కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతని శత్రువులకు అవమాన వస్త్రాలను ధరింపచేస్తాను, కాని అతని తల ప్రకాశవంతమైన కిరీటంతో అలంకరించబడుతుంది.”

  2. అది సీయోను కొండలమీదికి దిగివచ్చే హెర్మోను మంచులా ఉంటుంది. యెహోవా తన ఆశీర్వాదాన్ని, జీవాన్ని కూడా నిరంతరం అక్కడ కుమ్మరిస్తారు.

  3. యాత్రకీర్తన. యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.

  4. పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి.

  5. ఆకాశాన్ని భూమిని సృష్టించిన యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని దీవించును గాక.

  6. యెహోవాను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి; యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి,

  7. యెహోవా మందిరంలో, మన దేవుని మందిర ఆవరణాల్లో సేవ చేసేవారలారా, ఆయనను స్తుతించండి.

  8. యెహోవా మంచివాడు కాబట్టి యెహోవాను స్తుతించండి; ఆయన నామానికి స్తుతులు పాడండి, అది మనోహరమైనది.

  9. యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.

  10. యెహోవా గొప్పవాడని, దేవుళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడని నాకు తెలుసు.

  11. ఆకాశాల్లో భూమిమీద, సముద్రాల్లో జలాగాధాలలో, యెహోవా తనకిష్టమైన దానిని జరిగిస్తారు.

  12. ఆయన భూమి అంచుల నుండి మేఘాలను లేచేలా చేస్తారు; వర్షంతో పాటు మెరుపులను పంపిస్తారు తన కోటలో నుండి గాలిని బయటకు పంపిస్తారు.

  13. ఆయన వారి దేశాన్ని వారసత్వంగా, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చారు.

  14. యెహోవా, మీ నామం నిత్యం ఉంటుంది. యెహోవా, మీ కీర్తి తరతరాలులో నిలిచి ఉంటుంది.

  15. యెహోవా తన ప్రజలకు శిక్ష విముక్తి జరిగిస్తారు, ఆయన సేవకులపై దయ కలిగి ఉంటారు.

  16. ఓ ఇశ్రాయేలు గృహమా, యెహోవాను స్తుతించు; ఓ అహరోను గృహమా, యెహోవాను స్తుతించు;

  17. ఓ లేవీ గృహమా, యెహోవాను స్తుతించు; యెహోవాకు పట్ల భయము కలవారలారా, యెహోవాను స్తుతించండి.

  18. సీయోనులో నుండి యెహోవా స్తుతించబడును గాక, ఆయన యెరూషలేములో నివసిస్తారు. యెహోవాను స్తుతించండి.

  19. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  20. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  21. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  22. మహాద్భుతాలు చేసేది ఆయన ఒక్కడే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  23. ఆయన తన జ్ఞానం చేత ఆకాశాలను కలుగజేశారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  24. నీటిపై భూమిని పరిచిన దేవునికి స్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  25. మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.