను దానిని అందంగా తయారుచేశాను, దేవుని తోటయైన ఏదెను లోని చెట్లన్నీ దానిని చూసి అసూయపడేలా చేశాను.

  15. “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మహా దేవదారు చెట్టు మిగిలిన చెట్ల కన్నా ఎత్తుగా ఉంది కాబట్టి అది గర్వపడింది.

  16. కాబట్టి దాని దుర్మార్గానికి తగినట్టుగా నేను దానిని దేశాల అధినేత చేతులకు అప్పగించాను. నేను దానిని విసిరివేశాను,

  17. విదేశీ జాతులలో క్రూరులు దాన్ని నరికి నేల మీద వదిలేశారు. కొండల్లో, లోయల్లో దాని కొమ్మలు పడి ఉన్నాయి; భూమిమీది వాగులన్నిటిలో దాని కొమ్మలు విరిగిపడ్డాయి. భూమి మీద ఉన్న జాతులన్ని దాని నీడ నుండి బయటకు వచ్చి దానిని వదిలేశాయి.

  18. కూలిపోయిన చెట్టు మీద ఆకాశ పక్షులన్నీ వాలాయి, కొమ్మల మధ్య అడవి జంతువులన్నీ నివసించాయి.

  19. కాబట్టి నీటి ప్రక్కన ఉన్న ఏ చెట్టు వాటి చిటారు కొమ్మలను గుబురుగా పెంచుకుని గర్వించకూడదు. నీరు సమృద్ధిగా ఉన్న ఏ ఇతర చెట్లు అంత ఎత్తుకు ఎప్పటికీ ఎదగకూడదు; వాటన్నిటి గమ్యం మరణమే, భూమి దిగువన పాతాళంలోనికి దిగిపోయే సాధారణ మనుష్యుల్లా అవి చనిపోతాయి.

  20. “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి.

  21. పాతాళంలోకి దిగే వారితో ఉండడానికి నేను దానిని పాతాళంలోకి దించినప్పుడు, దాని పతనం వల్ల వచ్చే శబ్దానికి నేను దేశాలు వణికిపోయేలా చేశాను. అప్పుడు ఏదెను చెట్లన్నీ, లెబానోనులో ఉత్తమమైనవి, మంచివి, సమృద్ధిగా నీరున్న చెట్లు, భూమి దిగువన ఓదార్పు పొందాయి.

  22. వారు కూడా గొప్ప దేవదారులా, ఖడ్గంతో చంపబడినవారి దగ్గరకు, జాతుల మధ్య దాని నీడలో నివసించిన సాయుధ పురుషులతో పాటు పాతాళానికి దిగారు.

  23. తర్వాత యెహోవా వాక్కు రెండవసారి యోనాకు వచ్చింది:

  24. “నీవు మహా పట్టణమైన నీనెవెకు వెళ్లి నేను నీకు ఇచ్చే సందేశాన్ని ప్రకటించు.”

  25. యోనా యెహోవా మాటకు లోబడి నీనెవెకు వెళ్లాడు; నీనెవె చాలా పెద్ద పట్టణం కాబట్టి దానిగుండా వెళ్లడానికి మూడు రోజుల పట్టింది.