Skip to content

Jericho

58 verses

31.8700, 35.4400 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jericho ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే, యెరికోకు, హాయికి యెహోషువ ఏమి చేశాడో గిబియోను ప్రజలు విన్నప్పుడు,

  2. యెహోషువ హాయిని పట్టుకుని పూర్తిగా నాశనం చేసి, యెరికోకు దాని రాజుకు చేసినట్లు హాయికి దాని రాజుకు చేశాడని, గిబియోను ప్రజలు ఇశ్రాయేలుతో సమాధాన ఒప్పందం చేసుకుని వారితో కలిసిపోయారని యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు విన్నాడు.

  3. ఆ రోజు యెహోషువ మక్కేదాను స్వాధీనపరచుకున్నాడు. అతడు ఆ పట్టణాన్ని దాని రాజును కత్తితో చంపి, దానిలోని వారందరినీ పూర్తిగా నాశనం చేశాడు. ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లుగా మక్కేదా రాజుకు చేశాడు.

  4. యెహోవా ఆ పట్టణాన్ని దాని రాజును ఇశ్రాయేలు చేతికి అప్పగించారు. యెహోషువ ఆ పట్టణాన్ని, దానిలోని వారందరినీ కత్తితో చంపాడు. అక్కడ అతడు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లు దాని రాజుకు చేశాడు.

  5. యెరికో రాజు ఒక్కడు హాయి రాజు (బేతేలు సమీపంలోని) ఒక్కడు

  6. యెరికోకు తూర్పున యొర్దాను అవతల మోయాబు సమతల మైదానంలో ఉన్నప్పుడు మోషే ఇచ్చిన వారసత్వం ఇదే.

  7. యోసేపు సంతతివారికి చీట్ల వల్ల వచ్చిన భూభాగం తూర్పున ఉన్న యెరికో నీటి ఊటల దగ్గర యొర్దాను నుండి మొదలై ఎడారి గుండా బేతేలు కొండసీమ లోపలి వరకు ఉంది.

  8. అది యానోహ నుండి అతారోతు, నయరా వైపుకు దిగి, యెరికోను తాకి, యొర్దాను దగ్గర అంతమయ్యింది.

  9. ఉత్తరాన వారి సరిహద్దు యొర్దాను నది దగ్గర మొదలై యెరికోకు ఉత్తరంగా వెళ్లి పడమర వైపుకు కొండ సీమగుండా వెళ్లి, బేత్-ఆవెను అడవి వరకు ఉంది.

  10. వారి వారి వంశాల ప్రకారం బెన్యామీను గోత్రం వారి పట్టణాలివి: యెరికో, బేత్-హొగ్లా, యెమెక్-కెసీసు,

  11. యొర్దానుకు తూర్పున (యెరికో నుండి అవతలి వైపు) వారు రూబేను గోత్రంలో పీఠభూమిలోని అరణ్యంలో బేసెరును, గాదు గోత్రంలో గిలాదులోని రామోతును, మనష్షే గోత్రంలో బాషానులోని గోలానును నిర్ణయించారు.

  12. “ ‘తర్వాత మీరు యొర్దాను దాటి యెరికోకు వచ్చారు. యెరికోకు యజమానులైన అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులతో కలిసి యెరికో ప్రజలు కూడా మీతో పోరాడారు, కాని నేను వారిని మీ చేతికి అప్పగించాను.

  13. ఈ సంగతి దావీదుకు తెలిసినప్పుడు, వారు చాలా అవమానించబడ్డారని గ్రహించి, వారి దగ్గరకు మనుష్యులను పంపించాడు. రాజు, “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణంలో ఉండి, ఆ తర్వాత రండి” అని చెప్పాడు.

  14. అహాబు కాలంలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణాన్ని మళ్ళీ కట్టించాడు. దాని పునాది వేసినప్పుడు అతని పెద్దకుమారుడైన అబీరాము చనిపోయాడు, దానికి గుమ్మాలు పెట్టినప్పుడు అతని చిన్నకుమారుడు సెగూబు చనిపోయాడు. ఈ విధంగా నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా చెప్పిన మాట నెరవేరింది.

  15. తర్వాత ఏలీయా అతనితో అన్నాడు, “ఎలీషా, నీవు ఇక్కడ ఉండు. యెహోవా నన్ను యెరికోకు వెళ్లమన్నారు.” అతడు జవాబిస్తూ అన్నాడు, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను.” కాబట్టి వారు యెరికోకు వెళ్లారు.

  16. యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు ఎలీషా దగ్గరకు వచ్చి, “ఈ రోజు యెహోవా నీ గురువును నీ దగ్గర నుండి తీసుకెళ్తున్నారని నీకు తెలుసా?” అని అడిగారు. ఎలీషా జవాబిస్తూ, “నాకు తెలుసు, ఊరుకోండి” అన్నాడు.

  17. దీనిని చూస్తున్న యెరికోలో ఉన్న ప్రవక్తల బృందం వారు, “ఏలీయా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉంది” అని చెప్పి అతన్ని కలుసుకోడానికి వెళ్లి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.

  18. వారు యెరికోలో నివసిస్తున్న ఎలీషా దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, అతడు వారితో, “మీరు వెళ్లవద్దని నేను చెప్పలేదా?” అన్నాడు.

  19. అయితే బబులోను సైన్యం రాజును వెంటాడి యెరికో సమతల మైదానంలో అతన్ని పట్టుకుంది. అతని సైనికులందరూ అతని నుండి చెదిరిపోయారు.

  20. యెరికోకు తూర్పుగా యొర్దాను నది అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుండి ఎడారిలో ఉన్న బేసెరు, యహజు,

  21. కొంతమంది, ఆ మనుష్యుల సంగతి దావీదుకు చెప్పినప్పుడు, వారు చాలా అవమానించబడినట్లు గ్రహించిన రాజు వారి దగ్గరకు మనుష్యులను పంపి, “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణంలో ఉండి, ఆ తర్వాత రండి” అని చెప్పాడు.

  22. పేరు బట్టి నియమితులైన వారు దోపిడిలో నుండి వస్త్రాలు, చెప్పులు తీసి నగ్నంగా ఉన్న బందీలకు ఇచ్చారు. తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు, ఔషధ తైలాన్ని ఇచ్చారు. నీరసించిన వారిని గాడిదల మీద ఎక్కించారు. అప్పుడు బందీలను ఖర్జూరపు చెట్ల పట్టణం అనే పేరున్న యెరికోకు తీసుకెళ్లి వారి స్వదేశస్థుల దగ్గర వదిలి, తిరిగి సమరయకు వచ్చారు.

  23. యెరికో వారసులు 345;

  24. ఆ ప్రక్కనే యెరికో పట్టణస్థులు కట్టారు. వారి ప్రక్కన ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టాడు.

  25. యెరికో వారసులు 345;