Skip to content

Afflictions గురించి బైబిల్ వచనాలు

106 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు.”

  2. ఆదాముతో ఆయన ఇలా అన్నారు, “నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి, “నిన్ను బట్టి ఈ నేల శపించబడింది; నీ జీవితకాలమంతా దాని పంట నుండి, కష్టపడి పని చేసి తింటావు.

  3. భూమి నీకోసం ముళ్ళ కంపలను గచ్చపొదలను మొలిపిస్తుంది, నీవు పొలం లోని పంటను తింటావు.

  4. నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నీవు మట్టికి చేరేవరకు, నీ నుదిటి మీద చెమట కార్చి నీ ఆహారాన్ని తింటావు నీవు మట్టివి కాబట్టి తిరిగి మన్నై పోతావు.”

  5. అప్పుడు యెహోవా అబ్రాముతో ఇలా చెప్పారు, “నీవు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి; నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, అక్కడ వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు.

  6. అయితే వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత గొప్ప ఆస్తులతో వారు బయటకు వస్తారు.

  7. మీరు నాకు హాని చేయాలనుకున్నారు కానీ ఎంతోమంది జీవితాలను కాపాడడానికి, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిని సాధించడానికి దేవుడు దానిని మేలుకే మార్చారు.

  8. కాబట్టి వారిని అణచివేయాలని వారితో వెట్టిచాకిరి చేయించడానికి వారిపై బానిస యజమానులను నియమించారు, ఫరో కోసం పీతోము రామెసేసు అనే రెండు పట్టణాలను గిడ్డంగులుగా కట్టారు.

  9. అయితే వారు ఎంతగా అణచివేయబడ్డారో, అంతకన్నా ఎక్కువ విస్తరించి వారు వ్యాపించారు; కాబట్టి ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలీయులను బట్టి భయపడి,

  10. మీ పిల్లలు ఇక్కడ నలభై సంవత్సరాలు కాపరులుగా ఉంటారు, మీలో చివరి శవం ఈ అరణ్యంలో రాలిపోయే వరకు, మీ నమ్మకద్రోహాన్ని బట్టి మీ వ్యభిచారశిక్షను భరిస్తారు.

  11. ఒకరు తన కుమారుని ఎలా క్రమశిక్షణలో పెడతారో, అలాగే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని మీ హృదయంలో మీరు గ్రహించాలి.

  12. ఆయన మిమ్మల్ని విషసర్పాలు, తేళ్లు ఉన్న నీళ్లు లేని భయంకరమైన పెద్ద అరణ్యంలో నుండి నడిపించారు. రాతి బండ నుండి మీకు నీళ్లు ఇచ్చారు.

  13. ఆయన అరణ్యంలో మీ పూర్వికులకు ఎన్నడూ తెలియని మన్నాను మీకు తినడానికి ఇచ్చారు, మిమ్మల్ని తగ్గించడానికి మిమ్మల్ని పరీక్షించడానికి మీ మంచి కోసం ఇచ్చారు.

  14. కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు.

  15. ఎలీషా వారితో ఇంకా మాట్లాడుతుండగానే, ఆ దూత అతని దగ్గరకు వచ్చాడు. రాజు, “ఈ ఆపద యెహోవా నుండి వచ్చింది. నేను యెహోవా కోసం ఇంకా ఎందుకు కనిపెట్టాలి?” అన్నాడు.

  16. “మేము చేసిన చెడు పనులకు, మా గొప్ప అపరాధానికి ఫలితంగా ఇలా మాకు జరిగింది. అయినప్పటికీ, మా దేవుడవైన మీరు మా దోషాలకు తగిన పూర్తి శిక్షను మాకు విధించకుండా ఈ విధంగా కొంతమందిని దాస్యం నుండి తప్పించారు.

  17. నేను చూసినంత వరకు చెడును దున్ని కీడును నాటేవారు దానినే కోస్తారు.

  18. కష్టం దుమ్ములో నుండి పుట్టదు. బాధ భూమిలో నుండి మొలకెత్తదు.

  19. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు బాధల కోసమే పుడుతున్నారు.

  20. “దేవుడు సరిదిద్దేవారు ధన్యులు; కాబట్టి సర్వశక్తిమంతుని క్రమశిక్షణను నిర్లక్ష్యం చేయకు.

  21. “ఆయన వచ్చి, నిన్ను చెరసాలలో బంధిస్తే న్యాయసభను ఏర్పాటుచేస్తే, ఆయనను ఎవరు అడ్డగించగలరు?

  22. “స్త్రీకి పుట్టిన మనుష్యులు, ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు.

  23. దేవా, నాకు అలసట కలిగించారు; నా కుటుంబమంతటిని వినాశనం చేశారు.

  24. మీరు నన్ను అస్థిపంజరంలా చేశారు అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది; బక్కచిక్కిన నా దేహం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తుంది.

  25. దేవుడు తన కోపంలో నా మీద దాడి చేసి నన్ను చీల్చివేశారు; ఆయన నా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతున్నారు; నాకు శత్రువై నాపై కన్నెర్ర చేసి నావైపు కోపంగా చూస్తున్నారు.