circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- లూకా 24:29సుమారు క్రీ.శ. 33
అందుకని వారు, “ప్రొద్దు గ్రుంకి, సాయంకాలం కావచ్చింది, కాబట్టి మాతో కూడ ఉండండి” అని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడ ఇంట్లోకి వెళ్లారు.
- లూకా 24:30సుమారు క్రీ.శ. 33
యేసు వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఆయన ఒక రొట్టెను తీసుకుని, కృతజ్ఞత చెల్లించి, దానిని విరిచి వారికి ఇవ్వడం మొదలుపెట్టారు.
- లూకా 24:31సుమారు క్రీ.శ. 33
అప్పుడు వారి కళ్లు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు, అయితే ఆయన వారికి కనబడకుండా పోయారు.
- లూకా 24:32సుమారు క్రీ.శ. 33
అప్పుడు వారు ఒకనితో ఒకడు, “ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనాలు వివరిస్తూ ఉంటే మన అంతరంగంలో మన హృదయాలు మండుతున్నట్లు అనిపించలేదా?” అని చెప్పుకొన్నారు.
- లూకా 24:33సుమారు క్రీ.శ. 33
వారు వెంటనే లేచి యెరూషలేముకు తిరిగి వెళ్లారు. అక్కడ పదకొండు మంది శిష్యులు వారితో ఉన్నవారందరు సమకూడి,
- లూకా 24:34సుమారు క్రీ.శ. 33
వారు, “అది నిజమే! ప్రభువు నిజంగానే లేచి సీమోనుకు కనిపించారు” అని మాట్లాడుకుంటున్నారు.
- లూకా 24:35సుమారు క్రీ.శ. 33
అప్పుడు ఆ ఇద్దరు దారిలో జరిగిన సంగతులను, యేసు రొట్టె విరిచేటప్పుడు ఆయనను ఎలా గుర్తించారో అని వారికి చెప్పారు.
- లూకా 24:36సుమారు క్రీ.శ. 33
వారు దాని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగా, యేసు తానే వారి మధ్య నిలబడి, “మీకు సమాధానం కలుగును గాక!” అని వారితో అన్నారు.
- లూకా 24:37సుమారు క్రీ.శ. 33
తాము భూతాన్ని చూసామనుకొని వారు భయపడి వణికిపోయారు.
- లూకా 24:38సుమారు క్రీ.శ. 33
ఆయన వారితో, “మీరెందుకు కలవరపడుతున్నారు, మీ మనస్సుల్లో ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి?
- లూకా 24:39సుమారు క్రీ.శ. 33
నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు” అని చెప్పారు.
- లూకా 24:40సుమారు క్రీ.శ. 33
ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు.
- లూకా 24:41సుమారు క్రీ.శ. 33
అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, “ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?” అని అడిగారు.
- లూకా 24:42సుమారు క్రీ.శ. 33
వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు.
- లూకా 24:43సుమారు క్రీ.శ. 33
ఆయన దానిని తీసుకుని వారి ముందే తిన్నారు.
- లూకా 24:44సుమారు క్రీ.శ. 33
తర్వాత ఆయన వారితో, “మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథాల్లోను, కీర్తనల పుస్తకంలోను నన్ను గురించి వ్రాయబడినవి అన్ని నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను కదా!” అని అన్నారు.
- లూకా 24:45సుమారు క్రీ.శ. 33
అప్పుడు వారు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచారు.
- లూకా 24:46సుమారు క్రీ.శ. 33
ఆయన వారితో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు హింసించబడి మూడవ రోజున మరణం నుండి లేస్తారని,
- లూకా 24:47సుమారు క్రీ.శ. 33
యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసు పేరట పశ్చాత్తాపం పాపక్షమాపణ ప్రకటించబడుతుంది.
- లూకా 24:48సుమారు క్రీ.శ. 33
ఈ సంగతులన్నిటికి మీరే సాక్షులు.
- లూకా 24:49సుమారు క్రీ.శ. 33
నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ దగ్గరకు పంపిస్తున్నాను కాబట్టి పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకునే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు.
- లూకా 24:50సుమారు క్రీ.శ. 33
ఆయన బేతనియా ప్రాంతం వరకు వారిని తీసుకుని వెళ్లి, చేతులెత్తి వారిని ఆశీర్వదించారు.
- లూకా 24:51సుమారు క్రీ.శ. 33
వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యారు.
- లూకా 24:52సుమారు క్రీ.శ. 33
వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
- లూకా 24:53సుమారు క్రీ.శ. 33
వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.