Skip to content

Allegory గురించి బైబిల్ వచనాలు

22 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఒక రోజు చెట్లన్నీ తమకు ఒక రాజును అభిషేకించుకోవాలని బయలుదేరి వెళ్లి ఒలీవ చెట్టుతో, ‘మాకు రాజుగా ఉండు’ అన్నాయి.

  2. “అయితే ఒలీవచెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవుడిని మానవులను గౌరవించడానికి వాడే నా తైలాన్ని నేను వదిలేయాలా?’ అన్నది.

  3. “తర్వాత చెట్లు అంజూర చెట్టుతో, ‘రా, మాకు రాజుగా ఉండు’ అన్నాయి.

  4. “అయితే అంజూర చెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం మధురుమైన నా మంచి ఫలాలను వదిలేయాలా?’ అన్నది.

  5. “తర్వాత చెట్లు ద్రాక్షవల్లితో అన్నాయి, ‘రా, మా రాజుగా ఉండు.’

  6. “అయితే ద్రాక్షవల్లి, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవునికి మనుష్యులకు సంతోషాన్ని ఇచ్చే నా ద్రాక్షరసాన్ని ఇవ్వడం మానివేయాలా?’ అన్నది.

  7. “చివరికి చెట్లన్నీ ముళ్ళపొదతో, ‘నీవు వచ్చి మాకు రాజుగా ఉండు’ అని అడిగాయి.

  8. “ముళ్ళపొద చెట్లతో, ‘మీరు నిజంగా నన్ను మీ రాజుగా అభిషేకించాలనుకుంటే రండి, నా నీడలో ఆశ్రయం తీసుకోండి; లేదా ముళ్ళపొద నుండి అగ్ని వచ్చి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయును గాక!’ అన్నది.

  9. తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తుంది, చిరుతపులి మేకతో పడుకుంటుంది, దూడ, కొదమసింహం, బలిపశువు కలిసి ఉంటాయి; చిన్న పిల్లవాడు వాటిని నడిపిస్తాడు.

  10. ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, వాటి పిల్లలు ఒక్క చోటే పడుకుంటాయి. ఎద్దు మేసినట్లు సింహం గడ్డిమేస్తుంది.

  11. పసిపిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడుతుంది. విషసర్పం పుట్టలో చిన్న బిడ్డ తన చేయి పెడుతుంది.

  12. ఎడారి, ఎండిన భూమి సంతోషిస్తాయి; అరణ్యం సంతోషించి పూస్తుంది. అది కుంకుమ పువ్వులా,

  13. ఒక్కసారిగా విచ్చుకుంటుంది; అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది. లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది, కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది; వారు యెహోవా మహిమను మన దేవుని వైభవాన్ని చూస్తారు.

  14. బలహీనమైన చేతులను బలపరచండి, వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;

  15. భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”

  16. అప్పుడు గ్రుడ్డివారి కళ్లు తెరవబడతాయి చెవిటి వారి చెవులు వినబడతాయి.

  17. అప్పుడు కుంటివారు జింకలా గంతులు వేస్తారు, మూగవాని నాలుక ఆనందంతో కేకలు వేస్తుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి ఎడారిలో కాలువలు పారతాయి.

  18. మండుతున్న ఇసుక చెరువులా మారుతుంది ఎండిన నేలలో నీటిబుగ్గలు పుడతాయి. ఒక్కప్పుడు తోడేళ్లు పడుకున్న స్థలంలో గడ్డి, రెల్లు, జమ్ము పెరుగుతాయి.

  19. అక్కడ రహదారి ఉంటుంది; అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది; అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే. అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు; దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.

  20. అక్కడ ఏ సింహం ఉండదు, ఏ క్రూర జంతువు ఉండదు; అవి అక్కడ కనబడవు. విమోచన పొందిన వారే అక్కడ నడుస్తారు.

  21. యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.

  22. ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది.