కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  2. రాత్రిని యేలడానికి చంద్రుని, నక్షత్రాలను చేసిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  3. ఈజిప్టు తొలిసంతానాన్ని ఆయన సంహరించారు, ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.

  4. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించారు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  5. చేయి చాచి తన బలమైన హస్తంతో వారిని రప్పించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  6. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  7. దాని మధ్యలో నుండి ఇశ్రాయేలీయులను దాటించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  8. ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  9. అరణ్యం గుండా తన ప్రజలను నడిపించిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  10. గొప్పరాజులను పడగొట్టిన దేవునికి స్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  11. బలాఢ్యులైన రాజులను చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  12. అమోరీయుల రాజైన సీహోనును చంపింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  13. బాషాను రాజైన ఓగును చంపింది ఆయనే ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  14. వారి దేశాన్ని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  15. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని వారసత్వంగా ఇచ్చింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  16. మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  17. మన శత్రువుల నుండి మనల్ని విడిపించింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  18. ప్రతి జీవికి ఆహారం ఇచ్చేది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  19. పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  20. పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?

  21. యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజున ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి. “దానిని నాశనం చేయండి. పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు.

  22. దావీదు కీర్తన. యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను; “దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను.

  23. మీ పరిశుద్ధాలయం వైపు నమస్కరిస్తూ, మీ మారని ప్రేమను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే మీ ప్రఖ్యాతి కంటే మీ శాసనాలను మీరు అధికంగా ఘనపరిచారు.

  24. నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు; మీరు నన్ను ధైర్యపరిచారు.

  25. యెహోవా, భూరాజులందరూ మీ నోటి నుండి మీ శాసనాలు విన్నప్పుడు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.