కంటెంట్‌కు వెళ్లండి

Egypt

561 verses · 4 known names

ఇలా కూడా పిలుస్తారు: Egyptian, Egyptians, Egyptian's

30.1000, 31.3300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Egypt ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లెక్కచేయకుండా యెహోవా నుండి సహాయం కోసం చూడకుండ సహయం కోసం ఈజిప్టుకు వెళ్లే వారికి గుర్రాలపై ఆధారపడేవారికి, తమ రథాల సంఖ్యపై గుర్రపురౌతుల గొప్ప బలం మీద నమ్మకం ఉంచే వారికి శ్రమ.

  2. చూడు, నీవు నలిగిన రెల్లులాంటి ఈజిప్టును నమ్ముకుంటున్నావు, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఈజిప్టు రాజైన ఫరోను నమ్ముకునే వారందరికి అతడు చేసేది అదే.

  3. రథాలు రౌతుల కోసం ఈజిప్టు రాజును నమ్ముకున్నా, మీరు నా యజమాని అధికారులలో అతి అల్పుడైన ఒక్క అధికారినైనా ఎలా ఎదిరించగలరు?

  4. యెహోవానైన నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని. నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను, నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను.

  5. యెహోవా చెప్పే మాట ఇదే: “ఈజిప్టు సంపాదన, కూషు వ్యాపార లాభాలు, పొడవైన సెబాయీయులు; నీ దగ్గరకు వచ్చి నీవారవుతారు; సంకెళ్ళతో నీ దగ్గరకు వచ్చి నీ ఎదుట మోకరిస్తారు. ‘నిజంగా దేవుడు నీతో ఉన్నారు, వేరే ఎవరూ లేరు; వేరే ఏ దేవుడు లేడు’ అని నీ ఎదుట నమస్కారం చేసి మనవి చేస్తారు.”

  6. ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “నా ప్రజలు మొదట నివసించడానికి ఈజిప్టుకు వెళ్లారు; తర్వాత అష్షూరు వారిని బాధించింది.

  7. వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు.

  8. నైలు నది నీళ్లు త్రాగడానికి ఈజిప్టుకు ఎందుకు వెళ్లాలి? యూఫ్రటీసు నుండి నీళ్లు త్రాగడానికి అష్షూరుకు ఎందుకు వెళ్లాలి?

  9. నీ మార్గాలను మార్చుకుంటూ, ఎందుకు అంతలా తిరుగుతున్నావు? నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.

  10. నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి వారితో మాట్లాడినప్పుడు, నేను వారికి దహనబలులు బలుల గురించి మాత్రమే ఆజ్ఞలు ఇవ్వలేదు,

  11. మీ పూర్వికులు ఈజిప్టును విడిచినప్పటి నుండి నేటి వరకు, నేను పదే పదే నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరకు పంపాను.

  12. “ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.”

  13. నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి ఇనుమును కరిగించే కొలిమి నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధనలు.’ నేను ఇలా అన్నాను, ‘నాకు విధేయత చూపి, నేను మీకు ఆజ్ఞాపించినదంతా చేయండి, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను దేవునిగా ఉంటాను.

  14. నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చినప్పటి నుండి నేటి వరకు, “నాకు లోబడండి” అని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను.

  15. “అయినా, ఆ రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తూ ఇలా చెప్తున్నారు, “అప్పుడు ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ఇకపై చెప్పరు,

  16. యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో, ఇకపై ప్రజలు, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట అని చెప్పరు’

  17. “ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.

  18. ఈజిప్టు రాజు ఫరో, అతని పరిచారకులు, అధికారులు, అతని ప్రజలందరూ,

  19. రాజైన యెహోయాకీము, అతని అధికారులు, ముఖ్యులందరూ అతని మాటలు విన్నప్పుడు, రాజు అతన్ని చంపాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఊరియా అది విని భయపడి ఈజిప్టుకు పారిపోయాడు.

  20. అయితే రాజైన యెహోయాకీము, అక్బోరు కుమారుడైన ఎల్నాతానును మరికొందరు వ్యక్తులతో పాటు ఈజిప్టుకు పంపాడు.

  21. వారు ఊరియాను ఈజిప్టు నుండి రాజైన యెహోయాకీము దగ్గరకు తీసుకురాగా, రాజు అతడిని ఖడ్గంతో చంపి అతని దేహాన్ని సామాన్య ప్రజల సమాధి స్థలంలోకి విసిరివేశాడు.)

  22. ఆ నిబంధన, ఈజిప్టు నుండి నేను వారి పూర్వికుల చేయి పట్టుకుని బయటకు నడిపించినపుడు నేను వారితో చేసిన నిబంధనలా ఉండదు, ఎందుకంటే నేను వారికి ఒక భర్తగా ఉన్నా, వారితో చేసిన నా నిబంధనను వారు ఉల్లంఘించారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  23. మీరు ఈజిప్టులో సూచకక్రియలు, అద్భుతాలు చేశారు, నేటికీ ఇశ్రాయేలు మధ్య, ఇతర మనుష్యలందరి మధ్య వాటిని కొనసాగిస్తూ మీరు ఇంకా పేరు కీర్తి కలిగించుకుంటున్నారు.

  24. మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను సూచకక్రియలతో, అద్భుతాలతో, బలమైన చేతితో, చాచిన బాహువుతో, గొప్ప భయాన్ని కలిగించి ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చారు.

  25. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి, బానిస దేశం నుండి బయటకు రప్పించినప్పుడు వారితో నిబంధన చేసి నేను ఇలా అన్నాను,