circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- లూకా 22:56సుమారు క్రీ.శ. 33
అప్పుడు ఆ మంట వెలుతురులో ఒక దాసియైన అమ్మాయి అతన్ని తేరి చూసి, “ఇతడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నది.
- లూకా 22:57సుమారు క్రీ.శ. 33
పేతురు దానిని నిరాకరించి, “అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు” అన్నాడు.
- లూకా 22:58సుమారు క్రీ.శ. 33
కొంతసేపు తర్వాత ఇంకొకడు అతన్ని చూసి, “నీవు కూడా వారిలో ఒకడివి” అన్నాడు. పేతురు, “నేను కాదు!” అన్నాడు.
- లూకా 22:59సుమారు క్రీ.శ. 33
ఇంచుమించు ఒక గంట సమయం తర్వాత మరొకడు, “వీడు గలిలయుడే, నిజంగానే వీడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నాడు.
- లూకా 22:60సుమారు క్రీ.శ. 33
అందుకు పేతురు, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్తుండగానే కోడి కూసింది.
- లూకా 22:61సుమారు క్రీ.శ. 33
అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశారు అప్పుడు పేతురు, “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని,
- లూకా 22:62సుమారు క్రీ.శ. 33
బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.
- లూకా 22:63సుమారు క్రీ.శ. 33
యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు.
- లూకా 22:64సుమారు క్రీ.శ. 33
వారు ఆయన ముఖాన్ని కప్పి, “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు!” అన్నారు.
- లూకా 22:65సుమారు క్రీ.శ. 33
ఆయనను దూషిస్తూ అనేక మాటలు అన్నారు.
- లూకా 22:66సుమారు క్రీ.శ. 33
ఉదయం కాగానే ప్రజానాయకుల సభ, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సమావేశమయ్యారు, యేసు వారి ముందు నడిపించబడ్డారు.
- లూకా 22:67సుమారు క్రీ.శ. 33
“నీవు క్రీస్తువైతే, మాతో చెప్పు” అన్నారు. అందుకు యేసు, “నేను మీతో చెప్పినా, మీరు నమ్మరు.
- లూకా 22:68సుమారు క్రీ.శ. 33
ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినా, మీరు నాకు జవాబు చెప్పరు.
- లూకా 22:69సుమారు క్రీ.శ. 33
కానీ ఇప్పటినుండి మనుష్యకుమారుడు శక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుంటాడు” అని వారితో చెప్పారు.
- లూకా 22:70సుమారు క్రీ.శ. 33
అందుకు వారందరు, “నీవు దేవుని కుమారుడవా?” అని అడిగారు. అందుకు ఆయన, “అని మీరే అంటున్నారు” అని వారితో చెప్పారు.
- లూకా 22:71సుమారు క్రీ.శ. 33
అందుకు వారు, “మనకు ఇంకా సాక్ష్యం ఏం అవసరం? స్వయంగా ఇతడే తన నోటితో పలకడం విన్నాం” అన్నారు.
- లూకా 23:1సుమారు క్రీ.శ. 33
ఆ సభ వారందరు లేచి యేసును పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు.
- లూకా 23:2సుమారు క్రీ.శ. 33
వారు ఆయన మీద, “ఇతడు మన దేశాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడని మేము తెలుసుకున్నాము. ఇతడు కైసరుకు పన్ను కట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాడు నేనే రాజైన క్రీస్తును అని చెప్పుకుంటున్నాడు” అని నేరారోపణ చేయడం మొదలుపెట్టారు.
- లూకా 23:3సుమారు క్రీ.శ. 33
అందుకు పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. దానికి యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు.
- లూకా 23:4సుమారు క్రీ.శ. 33
అందుకు అధిపతి పిలాతు, ముఖ్య యాజకులతో జనసమూహంతో, “ఇతనిలో నాకే దోషం కనిపించలేదు” అన్నాడు.
- లూకా 23:5సుమారు క్రీ.శ. 33
అయినా వారు పట్టుబట్టి, “ఇతడు తన బోధలతో గలిలయ నుండి యూదయ ప్రాంతమంతట ప్రజలను రెచ్చగొడుతూ, ఇక్కడి వరకు వచ్చాడు” అన్నారు.
- లూకా 23:6సుమారు క్రీ.శ. 33
ఇది విన్న పిలాతు, “ఈయన గలిలయుడా?” అని అడిగాడు.
- లూకా 23:7సుమారు క్రీ.శ. 33
యేసు హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రాంతానికి చెందినవాడని పిలాతుకు తెలిసినప్పుడు, ఆ రోజు యెరూషలేములోనే ఉన్న హేరోదు దగ్గరకు ఆయనను పంపించాడు.
- లూకా 23:8సుమారు క్రీ.శ. 33
హేరోదు చాలా కాలం నుండి యేసును చూడాలని ఆశపడ్డాడు, కాబట్టి ఆయనను చూడగానే అతడు చాలా సంతోషించాడు. యేసు గురించి తాను అనేక సంగతులను విన్నాడు కాబట్టి ఆయన ఏదైనా సూచకక్రియ చేస్తే చూడాలని ఆశించాడు.
- లూకా 23:9సుమారు క్రీ.శ. 33
హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కాని యేసు వాటికి జవాబివ్వలేదు.