కంటెంట్‌కు వెళ్లండి

All Christians Should Be As Missionaries గురించి బైబిల్ వచనాలు

198 వచనాలు · 66 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అంద్రెయ మొదట తన సహోదరుడైన సీమోనును కలిసి, “మేము క్రీస్తును కనుగొన్నాం” అని చెప్పి,

  2. అతన్ని యేసు దగ్గరకు తీసుకువచ్చాడు. యేసు అతన్ని చూసి, “నీవు యోహాను కుమారుడవైన సీమోనువు. నీవు కేఫా అని పిలువబడతావు” అని చెప్పారు.

  3. “నజరేతా! ఆ ఊరి నుండి మంచిది ఏదైనా రాగలదా?” అని నతనయేలు అడిగాడు. అందుకు ఫిలిప్పు, “వచ్చి చూడు” అన్నాడు.

  4. “రండి, నేను చేసిందంతా నాతో చెప్పిన ఆయనను చూడండి, ఈయనే క్రీస్తు కాడా?” అని చెప్పింది.

  5. వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి అవసరంలో ఉన్నవారికి ఇచ్చారు.

  6. నమ్మినవారందరు ఏక హృదయం, ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్నవాటన్నిటిని అందరు సమానంగా పంచుకున్నారు.

  7. అపొస్తలులు గొప్ప శక్తితో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యమివ్వడం కొనసాగించారు. వారందరిలో దేవుని కృప ఎంతో శక్తివంతంగా పని చేస్తూ ఉన్నది.

  8. అవసరాన్ని బట్టి సమయానికి పొలాలు, ఇల్లు ఉన్నవారు వాటిని అమ్మి ఆ డబ్బును తెచ్చి, అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.

  9. కుప్రకు చెందిన యోసేపు అనే ఒక లేవీయుడు ఉన్నాడు. అపొస్తలులు అతన్ని బర్నబా అని పిలిచేవారు. ఆ పేరుకు “ఆదరణ పుత్రుడు” అని అర్థము.

  10. అతడు తన పొలాలను అమ్మివేసి ఆ డబ్బును తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

  11. చెదరిపోయినవారు తాము వెళ్లిన ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధించారు.

  12. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో ఎలా అభిషేకించారో, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు ఎలా ఆయన మేలులను చేస్తూ అపవాది శక్తుల క్రింద ఉన్నవారందరిని బాగుచేస్తూ తిరిగాడో మీకు తెలుసు.

  13. స్తెఫెను చంపబడినప్పుడు హింస కారణంగా చెదిరిపోయిన విశ్వాసులు ఫేనీకే, కుప్ర అంతియొకయ పట్టణ ప్రాంతాల వరకు వెళ్లి కేవలం యూదుల మధ్యనే సువార్త ప్రకటించారు.

  14. వారిలో కుప్ర కురేనీకు చెందిన కొందరు అంతియొకయ పట్టణానికి వెళ్లి గ్రీకు దేశస్థులతో కూడా ప్రభువైన యేసు సువార్తను చెప్పడం మొదలుపెట్టారు.

  15. అతడు ప్రభువు మార్గం గురించి ఉపదేశాన్ని పొంది, తనకి యోహాను బాప్తిస్మం గురించి మాత్రమే తెలిసినప్పటికీ చాలా ఆసక్తితో యేసు గురించి స్పష్టంగా బోధిస్తున్నాడు.

  16. అతడు సమాజమందిరంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అకుల ప్రిస్కిల్లలు అతని మాటలను విని, అతన్ని తమ ఇంటికి ఆహ్వానించి దేవుని మార్గం గురించి మరింత పూర్తిగా అతనికి వివరించారు.

  17. నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘తీసుకోవడంకంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను” అని చెప్పాడు.

  18. వివాదాస్పదమైన అంశాలపై వాదన పెట్టుకోక విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోండి.

  19. కాబట్టి మనకు సమాధానాన్ని, పరస్పర వృద్ధిని కలిగించే దానినే మనం చేద్దాం.

  20. బలవంతులమైన మనం, మనల్ని మనం సంతోషపరచుకోవడం కాక బలహీనులైన వారి దోషాలను భరించవలసినవారిగా ఉన్నాము.

  21. మనలో ప్రతి ఒక్కరూ తన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కోసం వారిని సంతోషపెట్టాలి.

  22. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలైన మన సహోదరి ఫీబే గురించి మీకు ఆజ్ఞ ఇస్తున్నాను.

  23. నేను మిమ్మల్ని కోరేదేంటంటే ఆమెను ఆయన ప్రజలకు తగినట్లు ప్రభువులో చేర్చుకొని, ఆమెకు ఏమైనా సహాయం అవసరమైతే చేయండి. ఎందుకంటే ఆమె నాతో పాటు అనేకమందికి ప్రయోజనకరంగా ఉంది.

  24. యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు వందనాలు తెలియజేయండి.

  25. వారు నా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారు. నేనే కాదు యూదేతరుల సంఘాల వారందరు వారికి కృతజ్ఞులై ఉన్నారు.