God
God ను ప్రస్తావించే వచనాలు
ప్రభువా, నా కోరికలన్నీ మీ ముందు ఉన్నాయి; నా నిట్టూర్పు మీ నుండి ఉంది.
యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను; ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు.
యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి.
నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి.
“యెహోవా, నా జీవిత ముగింపు నా రోజుల సంఖ్యను నాకు చూపించండి; నా జీవితం ఎంత అనిశ్చయమైనదో నాకు తెలియజేయండి.
మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు; నా జీవితకాలం మీ ఎదుట శూన్యము. భద్రత గలవారిగా అనిపించినా, మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా
“కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను? మీలోనే నా నిరీక్షణ.
ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను.
దయచేసి నన్ను కొట్టడం ఆపేయండి; మీ చేతి దెబ్బలకు నేను అలసిపోతున్నాను.
మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు, చిమ్మెటలా మీరు వారి సంపదను హరించివేస్తారు. మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా
“యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.
మన దేవునికి ఒక స్తుతి పాటను, ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు. అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు. వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు.
గర్విష్ఠుల వైపు చూడక అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక, యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు.
యెహోవా నా దేవా, మీరు మాకోసం ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ప్రణాళికలు వేశారు. మీతో పోల్చదగిన వారు లేరు; మీ క్రియల గురించి నేను చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించినవి.
బలిని అర్పణను మీరు కోరలేదు, కాని మీరు నా చెవులు తెరిచారు, హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు.
నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.”
యెహోవా! మీకు తెలిసినట్టుగా, నేను నా పెదవులు మూసుకోకుండ మహా సమాజంలో మీ నీతిని గురించిన సువార్త ప్రకటించాను.
మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను.
యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి; మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక.
యెహోవా, సంతోషంగా నన్ను రక్షించడానికి, యెహోవా నాకు సాయం చేయడానికి త్వరగా రండి.
అయితే మిమ్మల్ని వెదికేవారంతా మీలో ఆనందించి సంతోషించాలి; మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు, “యెహోవా గొప్పవాడు!” అని అనాలి.
కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను; ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక. మీరే నా సహాయం, నా విమోచకుడు; మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. పేదవారిపై శ్రద్ధచూపువారు ధన్యులు; అలాంటి వారిని యెహోవా కష్ట దినాన విడిపిస్తారు.
యెహోవా వారిని కాపాడి సజీవంగా ఉంచుతారు, వారు దేశంలో ఆశీర్వదింపబడిన వారుగా పిలువబడతారు. ఆయన వారిని తమ శత్రువుల కోరికకు అప్పగించరు.