circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- లూకా 20:41సుమారు క్రీ.శ. 33
యేసు వారితో, “క్రీస్తు దావీదు కుమారుడని ఎందుకు చెప్పబడింది?
- లూకా 20:42సుమారు క్రీ.శ. 33
దావీదే స్వయంగా కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాశాడు: “ ‘నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు
- లూకా 20:43సుమారు క్రీ.శ. 33
“నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
- లూకా 20:44సుమారు క్రీ.శ. 33
దావీదే ఆయనను, ‘ప్రభువు’ అని పిలిచినప్పుడు ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?”
- లూకా 20:45సుమారు క్రీ.శ. 33
ప్రజలందరు వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో,
- లూకా 20:46సుమారు క్రీ.శ. 33
“ధర్మశాస్త్ర ఉపదేశకులను గురించి జాగ్రత్తగా ఉండండి. వారు పొడుగు అంగీలు వేసుకుని సంత వీధుల్లో తిరుగుతూ ప్రజల నుండి గౌరవం అందుకోవడానికి ఇష్టపడతారు. వారు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాలను విందుల్లో గౌరవ స్థలాలను పొందాలని కోరుకుంటారు.
- లూకా 20:47సుమారు క్రీ.శ. 33
వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.
- లూకా 21:1సుమారు క్రీ.శ. 33
దేవాలయ కానుక పెట్టెలో కానుకలను వేస్తున్న ధనవంతులను యేసు గమనించి చూస్తున్నారు.
- లూకా 21:2సుమారు క్రీ.శ. 33
అప్పుడు ఒక బీద విధవరాలు రెండు చిన్న కాసులు అందులో వేయడం చూసి యేసు, “నేను మీతో నిజంగా చెప్తున్న, అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది.
- లూకా 21:3సుమారు క్రీ.శ. 33
And he said, Of a truth I say unto you, that this poor widow hath cast in more than they all:
- లూకా 21:4సుమారు క్రీ.శ. 33
వీరందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత వేశారు. కాని ఈమె తన పేదరికం నుండి తన జీవనాధారమంతా వేసింది” అని అన్నారు.
- లూకా 21:5సుమారు క్రీ.శ. 33
ఆయన శిష్యులలో కొందరు దేవాలయం అందమైన రాళ్లతో దేవునికి ఇచ్చిన అర్పణలతో అలంకరించబడి ఉందని మాట్లాడుకుంటున్నారు. కాని యేసు వారితో,
- లూకా 21:6సుమారు క్రీ.శ. 33
“ఇక్కడ మీరు వీటిని చూస్తున్నారు కదా, వీటిలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ పడవేయబడే రోజులు వస్తున్నాయి” అని చెప్పారు.
- లూకా 21:7సుమారు క్రీ.శ. 33
అందుకు వారు, “బోధకుడా, ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ నెరవేరడానికి ముందు సూచనలు ఏమైనా కనబడతాయా? మాకు చెప్పండి” అని ఆయనను అడిగారు.
- లూకా 21:8సుమారు క్రీ.శ. 33
అందుకు ఆయన, “మీరు మోసగించబడకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ ‘సమయం సమీపించింది’ అని చెప్తారు. వారిని అనుసరించవద్దు.
- లూకా 21:9సుమారు క్రీ.శ. 33
మీరు యుద్ధాల గురించి, విప్లవాలను గురించి విన్నప్పుడు భయపడవద్దు. అలాంటివన్ని జరగ వలసి ఉంది, కాని అంతం అప్పుడే రాదు.”
- లూకా 21:10సుమారు క్రీ.శ. 33
తర్వాత ఆయన వారితో: “జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి.
- లూకా 21:11సుమారు క్రీ.శ. 33
అక్కడక్కడ గొప్ప భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయి. ఆకాశంలో కూడ భయంకరమైన సంఘటనలు, గొప్ప సూచనలు కనిపిస్తాయి.
- లూకా 21:12సుమారు క్రీ.శ. 33
“ఇవన్నీ జరుగక ముందు, వారు మిమ్మల్ని బలవంతంగా పట్టుకుని హింసిస్తారు. వారు మిమ్మల్ని సమాజమందిరాలకు అప్పగిస్తారు మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, నా నామాన్ని బట్టి మీరు రాజుల ఎదుటకు అధికారుల ఎదుటకు కొనిపోబడతారు.
- లూకా 21:13సుమారు క్రీ.శ. 33
మీరు నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు.
- లూకా 21:14సుమారు క్రీ.శ. 33
అయితే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని ముందుగానే చింతించకుండ ఉండేలా మీ మనస్సును సిద్ధపరచుకోండి.
- లూకా 21:15సుమారు క్రీ.శ. 33
ఎందుకంటే మీ విరోధులు ఎదిరించడానికి గాని, నిరాకరించడానికి గాని వీలుకాని మాటలను జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను.
- లూకా 21:16సుమారు క్రీ.శ. 33
మీ తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరీలు, బంధువులు, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు, వారు మీలో కొందరిని చంపుతారు.
- లూకా 21:17సుమారు క్రీ.శ. 33
నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు.
- లూకా 21:18సుమారు క్రీ.శ. 33
కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు.