Skip to content

The Vine గురించి బైబిల్ వచనాలు

66 వచనాలు · 42 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “నాకు ఇశ్రాయేలు దొరికినప్పుడు, ఎడారిలో ద్రాక్షపండ్లు చూసినట్లు అనిపించింది; నేను మీ పూర్వికులను చూసినప్పుడు, అంజూర చెట్టు మీద తొలి పండ్లను చూసినట్లు అనిపించింది. అయితే వారు బయల్-పెయోరు వచ్చినప్పుడు, వారు ఆ సిగ్గుమాలిన విగ్రహానికి తమను తాము ప్రతిష్ఠించుకొన్నారు, తాము ఇష్టపడింది ఎంత నీచమో, వారు అంత నీచులయ్యారు.

  2. ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.

  3. అతని నీడలో ప్రజలు నివసిస్తారు; వారు ధాన్యంలా అభివృద్ధి చెందుతారు, వారు ద్రాక్షలా వికసిస్తారు, ఇశ్రాయేలు కీర్తి లెబానోను ద్రాక్షరసంలా ఉంటుంది.

  4. అది నా ద్రాక్ష చెట్లను పాడుచేసింది నా అంజూర చెట్లను నాశనం చేసింది. అది వాటి బెరడు ఒలిచి పడవేసినందుకు, చెట్ల కొమ్మలు తెల్లగా కనిపించాయి.

  5. ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.

  6. అడవి జంతువులారా, భయపడకండి, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లు పచ్చగా మారుతున్నాయి. చెట్లు తమ ఫలాలు ఇస్తాయి. అంజూర చెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.

  7. ప్రతి ఒక్కరు తమ సొంత ద్రాక్షచెట్టు క్రింద, తమ అంజూర చెట్టు క్రింద కూర్చుంటారు, ఎవరూ వారిని భయపెట్టరు, ఎందుకంటే సైన్యాల యెహోవా మాట ఇచ్చారు.

  8. గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ”

  9. “ ‘ఆ రోజున మీ ద్రాక్ష, అంజూర చెట్ల క్రింద కూర్చోడానికి మీలో ప్రతి ఒక్కరు తమ పొరుగువారిని పిలుస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.”

  10. “సమాధానమనే విత్తనం చక్కగా మొలకెత్తుతుంది, ద్రాక్షచెట్టు తన ఫలాన్ని ఇస్తుంది, భూమి తన పంటను ఇస్తుంది, ఆకాశం మంచు కురిపిస్తుంది. ఈ ప్రజల్లో మిగిలి ఉన్నవారికి వీటన్నిటిని వారసత్వంగా ఇస్తాను.

  11. మీ పైరును పురుగులు తినివేయకుండా చేస్తాను, అవి మీ పొలం పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల పండ్లు అకాలంలో రాలవు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. నేను మీతో చెప్పేదేమనగా, నా తండ్రి రాజ్యంలో మీతో కూడ నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగే రోజు వరకు మళ్ళీ దీనిని త్రాగను.”

  13. “నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.

  14. నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన కత్తిరించి పారవేస్తారు. ఫలించే ప్రతితీగె అధికంగా ఫలించడానికి ఆయన దానిని కత్తిరించి సరిచేస్తారు.

  15. “నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు. మీరు నాలో ఉండి, నేను మీలో ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఫలిస్తారు. నా నుండి మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు.

  16. మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు.