circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- లూకా 22:6సుమారు క్రీ.శ. 33
వాడు దానికి అంగీకరించి, ప్రజల గుంపు ఆయనతో లేనప్పుడు యేసును వారికి అప్పగించడానికి అవకాశం కోసం ఎదురుచూశాడు.
- లూకా 22:7సుమారు క్రీ.శ. 33
పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు,
- లూకా 22:8సుమారు క్రీ.శ. 33
యేసు పేతురు యోహానును పిలిచి, “మీరు వెళ్లి మనం పస్కాను భుజించడానికి సిద్ధం చేయండి” అని పంపారు.
- లూకా 22:9సుమారు క్రీ.శ. 33
కాబట్టి వారు, “మేము ఎక్కడ ఏర్పాటు చేయాలి?” అని అడిగారు.
- లూకా 22:10సుమారు క్రీ.శ. 33
అందుకు ఆయన, “మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు, నీళ్లకుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కలుస్తాడు, అతడు ప్రవేశించే ఇంటి వరకు అతన్ని వెంబడించి,
- లూకా 22:11సుమారు క్రీ.శ. 33
ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి, అతిథుల గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడగమన్నాడు’ అని చెప్పండి.
- లూకా 22:12సుమారు క్రీ.శ. 33
అతడు అన్ని సదుపాయాలతో ఉన్న ఒక పెద్ద మేడగదిని మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని చెప్పారు.
- లూకా 22:13సుమారు క్రీ.శ. 33
వారు అక్కడికి వెళ్లి యేసు చెప్పినట్లుగా వాటిని కనుగొని పస్కా భోజనాన్ని సిద్ధం చేశారు.
- లూకా 22:14సుమారు క్రీ.శ. 33
వారు పస్కా భుజించే సమయం వచ్చినపుడు, ఆయన తన అపొస్తలులతో భోజనబల్ల దగ్గర కూర్చున్నారు.
- లూకా 22:15సుమారు క్రీ.శ. 33
ఆయన వారితో, “నేను శ్రమను అనుభవించక ముందు ఈరీతిగా మీ అందరితో కలిసి ఈ పస్కా విందును భుజించాలని ఎంతో ఆశించాను.
- లూకా 22:16సుమారు క్రీ.శ. 33
ఎందుకంటే, ఇది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు, మరలా దీనిని నేను భుజించను అని మీకు చెప్తున్నాను” అన్నారు.
- లూకా 22:17సుమారు క్రీ.శ. 33
ఆయన గిన్నెను తీసుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, “ఇది తీసుకుని మీరందరు పంచుకోండి.
- లూకా 22:18సుమారు క్రీ.శ. 33
దేవుని రాజ్యం వచ్చేవరకు మళ్ళీ ఈ ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుతున్నాను” అన్నారు.
- లూకా 22:19సుమారు క్రీ.శ. 33
ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, “ఇది మీ కోసం ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.
- లూకా 22:20సుమారు క్రీ.శ. 33
అలాగే, భోజనమైన తర్వాత, ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందించనున్న నా రక్తంలో క్రొత్త నిబంధన.
- లూకా 22:21సుమారు క్రీ.శ. 33
కాని నన్ను అప్పగించబోయే వాని చేయి నాతోకూడ ఈ బల్ల మీద ఉంది.
- లూకా 22:22సుమారు క్రీ.శ. 33
నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లిపోతారు, కాని ఆయనను అప్పగించే వానికి శ్రమ!” అని అన్నారు.
- లూకా 22:23సుమారు క్రీ.శ. 33
అలా చేయబోయేది ఎవరు అని వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.
- లూకా 22:24సుమారు క్రీ.శ. 33
అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది.
- లూకా 22:25సుమారు క్రీ.శ. 33
యేసు వారితో, “యూదేతరుల రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు; వారి మీద అధికారం చేసేవారు తమను తాము ఉపకారులుగా పిలుచుకుంటారు.
- లూకా 22:26సుమారు క్రీ.శ. 33
కానీ మీరు వారిలా ఉండవద్దు. దాని బదులు, మీలో గొప్పవాడు అందరిలో చిన్నవానిగా ఉండాలి, అధికారి దాసునిగా ఉండాలి.
- లూకా 22:27సుమారు క్రీ.శ. 33
అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేదా సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్నవాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను.
- లూకా 22:28సుమారు క్రీ.శ. 33
మీరైతే నా శోధన సమయంలో నాతో నిలిచి ఉన్నవారు.
- లూకా 22:29సుమారు క్రీ.శ. 33
కాబట్టి నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్టుగా, నా రాజ్యంలో మీరు నా భోజనబల్ల దగ్గర కూర్చుని అన్నపానాలను పుచ్చుకొంటూ, సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీర్చుటకు నేను మీకు నా రాజ్యాన్ని అనుగ్రహించాను.
- లూకా 22:30సుమారు క్రీ.శ. 33
That ye may eat and drink at my table in my kingdom, and sit on thrones judging the twelve tribes of Israel.