కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను నీకు స్త్రీకి మధ్య, నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య శత్రుత్వం కలుగజేస్తాను; అతడు నీ తలను చితకగొడతాడు, నీవు అతని మడిమె మీద కాటేస్తావు” అని అన్నారు.

  2. తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు.”

  3. ఆదాముతో ఆయన ఇలా అన్నారు, “నీవు నీ భార్య మాట విని, ‘తినవద్దు’ అని నేను నీకు చెప్పిన ఆ చెట్టు పండును నీవు తిన్నావు కాబట్టి, “నిన్ను బట్టి ఈ నేల శపించబడింది; నీ జీవితకాలమంతా దాని పంట నుండి, కష్టపడి పని చేసి తింటావు.

  4. యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో చేసిన వస్త్రాలను తొడిగించారు.

  5. అప్పుడు యెహోవా దేవుడు, “మనుష్యుడు ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోగలిగి మనలాంటి వాడయ్యాడు, కాబట్టి అతడు తన చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తెంపుకొని తిని ఎప్పటికీ బ్రతికే ఉంటాడేమో, అలా జరగనివ్వకూడదు” అని అనుకున్నారు.

  6. కాబట్టి యెహోవా దేవుడు అతన్ని ఏదెను తోట నుండి బయటకు వెళ్లగొట్టి అతడు ఏ మట్టి నుండి తీయబడ్డాడో, ఆ మట్టినే సాగు చేసుకునేలా చేశారు.

  7. దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున కెరూబును ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు.

  8. అటు తర్వాత ఆదాము హవ్వను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై కయీనుకు జన్మనిచ్చింది. “యెహోవా సహాయంతో నేను కుమారున్ని సంపాదించుకున్నాను” అని ఆమె అన్నది.

  9. కోత సమయం వచ్చినప్పుడు కయీను పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు.

  10. హేబెలు కూడా తన గొర్రెలలో మొదటి సంతానంగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడు. యెహోవా హేబెలును అతని అర్పణను అంగీకరించారు.

  11. కానీ కయీనును అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. అందుకు కయీనుకు చాలా కోపం వచ్చి ముఖం మాడ్చుకున్నాడు.

  12. అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నారు, “నీవెందుకు కోపంతో ఉన్నావు? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకొన్నావు?

  13. అప్పుడు యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడున్నాడు?” అని అడిగారు. అందుకు అతడు, “ఏమో నాకు తెలియదు, నేనేమైన నా తమ్మునికి కావలివాడినా?” అని అన్నాడు.

  14. అందుకు యెహోవా, “నీవేం చేశావు? విను, నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది.

  15. కయీను యెహోవాతో, “ఈ శిక్ష నేను భరించలేనంత కఠినమైనది.

  16. ఈ రోజు నన్ను ఈ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు, మీ సన్నిధిలో నుండి దూరం చేశారు; నేను విశ్రాంతి లేని దేశదిమ్మరిని అవుతాను, నేను కంటపడితే నన్ను చంపేస్తారు” అని అన్నాడు.

  17. అయితే యెహోవా అతనితో, “అలా జరగదు; ఎవరైనా కయీనును చంపితే, వారు ఏడు రెట్లు ఎక్కువ శిక్ష అనుభవిస్తారు” అని అన్నారు. అప్పుడు యెహోవా కయీనును ఎవరూ చంపకుండ ఉండేలా కయీను మీద ఒక గుర్తు వేశారు.

  18. కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లి ఏదెనుకు తూర్పున ఉన్న నోదు దేశంలో నివసించాడు.

  19. ఆదాము తన భార్యను మరోసారి లైంగికంగా కలుసుకున్నప్పుడు, ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చి, “దేవుడు, కయీను చంపిన నా కుమారుడు హేబెలుకు బదులుగా మరొక శిశువునిచ్చారు” అని అతనికి షేతు అని పేరు పెట్టింది.

  20. షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషు అని పేరు పెట్టాడు. అప్పటినుండి ప్రజలు యెహోవా నామంలో ప్రార్థించడం మొదలుపెట్టారు.

  21. ఆదాము వంశావళి యొక్క జాబితా ఇదే. దేవుడు మనుష్యజాతిని సృష్టించినప్పుడు వారిని దేవుని పోలికలో చేశారు.

  22. ఆయన వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించారు. ఆయన వారిని ఆశీర్వదించి వారికి “మనుష్యజాతి” అని పేరు పెట్టారు.

  23. మెతూషెల పుట్టిన తర్వాత హనోకు 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నమ్మకంగా నడిచాడు; ఈ సమయంలో ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.

  24. హనోకు దేవునితో నమ్మకంగా నడిచాడు; తర్వాత ఒక రోజు దేవుడు అతన్ని తీసుకెళ్లారు కాబట్టి అతడు కనబడలేదు.

  25. అతనికి నోవహు అని పేరు పెట్టి, “యెహోవా శపించిన ఈ భూమిని సాగుచేయడానికి మనం పడే ప్రయాసలో, మన చేతుల బాధాకరమైన శ్రమలలో ఆయన మనలను ఆదరిస్తారు” అని అన్నాడు.