కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లూకా 23:35సుమారు క్రీ.శ. 33

    ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు, అధికారులు కూడ, “వీడు ఇతరులను రక్షించాడు; వీడు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అని అంటూ ఎగతాళి చేశారు.

  2. లూకా 23:36సుమారు క్రీ.శ. 33

    అప్పుడు సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చిరకాను పులిసిన ద్రాక్షరసం అందించి,

  3. లూకా 23:37సుమారు క్రీ.శ. 33

    “నీవు యూదుల రాజువైతే, నిన్ను నీవే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు.

  4. లూకా 23:38సుమారు క్రీ.శ. 33

    ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది: ఇతడు యూదుల రాజు.

  5. లూకా 23:39సుమారు క్రీ.శ. 33

    వ్రేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయనను అవమానిస్తూ, “నీవు క్రీస్తువు కాదా? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడ రక్షించు!” అని హేళన చేశాడు.

  6. లూకా 23:40సుమారు క్రీ.శ. 33

    కానీ మరొక నేరస్థుడు వానిని గద్దించి, “నీవు కూడా అదే శిక్షను పొందుతున్నావు, నీవు దేవునికి భయపడవా?” అన్నాడు.

  7. లూకా 23:41సుమారు క్రీ.శ. 33

    “మనం చేసిన తప్పులకు న్యాయంగానే శిక్షను అనుభవిస్తున్నాం కాని ఈయన ఏ తప్పు చేయలేదు” అన్నాడు.

  8. లూకా 23:42సుమారు క్రీ.శ. 33

    ఆ తర్వాత ఆ నేరస్థుడు యేసును చూసి, “నీవు నీ రాజ్యంలోనికి వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు.

  9. లూకా 23:43సుమారు క్రీ.శ. 33

    యేసు వానితో, “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉంటావని, నీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు.

  10. లూకా 23:44సుమారు క్రీ.శ. 33

    అప్పుడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.

  11. లూకా 23:45సుమారు క్రీ.శ. 33

    సూర్యుడు కాంతినివ్వలేదు. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది.

  12. లూకా 23:46సుమారు క్రీ.శ. 33

    అప్పుడు యేసు, “తండ్రీ, మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను” అని గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన ఈ మాట చెప్పి, తన ప్రాణం విడిచారు.

  13. లూకా 23:47సుమారు క్రీ.శ. 33

    శతాధిపతి, జరిగింది చూసి, “నిజంగా ఈయన నీతిమంతుడు” అని చెప్పి దేవుని స్తుతించాడు.

  14. లూకా 23:48సుమారు క్రీ.శ. 33

    ఈ దృశ్యాన్ని చూస్తూ అక్కడ ఉన్న ప్రజలందరు జరిగిందంతా చూసి, రొమ్ము కొట్టుకొంటూ తిరిగి వెళ్లిపోయారు.

  15. లూకా 23:49సుమారు క్రీ.శ. 33

    ఆయనతో పరిచయం ఉన్నవారందరు, గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలతో సహా అందరు దూరంగా నిలబడి చూస్తున్నారు.

  16. లూకా 23:50సుమారు క్రీ.శ. 33

    అరిమతయికు చెందిన యోసేపు యూదుల న్యాయసభలో సభ్యుడు, మంచివాడు నీతిపరుడు.

  17. లూకా 23:51సుమారు క్రీ.శ. 33

    అతడు ఇతర న్యాయసభ సభ్యుల తీర్మానానికి గాని వారి చర్యకు గాని అంగీకరించకుండా దేవుని రాజ్యం కోసం కనిపెడుతూ ఉండినవాడు.

  18. లూకా 23:52సుమారు క్రీ.శ. 33

    అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.

  19. లూకా 23:53సుమారు క్రీ.శ. 33

    తర్వాత అతడు దాన్ని క్రిందకు దింపి, దానిని సన్నపు నారబట్టతో చుట్టి, అంతకుముందు ఎవరి శరీరాన్ని ఎప్పుడూ పెట్టని రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు.

  20. లూకా 23:54సుమారు క్రీ.శ. 33

    అది సిద్ధపాటు దినం సబ్బాతు దినం మొదలుకాబోతుంది.

  21. లూకా 23:55సుమారు క్రీ.శ. 33

    అప్పుడు గలిలయ నుండి యేసును వెంబడిస్తూ వచ్చిన స్త్రీలు అతని వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహాన్ని ఎలా పెట్టారో చూశారు.

  22. లూకా 23:56సుమారు క్రీ.శ. 33

    తర్వాత వారు ఇంటికి వెళ్లి, సుగంధ ద్రవ్యాలను, పరిమళ తైలాలను సిద్ధం చేసుకున్నారు. కాని వారు ఆజ్ఞకు లోబడుతూ సబ్బాతు దినాన విశ్రాంతి తీసుకున్నారు.

  23. లూకా 24:1సుమారు క్రీ.శ. 33

    వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు.

  24. లూకా 24:2సుమారు క్రీ.శ. 33

    వారు సమాధి రాయి దొర్లించబడి ఉండడం చూశారు,

  25. లూకా 24:3సుమారు క్రీ.శ. 33

    కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు.