కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దావీదు యాత్రకీర్తన. “యెహోవా ఆలయానికి వెళ్దాం” అని నాతో అన్న వారితో నేను సంతోషించాను.

  2. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన శాసనం ప్రకారం యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారి గోత్రాలు అనగా యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్తాయి.

  3. మన దేవుడైన యెహోవా మందిరం కోసం మీ వృద్ధిని నేను కోరతాను.

  4. యాత్రకీర్తన. పరలోకంలో సింహాసనాసీనుడైన దేవా, మీ వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను.

  5. దాసుల కళ్లు తమ యజమాని చేతివైపు చూసినట్లు, దాసురాలి కళ్లు తన యజమానురాలి చేతివైపు చూసినట్లు, మన దేవుడైన యెహోవా మనల్ని కనికరించే వరకు మన కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.

  6. మాపై దయచూపండి, యెహోవా, మాపై దయచూపండి, ఎందుకంటే మేము అంతులేని ధిక్కారాన్ని భరించాము.

  7. దావీదు యాత్రకీర్తన. మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు; వరద మన మీదుగా పొర్లి ఉండేది, జలప్రవాహం మనల్ని ముంచేసి జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది అని ఇశ్రాయేలు చెప్పును గాక.

  8. If it had not been the LORD who was on our side, when men rose up against us:

  9. వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని యెహోవాకు స్తుతి చెల్లును గాక.

  10. భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.

  11. యాత్రకీర్తన. యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.

  12. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, ఇప్పుడు ఎల్లప్పుడు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.

  13. యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి.

  14. అయితే యెహోవా వంకర త్రోవలకు తిరిగేవారిని దుష్టులతో పాటు బహిష్కరిస్తారు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.

  15. యాత్రకీర్తన. యెహోవా సీయోను భాగ్యాలను పునరుద్ధరించినప్పుడు, మనం కలలుగన్న వారిలా ఉన్నాము.

  16. మన నోరు నవ్వుతో నింపబడింది, మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి. “యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని ఇతర దేశాలు చెప్పుకున్నాయి.

  17. యెహోవా మన కోసం గొప్పకార్యాలు చేశారు, మనం ఆనందభరితులం అయ్యాము.

  18. దక్షిణ దేశంలో ప్రవాహాలు ప్రవహించేలా, యెహోవా, మా భాగ్యాలను తిరిగి రప్పించండి.

  19. సొలొమోను యాత్రకీర్తన. యెహోవా ఇల్లు కడితేనే తప్ప దానిని కట్టే వారి శ్రమ అంతా వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కావలి ఉండకపోతే దాన్ని కాపలా కాసేవారు నిలబడి కాయడం వ్యర్థమే.

  20. మీరు ప్రొద్దున్నే లేచి ఆలస్యంగా పడుకొంటూ, కష్టపడి పని చేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. ఆయన ప్రేమించేవారు నిద్రిస్తునప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు.

  21. పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

  22. యాత్రకీర్తన. యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.

  23. యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు.

  24. సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.

  25. అయితే యెహోవా నీతిమంతుడు; దుష్టులు కట్టిన తాళ్లను తెంచి ఆయన నన్ను విడిపించారు.”