Assyria గురించి బైబిల్ వచనాలు: Extent of conquests
Extent of conquests గురించి వచనాలు
ఇతర దేశ దేవుడు ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించాడా?
హమాతు, అర్పదు దేవుళ్ళు ఎక్కడ? సెఫర్వయీము, హేన, ఇవ్వా దేవుళ్ళు ఎక్కడ? వారు నా చేతిలో నుండి సమరయను రక్షించగలిగారా?
ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి రక్షించగలిగారా? అలాగైతే, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును ఎలా విడిపిస్తారు?”
అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీవు ఖచ్చితంగా వినే ఉంటావు. మీరు మాత్రం తప్పించుకోగలరా?
గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారు పట్టణంలో ఉండే ఏదెను ప్రజలను నా పూర్వికులు నాశనం చేసినప్పుడు, ఆ జనాల దేవుళ్ళు వారిని విడిపించారా?
హమాతు రాజు, అర్పదు రాజు ఎక్కడ? లాయిరు, సెఫర్వయీము, హేన, ఇవ్వా పట్టణాల రాజులు ఏమయ్యారు?”
కల్నో, కర్కెమీషులా ఉండలేదా? హమాతు అర్పదులా ఉండలేదా సమరయ దమస్కులా ఉండలేదా?
విగ్రహాలను పూజించే రాజ్యాలను నా చేయి పట్టుకున్నట్లు, వాటి విగ్రహాలు యెరూషలేము సమరయుల విగ్రహాల కన్న ఎక్కువగా ఉన్నాయి.
నేను సమరయకు దాని విగ్రహాలకు చేసినట్లు యెరూషలేముకు దాని విగ్రహాలకు చేయవద్దా?”
ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను.
ఎందుకంటే అతడు ఇలా అన్నాడు: “ ‘నేను వివేకిని, నా బాహుబలం చేత, నా జ్ఞానంతో దీన్ని చేశాను. నేను ప్రజల సరిహద్దులు తీసివేశాను, వారి సంపదలు దోచుకున్నాను; బలవంతునిలా వారి రాజులను అణచివేశాను.
పక్షి గూటిలోనికి చేరునట్లు నా చేయి దేశాల సంపదను చేరుకుంది; ప్రజలు విడిచిపెట్టిన గుడ్లు ఏరుకున్నట్లుగా, నేను అన్ని దేశాలను సమకూర్చుకున్నాను; ఏ ఒక్కటి రెక్కలు ఆడించలేదు లేదా కిచకిచమనడానికి నోరు తెరవలేదు.’ ”