కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. భూమిపై ఉన్న మృగాలన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేలపై ప్రాకే జీవులన్నిటికి, జీవం ఉన్న ప్రతీ దానికి ప్రతి పచ్చని మొక్కను ఆహారంగా ఇస్తున్నాను” అని అన్నారు. అలాగే జరిగింది.

  2. దేవుడు తాను చేసిందంతా చూశారు. అది చాలా బాగుంది. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది ఆరవరోజు.

  3. ఏడవ రోజు నాటికి దేవుడు తాను చేస్తున్న పనంతా ముగించారు; కాబట్టి ఏడవ రోజున తన పని అంతటి నుండి విశ్రాంతి తీసుకున్నారు.

  4. ఆ రోజున సృష్టి క్రియ అంతటి నుండి దేవుడు విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఆయన ఆ రోజును దీవించి పరిశుద్ధపరిచారు.

  5. యెహోవా దేవుడు భూమిని సృజించినప్పుడు, భూమ్యాకాశాల సృష్టి జరిగిన విధానం ఇదే.

  6. భూమి మీద ఏ పొద కనిపించలేదు, మొక్క మొలవలేదు, ఎందుకంటే యెహోవా దేవుడు భూమి మీద వాన కురిపించలేదు, భూమిని సేద్యం చేయడానికి నరులు లేరు,

  7. యెహోవా దేవుడు నేల మట్టితో మనుష్యుని చేసి, అతని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవి అయ్యాడు.

  8. యెహోవా దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో తోట నాటి, అందులో తాను రూపించిన నరుని ఉంచారు.

  9. యెహోవా దేవుడు నేల నుండి కంటికి అందంగా కనిపించే ఆహారానికి సరియైన అన్ని రకాల చెట్లను మొలిపించారు. అలాగే ఆ తోట మధ్యలో జీవవృక్షం, మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞాన వృక్షం ఉన్నాయి.

  10. ఏదెను తోటను సాగుచేయడానికి దానిని, జాగ్రత్తగా చూసుకోడానికి యెహోవా దేవుడు నరుని దానిలో ఉంచారు.

  11. యెహోవా దేవుడు ఆ నరునితో, “ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ నీవు తినవచ్చు;

  12. యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు.

  13. యెహోవా దేవుడు నేల మట్టితో ప్రతి విధమైన అడవి జంతువులను, ఆకాశ పక్షులను చేసి, ఆ మనుష్యుని దగ్గరకు తెచ్చి వాటికి అతడు ఏ పేర్లు పెడతాడో అని చూశారు; అతడు ఒక్కొక్క జీవికి ఏ పేరైతే పెట్టాడో అదే ఆ జీవికి పేరు అయ్యింది.

  14. కాబట్టి యెహోవా దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగించి, అతని ప్రక్కటెముకల్లో ఒకటి తీసి, ఆ స్థలాన్ని మాంసంతో పూడ్చి వేశారు.

  15. అప్పుడు యెహోవా దేవుడు మనుష్యుని నుండి తీసిన ప్రక్కటెముకతో స్త్రీని చేసి అతని దగ్గరకు తెచ్చారు.

  16. యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా యుక్తి కలది. సర్పం స్త్రీతో, “దేవుడు, ‘తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లు తినకూడదు’ అని నిజంగా చెప్పారా?” అని అడిగింది.

  17. కాని, ‘తోట మధ్యలో చెట్టు పండు మాత్రం తినకూడదు, దానిని ముట్టుకోవద్దు, లేదంటే మీరు చస్తారు’ అని దేవుడు చెప్పారు” అని జవాబిచ్చింది.

  18. మీరు అది తింటే మీ కళ్లు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచిచెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు” అని చెప్పింది.

  19. అప్పుడు ఆ రోజు చల్లని సమయంలో యెహోవా దేవుడు తోటలో నడుస్తున్న శబ్దం విని, ఆదాము అతని భార్య యెహోవా దేవునికి కనబడకూడదని తోట చెట్ల మధ్య దాక్కున్నారు.

  20. అప్పుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి, “నీవెక్కడున్నావు?” అని అడిగారు.

  21. అతడు, “తోటలో మీ శబ్దం విని, నేను దిగంబరిగా ఉన్నానని భయపడ్డాను; అందుకే నేను దాక్కున్నాను” అని జవాబిచ్చాడు.

  22. అప్పుడు దేవుడు, “నీవు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినకూడదని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ చెట్టు నుండి పండు తిన్నావా?” అని అడిగారు.

  23. అందుకు ఆదాము, “మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను” అని చెప్పాడు.

  24. అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, “నీవు చేసిన ఈ పనేంటి?” అని అడిగారు. అందుకు ఆ స్త్రీ జవాబిస్తూ, “సర్పం మాటలకు మోసపోయి నేను తిన్నాను” అని చెప్పింది.

  25. అందుకు యెహోవా దేవుడు సర్పంతో, “నీవు ఇలా చేశావు కాబట్టి, “అన్ని రకాల పశువుల్లోను, అడవి జంతువులన్నిటిలోనూ నీవు శపించబడ్డావు! నీవు బ్రతుకు దినాలన్ని నీ పొట్టతో ప్రాకుతావు, మన్ను తింటావు.