God
God ను ప్రస్తావించే వచనాలు
“యెహోవా ఆశీర్వాదం మీమీద ఉండును గాక; యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని బాటసారులు అనకుందురు గాక.
యాత్రకీర్తన. యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను;
ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.
యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, ప్రభువా, ఎవరు నిలవగలరు?
కాని మీ దగ్గర క్షమాపణ లభిస్తుంది, కాబట్టి మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించగలము.
యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.
కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.
ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది.
ఆయనే ఇశ్రాయేలీయులను వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు.
దావీదు యాత్రకీర్తన. యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.
ఓ ఇశ్రాయేలు, ఇప్పటినుండి నిరంతరం యెహోవా పైనే నీ నిరీక్షణ ఉంచు.
యాత్రకీర్తన. యెహోవా, దావీదును, అతనికి కలిగిన అన్ని బాధలను జ్ఞాపకము చేసుకోండి.
అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు, యాకోబు యొక్క బలవంతునికి మ్రొక్కుబడి చేశాడు:
Until I find out a place for the LORD, an habitation for the mighty God of Jacob.
“ఆయన నివాసస్థలానికి వెళ్దాం రండి, ఆయన పాదపీఠం ఎదుట ఆరాధిద్దాం రండి.
‘యెహోవా, లేవండి, మీరు, మీ బలాన్ని సూచించే నిబంధన మందసంలో, మీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించండి.
మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక; నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ ”
మీ సేవకుడైన దావీదు నిమిత్తం, మీ అభిషిక్తుని తిరస్కరించకండి.
యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు, అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు: “మీ సంతానంలో ఒకనిని మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.
మీ కుమారులు నా ఒడంబడికను వారికి బోధించిన చట్టాలను పాటిస్తే, వారి కుమారులు కూడా నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు” అని చెప్పారు.
యెహోవా సీయోనును ఏర్పరచుకున్నారు, దానిని తన నివాస స్థలంగా ఆయన కోరుకున్నారు.
“ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది; ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను, ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.
ఆమెను సమృద్ధి ఆహారంతో దీవిస్తాను; ఆమెలోని పేదవారిని ఆహారంతో తృప్తిపరుస్తాను.
ఆమె యాజకులకు రక్షణ వస్త్రాలను ధరింపచేస్తాను, ఆమెలో నమ్మకస్థులైన ప్రజలు నిత్యం సంతోషగానం చేస్తారు.
“అక్కడ దావీదుకు కొమ్ము మొలిచేలా చేస్తాను నా అభిషిక్తుని కోసం ఒక దీపం సిద్ధపరుస్తాను.