కంటెంట్‌కు వెళ్లండి

Simeon

40 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

Simeon ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.

  2. వారు యూదా, షిమ్యోను గోత్రాల నుండి క్రింద చెప్పిన పట్టణాలను కేటాయించారు.

  3. యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.

  4. తర్వాత యూదా వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోనీయులతో వెళ్లి జెఫతులో నివసిస్తున్న కనానీయులపై దాడి చేసి, పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.

  5. ఇశ్రాయేలు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,

  6. షిమ్యోను వారసులు: నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు;

  7. ఈ షిమ్యోను వంశీయులలో అయిదువందల మంది శేయీరు కొండ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇషీ కుమారులైన పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు వారికి నాయకులు.

  8. యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాల్లో, పై చెప్పిన పట్టణాలు చీట్ల ద్వార వారికి కేటాయించబడ్డాయి.

  9. షిమ్యోనీయులలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వీరులు 7,100 మంది;

  10. అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు.

  11. మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను, నఫ్తాలి పట్టణాల వరకు వాటి చుట్టూ ఉన్న శిథిలాల్లో,

  12. షిమ్యోను వారికి ఒక భాగము. తూర్పు నుండి పడమటి వరకు అది బెన్యామీను వారి భూమిని ఆనుకుని ఉంటుంది.

  13. ఇశ్శాఖారు వారికి ఒక వాటా! అది తూర్పు నుండి పడమర వరకు షిమ్యోను భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.

  14. దక్షిణ దిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం, జెబూలూను ద్వారం ఉండాలి.

  15. షిమ్యోను గోత్రంలో 12,000; లేవీ గోత్రంలో 12,000; ఇశ్శాఖారు గోత్రంలో 12,000;