కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లూకా 21:19సుమారు క్రీ.శ. 33

    స్థిరంగా ఉండండి, అప్పుడు మీరు ప్రాణాలు కాపాడుకుంటారు.

  2. లూకా 21:20సుమారు క్రీ.శ. 33

    “యెరూషలేము పట్టణాన్ని సైన్యాలు చుట్టుముట్టాయని మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపించిందని మీరు తెలుసుకోండి.

  3. లూకా 21:21సుమారు క్రీ.శ. 33

    అప్పుడు యూదయలోని వారు కొండల్లోకి పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు వెళ్లిపోవాలి, బయట పొలాల్లో ఉన్నవారు పట్టణంలోనికి వెళ్లకూడదు.

  4. లూకా 21:22సుమారు క్రీ.శ. 33

    ఎందుకంటే లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారం దండన నెరవేరే సమయం ఇదే!

  5. లూకా 21:23సుమారు క్రీ.శ. 33

    ఆ దినాల్లో గర్భిణి స్త్రీలకు పాలిచ్చే తల్లులకు శ్రమ! ఈ ప్రజల మీద దేవుని కోపం దిగి భూమి మీద బహు భయంకరమైన దురవస్థ కలుగుతుంది.

  6. లూకా 21:24సుమారు క్రీ.శ. 33

    ఆ సమయంలో వారు ఖడ్గంచే హతం అవుతారు ఖైదీలుగా అన్ని రాజ్యాలకు అప్పగించబడతారు. యూదేతరుల పరిపాలన కాలం అంతా పూర్తయ్యే వరకు యూదేతరులు యెరూషలేము పట్టణాన్ని అణగద్రొక్కుతారు.

  7. లూకా 21:25సుమారు క్రీ.శ. 33

    “ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్ర తరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి.

  8. లూకా 21:26సుమారు క్రీ.శ. 33

    ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి కాబట్టి భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో వణికిపోతారు.

  9. లూకా 21:27సుమారు క్రీ.శ. 33

    అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావంతో గొప్ప మహిమతో మేఘాల మీద రావడం చూస్తారు.

  10. లూకా 21:28సుమారు క్రీ.శ. 33

    ఇలా జరగటం మొదలైనప్పుడు మీకు విడుదల అతి సమీపంగా ఉందని గ్రహించి, ధైర్యంతో మీ తలలను పైకి లేవనెత్తండి” అని చెప్పారు.

  11. లూకా 21:29సుమారు క్రీ.శ. 33

    ఆయన వారికి ఉపమానం చెప్పారు: “అంజూర చెట్టును ఇతర చెట్లను చూడండి.

  12. లూకా 21:30సుమారు క్రీ.శ. 33

    అవి చిగిరిస్తున్నాయి అని చూసి, వేసవికాలం సమీపంగా ఉందని మీరు తెలుసుకుంటారు గదా!

  13. లూకా 21:31సుమారు క్రీ.శ. 33

    అలాగే, ఇవన్నీ జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, దేవుని రాజ్యం చాలా దగ్గరలో ఉందని మీరు తెలుసుకోండి.

  14. లూకా 21:32సుమారు క్రీ.శ. 33

    “ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను.

  15. లూకా 21:33సుమారు క్రీ.శ. 33

    ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు.

  16. లూకా 21:34సుమారు క్రీ.శ. 33

    “అకస్మాత్తుగా వలలో చిక్కినట్లు ఆ దినం మీ మీదికి వస్తుంది, అలా రాకుండా, తిని త్రాగి మత్తెక్కడం వలన జీవితంలోని ఆందోళనల వలన మీ హృదయాలు బరువెక్కకుండ జాగ్రత్తగా చూసుకోండి.

  17. లూకా 21:35సుమారు క్రీ.శ. 33

    ఆ దినం భూమి మీద ఉన్న వారందరి మీదకు అకస్మాత్తుగా వస్తుంది.

  18. లూకా 21:36సుమారు క్రీ.శ. 33

    కాబట్టి జరగబోయే వాటన్నిటి నుండి తప్పించుకుని, మనుష్యకుమారుని ముందు నిర్దోషిగా నిలబడగలిగేలా అన్ని సమయాల్లో మెలకువగా ఉండి ప్రార్థించండి” అని చెప్పారు.

  19. లూకా 21:37సుమారు క్రీ.శ. 33

    ఆయన ప్రతిరోజు పగలు దేవాలయంలో బోధిస్తూ, రాత్రులు ఒలీవ కొండపై గడిపేవారు.

  20. లూకా 21:38సుమారు క్రీ.శ. 33

    ప్రజలందరు ఆయన మాటలను వినడానికి వేకువనే దేవాలయానికి వచ్చేవారు.

  21. లూకా 22:1సుమారు క్రీ.శ. 33

    పస్కా అనే పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు,

  22. లూకా 22:2సుమారు క్రీ.శ. 33

    ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసును ఎలా చంపించాలా అని అవకాశం కోసం చూస్తున్నారు, ఎందుకంటే వారు ప్రజలకు భయపడ్డారు.

  23. లూకా 22:3సుమారు క్రీ.శ. 33

    అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.

  24. లూకా 22:4సుమారు క్రీ.శ. 33

    కాబట్టి వాడు ముఖ్య యాజకులతో దేవాలయ కావలివారి అధికారులతో కలిసి యేసును వారికి ఎలా అప్పగించబోతున్నాడో వారితో చర్చించుకున్నాడు.

  25. లూకా 22:5సుమారు క్రీ.శ. 33

    వారు వాని మాటలకు సంతోషించి వానికి డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.