Skip to content

Afflictions గురించి బైబిల్ వచనాలు

106 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కన్నీటితో విత్తేవారు సంతోషగానాలతో పంట కోస్తారు.

  2. విత్తనాలను పట్టుకుని, ఏడుస్తూ విత్తడానికి వెళ్లినవారు, సంతోషగానాలతో పనలు మోసుకువస్తారు.

  3. వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.

  4. ఎందుకంటే తండ్రి తన కుమారునిలో ఆనందించునట్లు, యెహోవా తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు.

  5. అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.

  6. గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా, రంపం దానిని ఉపయోగించే వ్యక్తి మీద ప్రగల్భాలు పలుకుతుందా? కర్ర తనను ఎత్తేవానిని ఆడించినట్లు దుడ్డుకర్ర కర్రకానివాన్ని ఆడిస్తుంది!

  7. అతిత్వరలో మీమీద నా కోపం చల్లారుతుంది నా ఉగ్రత వారి నాశనానికి దారి తీస్తుంది.”

  8. అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు; కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు!

  9. యెరూషలేములో నివసించే సీయోను ప్రజలారా! ఇకపై మీరు ఏడవరు. సహాయం కోసం మీరు చేసే మొరను విని ఆయన దయ చూపిస్తారు. ఆయన విన్న వెంటనే మీకు జవాబు ఇస్తారు.

  10. ప్రభువు మీకు శత్రువులనే రొట్టెను బాధలనే నీటిని ఇచ్చినప్పటికీ, మీ బోధకులు దాగి ఉండరు; మీ సొంత కళ్లతో వారిని చూస్తారు.

  11. మీరు కుడి వైపుకు గాని ఎడమ వైపుకు గాని తిరిగినా, “ఇదే సరియైన దారి; దీనిలో నడవండి” అని మీ చెవుల వెనుక నుండి ఒక శబ్దం వింటారు.

  12. నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను.

  13. “కొద్ది కాలం నేను నిన్ను విడిచిపెట్టాను, కానీ గొప్ప జాలితో నేను నిన్ను తిరిగి చేర్చుకుంటాను.

  14. తీవ్రమైన కోపంలో కొంతకాలం నీవైపు నేను చూడలేదు కాని నిత్యమైన కృపతో నీపై జాలి చూపిస్తాను” అని నీ విమోచకుడైన యెహోవా అంటున్నారు.

  15. వారి పాపిష్ఠి దురాశను బట్టి కోప్పడ్డాను నేను వారిని శిక్షించి కోపంతో నా ముఖం త్రిప్పుకున్నాను, అయినా వారు తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారు.

  16. యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,

  17. సీయోనులో దుఃఖిస్తున్న వారికి బూడిదకు బదులుగా అందమైన కిరీటాన్ని దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని అందించడానికి నన్ను పంపారు. యెహోవా తన వైభవాన్ని కనుపరచడానికి, నీతి అనే సింధూర చెట్లని యెహోవా నాటిన చెట్లని వారు పిలువబడతారు.

  18. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా నుండి దూరంగా బబులోనీయుల దేశానికి బందీలుగా పంపిన వారిని నేను ఈ మంచి అంజూర పండ్లలా భావిస్తున్నాను.

  19. వారికి మేలు కలిగేలా వారిపై నా దృష్టి పెడతాను. వారిని మళ్ళీ ఈ దేశానికి రప్పిస్తాను. నేను వారిని కడతాను, కూల్చివేయను; నాటుతాను, పెరికివేయను.

  20. యెహోవా ఇలా అంటున్నారు: “బబులోనుకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించి నేను చేసిన మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.

  21. నా సేవకుడైన యాకోబూ, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను నిన్ను చెదరగొట్టే దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, నిన్ను పూర్తిగా నాశనం చేయను. కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.”

  22. ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు, ఆయన మారని ప్రేమ చాలా గొప్పది.

  23. ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు.

  24. మీరు నా చేతికర్ర క్రింద దాటి వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని గమనించి మిమ్మల్ని ఒడంబడిక బంధంలోనికి తీసుకువస్తాను.

  25. పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా?