Skip to content

Zion గురించి బైబిల్ వచనాలు

70 వచనాలు · 9 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సీయోనులో బూర ఊదండి, పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి, పరిశుద్ధ సభకు ప్రజలను పిలువండి.

  2. అయితే సీయోను పర్వతం మీద విడుదల ఉంటుంది; అది పవిత్రంగా ఉంటుంది, యాకోబు వారు తన వారసత్వాన్ని స్వాధీనపరచుకుంటారు.

  3. ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.

  4. సీయోను కుమారీ, పాట పాడు; ఇశ్రాయేలూ, బిగ్గరగా కేకవేయి! యెరూషలేము కుమారీ, నీ పూర్ణహృదయంతో సంతోషించి ఆనందించు!

  5. ఆ రోజున వారు యెరూషలేముతో, “సీయోనూ, భయపడకు; నీ చేతులను బలహీన పడనివ్వవద్దు.

  6. ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న దూత ఇలా అన్నాడు, “నీవు ఈ మాటను ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెరూషలేము, సీయోను గురించి నేనెంతో ఆసక్తి కలిగి ఉన్నాను.

  7. “ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ”

  8. “సీయోను ప్రజలారా, రండి! బబులోను దేశంలో నివసిస్తున్న మీరు తప్పించుకుని రండి!”

  9. “సీయోను కుమార్తె, కేకవేయి, సంతోషించు. నేను వస్తున్నాను, మీ మధ్య నివసిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.

  10. సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోను గురించి చాలా ఆసక్తి కలిగి ఉన్నాను; ఆమె పట్ల ఉన్న ఆసక్తి నన్ను దహించివేస్తుంది.”

  11. యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోనుకు తిరిగివచ్చి యెరూషలేములో నివసిస్తాను. అప్పుడు యెరూషలేము నమ్మకమైన పట్టణమని, సైన్యాల యెహోవా పర్వతమని, పవిత్ర పర్వతమని పిలువబడుతుంది.”

  12. సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు.

  13. నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను. సీయోనూ, నీ కుమారులను పురికొల్పి నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను; గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను.

  14. “ ‘ఇదిగో, గాడిద మీద, గాడిదపిల్ల మీద, సాత్వికునిగా స్వారీ చేస్తూ, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు’ అని సీయోను కుమారితో చెప్పండి.”

  15. “సీయోను కుమారీ, భయపడకు! ఇదిగో, గాడిదపిల్ల మీద కూర్చుని నీ రాజు వస్తున్నాడు.”

  16. దీని కోసం ఇలా వ్రాయబడి ఉంది: “ఇదిగో, నేను సీయోనులో ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయిని, వారు పడిపోయేలా చేసే అడ్డుబండను వేశాను, ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు.”

  17. అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలందరు రక్షించబడతారు. దీనిని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, “సీయోనులో నుండి విమోచకుడు వస్తాడు, యాకోబులో నుండి భక్తిహీనతను అతడు తీసివేస్తాడు.

  18. అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.

  19. ఎందుకంటే లేఖనాల్లో, “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని వేశాను అది ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయి; ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని వ్రాయబడి ఉంది.

  20. ఆ తర్వాత నా ఎదుట సీయోను పర్వతం మీద వధించబడిన గొర్రెపిల్ల, ఆయనతో 1,44,000 మంది తమ నుదుటి మీద ఆయన పేరును ఆయన తండ్రి పేరును వ్రాయబడినవారు నిలబడి ఉండడం చూశాను.