కంటెంట్‌కు వెళ్లండి

Creation Era

The Great Flood

Humanity's wickedness fills the earth; God preserves Noah and his family through a catastrophic flood.

97 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ఆదికాండము 7:4సుమారు క్రీ.పూ. 2348

    ఇంకా ఏడు రోజుల్లో భూమి మీద నలభై రాత్రింబగళ్ళు నేను వర్షం కురిపిస్తాను, నేను చేసిన ప్రతి ప్రాణిని భూమి మీద నుండి తుడిచివేస్తాను” అని అన్నారు.

  2. ఆదికాండము 7:5సుమారు క్రీ.పూ. 2348

    యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే నోవహు అంతా చేశాడు.

  3. ఆదికాండము 7:6సుమారు క్రీ.పూ. 2348

    భూమి మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహుకు 600 సంవత్సరాలు.

  4. ఆదికాండము 7:7సుమారు క్రీ.పూ. 2348

    జలప్రళయం నుండి తప్పించుకోడానికి నోవహు, అతని భార్య, కుమారులు, వారి భార్యలు ఓడలోనికి ప్రవేశించారు.

  5. ఆదికాండము 7:8సుమారు క్రీ.పూ. 2348

    పవిత్రమైన, అపవిత్రమైన జంతువుల్లో, పక్షుల్లో, నేలపై ప్రాకే జీవులన్నిటిలో,

  6. ఆదికాండము 7:9సుమారు క్రీ.పూ. 2348

    దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే మగవి ఆడవి, జతలుగా నోవహు దగ్గరకు వచ్చి ఓడలో ప్రవేశించాయి.

  7. ఆదికాండము 7:10సుమారు క్రీ.పూ. 2348

    ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది.

  8. ఆదికాండము 7:11సుమారు క్రీ.పూ. 2348

    నోవహుకు 600 సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున గొప్ప అగాధంలోని ఊటలన్నీ ఉప్పొంగాయి, ఆకాశ తూములు ద్వారాలు తెరుచుకున్నాయి.

  9. ఆదికాండము 7:12సుమారు క్రీ.పూ. 2348

    నలభై రాత్రింబగళ్ళు భూమిపై వర్షం కురిసింది.

  10. ఆదికాండము 7:13సుమారు క్రీ.పూ. 2348

    ఆ రోజే నోవహు, అతని కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతని ముగ్గురు కుమారుల భార్యలు ఓడలోనికి వెళ్లారు.

  11. ఆదికాండము 7:14సుమారు క్రీ.పూ. 2348

    ప్రతి జాతి ప్రకారం అడవి జంతువులు, వాటి వాటి జాతుల ప్రకారం అన్ని రకాల పశువులు, ఆయా జాతుల ప్రకారం నేలపై ప్రాకే జీవులు, వాటి వాటి జాతుల ప్రకారం పక్షులు, రెక్కలు గల ప్రతిదీ వారితో ఉన్నాయి.

  12. ఆదికాండము 7:15సుమారు క్రీ.పూ. 2348

    జీవపు ఊపిరి ఉన్న అన్ని జీవుల జతలు నోవహు దగ్గరకు వచ్చి ఓడలోకి ప్రవేశించాయి.

  13. ఆదికాండము 7:16సుమారు క్రీ.పూ. 2348

    దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే అన్ని జీవులలో ఆడవి మగవి జతలుగా ఓడలోకి వెళ్లాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశారు.

  14. ఆదికాండము 7:17సుమారు క్రీ.పూ. 2348

    నలభై రోజులు భూమిపై జలప్రళయం ముంచెత్తింది, నీళ్లు నిండిన కొలది ఓడ నీటిపై తేలుతూ ఉంది.

  15. ఆదికాండము 7:18సుమారు క్రీ.పూ. 2348

    భూమిపై జలాలు అధికంగా విస్తరించాయి, ఆ ఓడ నీటిపై తేలింది.

  16. ఆదికాండము 7:19సుమారు క్రీ.పూ. 2348

    నీరు ఎక్కువై భూమిని కప్పివేశాయి, ఆకాశాల క్రింద ఉన్న అన్ని ఎత్తైన పర్వతాలు నీటిలో మునిగిపోయాయి.

  17. ఆదికాండము 7:20సుమారు క్రీ.పూ. 2348

    నీరు పర్వతాల కన్నా పదిహేను మూరల ఎత్తు లేచి వాటిని కప్పివేశాయి.

  18. ఆదికాండము 7:21సుమారు క్రీ.పూ. 2348

    భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంటే పక్షులు, పశువులు, అడవి జంతువులు, భూమి మీద సంచరించే సమస్త ప్రాణులు చనిపోయాయి, మనుష్యులు కూడా అందరు చనిపోయారు.

  19. ఆదికాండము 7:22సుమారు క్రీ.పూ. 2348

    పొడి నేలపై నాసికారంధ్రాలలో జీవం కలిగి ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది.

  20. ఆదికాండము 7:23సుమారు క్రీ.పూ. 2348

    నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి; మనుష్యులు, పశువులు, నేల మీద తిరిగే జీవులు, పక్షులు తుడిచివేయబడ్డాయి. కేవలం నోవహు, అతనితో ఓడలో ఉన్నవారు మిగిలారు.

  21. ఆదికాండము 7:24సుమారు క్రీ.పూ. 2348

    వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి.

  22. అయితే దేవుడు నోవహును, అతనితో ఓడలో ఉన్న సమస్త అడవి జంతువులను పశువులను జ్ఞాపకం చేసుకుని, భూమి మీదికి గాలిని పంపినప్పుడు నీరు వెనుకకు తగ్గింది.

  23. అగాధజలాల ఊటలు ఆకాశపు తూములు మూయబడ్డాయి, ఆకాశం నుండి కురుస్తున్న వర్షం ఆగిపోయింది.

  24. భూమి నుండి క్రమంగా నీరు తగ్గింది, నూట యాభై రోజుల తర్వాత నీరు తగ్గి,

  25. ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది.