circa 800–400 BC
The Hebrew Prophets
God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.
ఈ కాలపు వచనాలు
- యిర్మీయా 13:14సుమారు క్రీ.పూ. 599
అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అలాగే అందరిని ఒకరిపై ఒకరు పడేలా చేస్తాను, వారిపై దయ కరుణ కనికరం లేకుండా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
- యిర్మీయా 13:15సుమారు క్రీ.పూ. 599
వినండి శ్రద్ధ వహించండి, గర్వపడకండి, అని యెహోవా చెప్తున్నారు.
- యిర్మీయా 13:16సుమారు క్రీ.పూ. 599
చీకటి కమ్ముతున్న కొండలమీద మీ పాదాలు తడబడక ముందే, మీ దేవుడైన యెహోవా చీకటి తేక ముందే మీ దేవుడైన యెహోవాను మహిమపరచండి. మీరు వెలుగు కోసం ఎదురుచూస్తారు, కానీ ఆయన దానిని పూర్తిగా చీకటిగా గాఢమైన చీకటిగా మారుస్తారు.
- యిర్మీయా 13:17సుమారు క్రీ.పూ. 599
మీరు వినకపోతే మీ గర్వాన్ని బట్టి నేను రహస్యంగా ఏడుస్తాను; యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి.
- యిర్మీయా 13:18సుమారు క్రీ.పూ. 599
రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు, “మీర మీ సింహాసనాలు దిగిరండి, ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు మీ తలల నుండి పడిపోతాయి.”
- యిర్మీయా 13:19సుమారు క్రీ.పూ. 599
దక్షిణ వైపు ఉన్న పట్టణాలు మూసివేయబడతాయి, వాటిని తెరవడానికి పట్టించుకునేవారే ఉండరు. యూదా వారంతా బందీగా కొనిపోబడతారు, ఏమి మిగులకుండ పూర్తిగా కొనిపోబడతారు.
- యిర్మీయా 13:20సుమారు క్రీ.పూ. 599
కళ్లు పైకెత్తి ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి. నీకు అప్పగించబడిన మంద, నీవు గొప్పలు చెప్పుకున్న గొర్రెలు ఎక్కడ?
- యిర్మీయా 13:21సుమారు క్రీ.పూ. 599
నీ ప్రత్యేక మిత్రులుగా నీవు చేసుకొన్న వారిని యెహోవా నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేమంటావు? ప్రసవిస్తున్న స్త్రీ పడే బాధలాంటి బాధ నీకు కలుగదా?
- యిర్మీయా 13:22సుమారు క్రీ.పూ. 599
“నాకే ఎందుకు ఇలా జరిగింది?” అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే నీ అనేక పాపాల కారణంగానే నీ వస్త్రాలు చింపబడ్డాయి నీ శరీరం అసభ్యంగా తాకబడింది.
- యిర్మీయా 13:23సుమారు క్రీ.పూ. 599
కూషీయుడు తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? అలాగే చెడు చేయడం అలవాటైన మీరు మంచి చేయలేరు.
- యిర్మీయా 13:24సుమారు క్రీ.పూ. 599
“ఎడారి గాలికి కొట్టుకుపోయే పొట్టులా నేను నిన్ను చెదరగొడతాను.
- యిర్మీయా 13:25సుమారు క్రీ.పూ. 599
ఇదే నీ భాగం, నేను నీకు నియమించిన భాగం, ఎందుకంటే నీవు నన్ను మరచిపోయి అబద్ధ దేవుళ్ళపై నమ్మకం ఉంచావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
- యిర్మీయా 13:26సుమారు క్రీ.పూ. 599
“నీ అవమానం కనబడేలా నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను.
- యిర్మీయా 13:27సుమారు క్రీ.పూ. 599
నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు, నీ సిగ్గులేని వ్యభిచారం! కొండలమీద, పొలాల్లో నీ హేయమైన పనులు నేను చూశాను. యెరూషలేమా, నీకు శ్రమ! నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?”
- యిర్మీయా 14:1సుమారు క్రీ.పూ. 605
అనావృష్టి గురించి యిర్మీయాకు వచ్చిన యెహోవా వాక్కు ఇది:
- యిర్మీయా 14:2సుమారు క్రీ.పూ. 605
“యూదా దుఃఖిస్తుంది, ఆమె పట్టణాలు వాడిపోతున్నాయి. వారు భూమి కోసం విలపిస్తున్నారు, యెరూషలేము నుండి కేకలు వినిపిస్తున్నాయి.
- యిర్మీయా 14:3సుమారు క్రీ.పూ. 605
అధిపతులు నీళ్ల కోసం తమ సేవకులను పంపుతారు; వారు నీళ్ల తొట్టెల దగ్గరకు వెళ్తారు కానీ నీళ్లు దొరకవు. వారు ఖాళీ పాత్రలతో తిరిగి వస్తారు; నిరాశ నిస్పృహలతో, వారు తమ తలలను కప్పుకుంటారు.
- యిర్మీయా 14:4సుమారు క్రీ.పూ. 605
దేశంలో వర్షం కురవకపోవడం వల్ల నేల చీలిపోయింది; రైతులు సిగ్గుతో తలలు కప్పుకున్నారు.
- యిర్మీయా 14:5సుమారు క్రీ.పూ. 605
పొలంలో ఉన్న జింక కూడా గడ్డి లేనందున అప్పుడే పుట్టిన తన పిల్లలను విడిచిపెడుతుంది.
- యిర్మీయా 14:6సుమారు క్రీ.పూ. 605
అడవి గాడిదలు బంజరు కొండలమీద నిలబడి నక్కల్లా రొప్పుతాయి. మేత లేకపోవడంతో వాటి కళ్లు క్షీణిస్తున్నాయి.”
- యిర్మీయా 14:7సుమారు క్రీ.పూ. 605
మా పాపాలు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నా, యెహోవా, మీ నామం కోసం ఏదైనా చేయండి. ఎందుకంటే మేము చాలాసార్లు దారితప్పాం; మేము మీకు వ్యతిరేకంగా పాపం చేశాము.
- యిర్మీయా 14:8సుమారు క్రీ.పూ. 605
మీరు ఇశ్రాయేలీయులకు నిరీక్షణ, ఆపద సమయంలో వారికి రక్షకుడవు, దేశంలో నీవు అపరిచితునిలా ఎందుకు ఉన్నావు? ఒక రాత్రి మాత్రమే బసచేసే ప్రయాణికునిలా ఎందుకు ఉన్నావు?
- యిర్మీయా 14:9సుమారు క్రీ.పూ. 605
నీవు ఆందోళనకు గురియైన వ్యక్తిలా ఎందుకు ఉన్నావు? రక్షించడానికి శక్తిలేని యోధునిలా ఎందుకు ఉన్నావు? యెహోవా, మీరు మా మధ్య ఉన్నారు, మేము మీ పేరును కలిగి ఉన్నాము; మమ్మల్ని విడిచిపెట్టకండి!
- యిర్మీయా 14:10సుమారు క్రీ.పూ. 605
ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నారు: “వారికి తిరగడం అంటే చాలా ఇష్టం; వారు తమ పాదాలను అదుపు చేసుకోరు. కాబట్టి యెహోవా వారిని అంగీకరించరు; ఆయన ఇక వారి దుర్మార్గాన్ని జ్ఞాపకం ఉంచుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తారు.”
- యిర్మీయా 14:11సుమారు క్రీ.పూ. 605
తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఈ ప్రజల క్షేమం కోసం ప్రార్థించవద్దు.