కంటెంట్‌కు వెళ్లండి

Egypt

561 verses · 4 known names

ఇలా కూడా పిలుస్తారు: Egyptian, Egyptians, Egyptian's

30.1000, 31.3300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Egypt ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఫరో సైన్యం ఈజిప్టు నుండి బయలుదేరగా, యెరూషలేమును ముట్టడించిన బబులోనీయులు ఆ వార్త విని యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిపోయారు.

  2. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘ఫరో గురించి నన్ను విచారించడానికి నిన్ను పంపిన యూదా రాజుతో చెప్పు. మీకు మద్ధతు ఇవ్వడానికి బయలుదేరిన సైన్యం తిరిగి తన దేశమైన ఈజిప్టుకు వెళ్తుంది.

  3. వారు బబులోనీయుల నుండి తప్పించుకోవడానికి వారు ఈజిప్టుకు వెళ్లే మార్గంలో బేత్లెహేము సమీపంలోని గెరూత్-కిమ్హాము దగ్గర ఆగారు.

  4. ఒకవేళ మీరు, ‘వద్దు, మేము ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసిస్తాము. మేము యుద్ధం చూడం, బూరధ్వని వినం, రొట్టెల కోసం ఆకలితో ఉండం’ అని అంటే,

  5. యూదాలో మిగిలి ఉన్నవారలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఒకవేళ మీరు ఈజిప్టుకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొని ఉంటే,

  6. మీరు ఏ ఖడ్గానికి భయపడతారో అది అక్కడ మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు భయపడే కరువు ఈజిప్టులోకి కూడా మిమ్మల్ని వెంటపడుతుంది, అక్కడే మీరు చనిపోతారు.

  7. నిజానికి, ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొనిన వారందరూ ఖడ్గం, కరువు, తెగులు వల్ల చస్తారు; నేను వారి మీదికి తెచ్చే విపత్తు నుండి వారిలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడలేరు.’

  8. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘యెరూషలేములో నివసించేవారి మీద నా కోపం, ఉగ్రత ఎలా కుమ్మరించానో, మీరు ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా నా కోపం మీమీద అలాగే కుమ్మరిస్తాను. మీరు శాపగ్రస్తులుగా, భయానకంగా, శాపంగా, నిందగా అవుతారు; మీరు ఈ స్థలాన్ని మళ్ళీ చూడలేరు.’

  9. “యూదాలో మిగిలి ఉన్నవారలారా, ‘ఈజిప్టుకు వెళ్లవద్దు’ అని యెహోవా మీతో చెప్పారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి:

  10. హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకా గర్విష్ఠులైన కొందరు యిర్మీయాతో, “నీవు అబద్ధం చెప్తున్నావు! ‘మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడకూడదు’ అని చెప్పమని మా దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.

  11. వారు యెహోవాకు లోబడక ఈజిప్టులో ప్రవేశించి, తహ్పన్హేసు వరకు వెళ్లారు.

  12. అతడు వచ్చి ఈజిప్టుపై దాడి చేసి, చావవలసినవారు చనిపోయేలా, బందీలుగా వెళ్లవలసినవారు బందీలుగా వెళ్లేలా, ఖడ్గానికి బలి కావలసినవారిని ఖడ్గం పాలు అయ్యేలా చేస్తాడు.

  13. అతడు ఈజిప్టు దేవతల ఆలయాలకు నిప్పంటిస్తాడు; అతడు వారి దేవాలయాలను కాల్చివేస్తాడు వారి దేవుళ్ళను బందీగా తీసుకుంటాడు. ఒక గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పేళ్లను దులిపివేసినట్లు అతడు ఈజిప్టును శుభ్రంగా దులిపివేసి అక్కడినుండి సమాధానంగా వెళ్లిపోతాడు.

  14. అక్కడ ఈజిప్టులోని బేత్-షెమెషులో ఉన్న సూర్య దేవాలయంలో పవిత్ర స్తంభాలను పడగొట్టి, ఈజిప్టు దేవతల ఆలయాలను కాల్చివేస్తాడు.’ ”

  15. ఈజిప్టులోని మిగ్దోలు, తహ్పన్హేసు, మెంఫిసులో, పత్రూసులో నివసిస్తున్న యూదులందరి గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:

  16. మీరు నివసించడానికి వచ్చిన ఈజిప్టులో ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ, మీ చేతులు చేసిన వాటితో ఎందుకు నా కోపాన్ని రెచ్చగొడుతున్నారు? మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు, భూమిపై ఉన్న అన్ని దేశాల మధ్య మిమ్మల్ని మీరు ఒక శాపంగా చేసుకుంటారు, అవమానం పాలవుతారు.

  17. ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకున్న యూదా వారిలో మిగిలి ఉన్నవారిని నేనే అక్కడికి తీసుకువెళ్తాను. వారంతా ఈజిప్టులో నశిస్తారు; వారు ఖడ్గం వల్ల చనిపోతారు లేదా కరువుతో చనిపోతారు. సామాన్యుల నుండి గొప్పవారి వరకు, వారు ఖడ్గం చేత గాని కరువుచేత గాని చనిపోతారు. వారు శాపంగాను, భయం పుట్టించే వారుగాను; ఒక శాపంగాను నిందకు కారణమైనవారిగాను అవుతారు.

  18. నేను యెరూషలేమును ఎలా శిక్షించానో ఈజిప్టులో నివసించేవారిని కూడా ఖడ్గంతో, కరువుతో, తెగులుతో అలాగే శిక్షిస్తాను.

  19. ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.”

  20. అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తున్నారని తెలిసిన పురుషులు, అక్కడ ఉన్న స్త్రీలందరు పెద్ద సమాజంగా చేరి దిగువ ఎగువ ఈజిప్టులో అనగా పత్రూసులో నివసిస్తున్న ప్రజలందరూ యిర్మీయాతో ఇలా అన్నారు,

  21. అప్పుడు యిర్మీయా స్త్రీలతో సహా ప్రజలందరితో, “ఈజిప్టులోని యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.

  22. అయితే ఈజిప్టులో నివసిస్తున్న యూదులారా, యెహోవా మాట వినండి: ‘నా గొప్ప నామం తోడు’ అంటూ యెహోవా ఇలా చెప్తున్నారు, ‘ఈజిప్టులో నివసించే యూదా వారెవరూ ఇకపై, “ప్రభువైన యెహోవా జీవం తోడు.”

  23. ఎందుకంటే నేను వారికి మేలు చేయాలని కాదు వారికి కీడు చేయడం కోసమే ఎదురు చూస్తున్నాను. ఈజిప్టులోని యూదులు పూర్తిగా నాశనమయ్యే వరకు ఖడ్గంతోను కరువుతోను చస్తారు.

  24. ఖడ్గం నుండి తప్పించుకుని ఈజిప్టు నుండి యూదా దేశానికి తిరిగి వచ్చేవారు చాలా తక్కువ. అప్పుడు ఈజిప్టులో నివసించడానికి వచ్చిన యూదా శేషులంతా ఎవరి మాట నెరవేరుతుందో! నాదో వారిదో అనేది తెలుసుకుంటారు.

  25. యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను ఎలాగైతే యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించానో, అలాగే ఈజిప్టు రాజైన ఫరో హోఫ్రాను అతన్ని చంపాలనుకుంటున్న అతని శత్రువుల చేతులకు అప్పగించబోతున్నాను.’ ”