Skip to content

Assyria గురించి బైబిల్ వచనాలు

204 వచనాలు · 59 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అదలా తన వ్యభిచారాన్ని బహిరంగంగా నిర్వహిస్తూ, తన నగ్న శరీరాన్ని బహిర్గతం చేసినప్పుడు, నేను దాని సోదరిని వదిలేసినట్టే, దీని మీద అసహ్యం కలిగి దీన్ని కూడా వదిలేశాను.

  2. అయినప్పటికీ అది ఈజిప్టులో వేశ్యగా ఉన్న తన యవ్వన రోజులను గుర్తుచేసుకుని మరింత వ్యభిచారం చేసింది.

  3. గాడిదల్లాంటి పురుషాంగం గుర్రాల్లాంటి వీర్య స్ఖలనం ఉన్న తన ప్రేమికులను అది మోహించింది.

  4. కాబట్టి ఈజిప్టులో నీ రొమ్ములను చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ యవ్వనపు అశ్లీల ప్రవర్తన కొనసాగించాలని ఎంతో ఆశించావు.

  5. “కాబట్టి ఒహోలీబా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీ ప్రేమికులనే నీకు వ్యతిరేకంగా రేపుతాను, నీవు అసహ్యం కలిగి వదిలేసిన వారినే అన్ని వైపుల నుండి నీ మీదికి రప్పిస్తాను.

  6. బబులోనీయులు, కల్దీయులందరూ, పేకోదు, షోవ, కోవ యొక్క పురుషులు, వారితో ఉన్న అష్షూరీయులందరు, అందమైన యువకులు, అధికారులు, అధిపతులు, రథ అధికారులు ఉన్నత స్థాయి పురుషులు, గుర్రపు స్వారీ చేసే వీరందరిని రప్పిస్తాను.

  7. వారు ఆయుధాలతో రథాలతో బండ్లతో జనసమూహంతో నీ మీదికి వస్తారు. పెద్ద డాళ్లు, చిన్న డాళ్లు, శిరస్త్రాణాలు ధరించి అన్ని వైపుల నుండి నిన్ను చుట్టుముడతారు. శిక్షించడానికి నేను నిన్ను వారికి అప్పగిస్తాను, వారు తమ పద్ధతిలో నిన్ను శిక్షిస్తారు.

  8. నేను రోషంతో నా కోపాన్ని చూపించగా కోపాగ్రతతో వారు నిన్ను శిక్షిస్తారు. వారు నీ ముక్కు నీ చెవులు నరికివేస్తారు, నీలో మిగిలి ఉన్నవారు కత్తివేటుకు కూలిపోతారు. నీ కుమారులను కుమార్తెలను వారు తీసుకెళ్తారు, నీలో మిగిలిన వారు అగ్నిచేత కాల్చబడతారు.

  9. వారు నీ బట్టలు లాగివేసి నీ విలువైన ఆభరణాలు తీసుకెళ్తారు.

  10. కాబట్టి ఈజిప్టులో నీవు మొదలుపెట్టిన అశ్లీల ప్రవర్తన, వ్యభిచారం నీలో ఉండకుండా చేస్తాను. ఇకపై నీవు ఈజిప్టును జ్ఞాపకం చేసుకోవు, నీవు వీటిపై నీ దృష్టిని పెట్టవు.

  11. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు ద్వేషించిన వారికి నీవు అసహ్యించుకునే వారికి నిన్ను అప్పగిస్తున్నాను.

  12. వారు ద్వేషంతో నిన్ను బాధిస్తారు. నీవు వేటి కోసం కష్టపడ్డావో వాటన్నిటిని తీసుకుంటారు. వారు నిన్ను నగ్నంగా వదిలివేయగా నీ వేశ్యాత్వం వలన కలిగిన అవమానం బహిర్గతమవుతుంది.

  13. నీవు దేశాలను మోహించి, వారి విగ్రహాలతో నిన్ను నీవు అపవిత్రం చేసుకున్నావు, నీ అశ్లీలత, వ్యభిచారం వల్లనే ఇది నీ మీదికి వచ్చింది.

  14. నీ సోదరి వెళ్లిన దారిలోనే నీవు వెళ్లావు; కాబట్టి నేను దాని గిన్నెనే నీ చేతిలో పెడతాను.

  15. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “నీ అక్క త్రాగిన గిన్నె లోనిదే నీవు త్రాగుతావు, అది లోతైన పెద్ద గిన్నె; అది అపహాస్యం ఎగతాళిని తెస్తుంది, అందులో త్రాగాల్సింది చాలా ఉంటుంది.

  16. నీవు మత్తుతో, విచారంతో నిండిపోతావు, నీ సోదరియైన సమరయ గిన్నె, శిథిలం నిర్మానుష్యంతో నిండిన గిన్నె.

  17. అడుగు వరకు దానిలోనిది త్రాగి ఆ పాత్రను ముక్కలు చేసి, వాటితో నీ రొమ్ములు చీల్చుకుంటావు. ఇది నేనే చెప్పాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  18. “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు నన్ను మరచిపోయి నాకు వెన్ను చూపావు, నీ అశ్లీల ప్రవర్తనకు వ్యభిచారానికి తగిన శిక్షను నీవు భరించాలి.”

  19. యెహోవా నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, ఒహోలాకు, ఒహోలీబాకు నీవు తీర్పు తీరుస్తావా? వారు చేసిన అసహ్యమైన పనులను వారికి తెలియజేయి.

  20. వారు వ్యభిచారులు, వారి చేతికి రక్తం అంటింది. వారు విగ్రహాలతో వ్యభిచరించారు; నాకు కన్న బిడ్డలను వారు విగ్రహాలకు ఆహారంగా అర్పించారు.

  21. వారు నాకు కూడా ఇలా చేశారు: అదే సమయంలో వారు నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు; నా సబ్బాతులను కూడా అపవిత్రం చేశారు.

  22. వారు తాము పెట్టుకున్న విగ్రహాలకు తమ పిల్లలను అర్పించిన రోజే వారు నా పరిశుద్ధాలయంలో ప్రవేశించి దానిని అపవిత్రం చేశారు. నా నివాసంలో వారు ఈ విధంగానే చేశారు.

  23. “వారు దూర ప్రాంతాల నుండి వచ్చిన పురుషుల కోసం దూతలను కూడా పంపారు. వారు వచ్చినప్పుడు వారి కోసం నీవు స్నానం చేసి కళ్లకు కాటుక పెట్టుకుని నగలు ధరించావు.

  24. అందమైన మంచం మీద కూర్చుని దాని ఎదురుగా ఉన్న బల్లమీద నా పరిమళద్రవ్యాన్ని ఒలీవల నూనెను పెట్టావు.

  25. “అప్పుడే కోలాహలం చేసే గుంపు ఆమె చుట్టూ వినిపించింది; అల్లరిమూకలోని వారితో పాటు ఎడారి మార్గాన త్రాగుబోతులు వచ్చారు. వారు ఈ అక్కచెల్లెళ్ల చేతులకు కడియాలను తొడిగి వారి తలకు అందమైన కిరీటాలు పెట్టారు.