Skip to content

The Sword గురించి బైబిల్ వచనాలు

66 వచనాలు · 44 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున కెరూబును ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు.

  2. నీవు నీ ఖడ్గం చేత జీవిస్తావు నీ సోదరునికి సేవ చేస్తావు, అయితే నీవు విశ్రాంతి లేక ఉన్నప్పుడు, నీ మెడ మీద నుండి అతని కాడి విరిచి పడవేస్తావు.”

  3. మూడు రోజుల తర్వాత, వారు ఇంకా నొప్పితో ఉండగా, యాకోబు కుమారులలో ఇద్దరు, దీనా సోదరులు షిమ్యోను, లేవీ వారి ఖడ్గాలు తీసుకుని, క్షేమంగా ఉన్నాం అని దాడిని కూడా ఊహించని పట్టణం మీద దాడి చేసి, ప్రతి పురుషుని చంపేశారు.

  4. నీ సోదరులకంటే ఎక్కువగా ఒక కొండ ప్రాంతం, నా ఖడ్గం, నా విల్లుతో అమోరీయుల దగ్గర నుండి తీసుకున్న కొండ ప్రాంతాన్ని నీకు ఇస్తున్నాను” అని చెప్పాడు.

  5. నిబంధన ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీపై ఖడ్గం తెస్తాను. మీరు మీ పట్టణాల్లోకి వెళ్లినప్పుడు, నేను మీ మధ్యకు తెగులును పంపుతాను, మీరు శత్రువు చేతుల్లోకి ఇవ్వబడతారు.

  6. నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టి, నా ఖడ్గాన్ని తీసి మిమ్మల్ని వెంటాడుతాను. మీ భూమి వృథా అవుతుంది, మీ పట్టణాలు శిథిలావస్థలో ఉంటాయి.

  7. “ఎవరైనా బయట ఉన్నప్పుడు ఖడ్గం చేత చంపబడిన వారిని లేదా సహజ మరణం పొందినవారిని, లేదా మానవుల ఎముకలు కానీ, సమాధి కానీ ముట్టుకుంటే, వారు ఏడు రోజులు అపవిత్రులుగా ఉంటారు.

  8. అయితే ఇశ్రాయేలు అతన్ని ఖడ్గంతో చంపి అతని దేశాన్ని అర్నోను నది నుండి యబ్బోకు వరకు ఆక్రమించారు, కానీ అమ్మోనీయుల సరిహద్దు వరకు మాత్రమే ఎందుకంటే వారి సరిహద్దు పటిష్టమైనది.

  9. బయట ఖడ్గం వారిని సంతానం లేనివారినిగా చేస్తుంది; వారి ఇళ్ళలో భయం పరిపాలిస్తుంది, యువతీ యువకులు, నశిస్తారు శిశువులు, తల నెరసినవారు నశిస్తారు.

  10. నేను నా మెరిసే ఖడ్గానికి పదును పెట్టి, నా చేయి న్యాయాన్ని పట్టుకున్నప్పుడు, నేను నా ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటాను నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.

  11. ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”

  12. వారు పట్టణాన్ని యెహోవా కోసం ప్రత్యేకపరచి, పురుషులను, స్త్రీలను, చిన్నవారిని, పెద్దవారిని, పశువులను, గొర్రెలను, గాడిదలను దానిలోని ప్రతి జీవిని ఖడ్గంతో నాశనం చేశారు.

  13. మూడువందలమంది బూరలు ఊదినప్పుడు, యెహోవా ఆ దండులోని వారందరు తమ ఖడ్గాలతో ఒకరినొకరు చంపుకొనేలా చేశారు. ఆ సైన్యం సెరేరా వైపు ఉన్న బేత్-షిత్తాకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా సరిహద్దు వరకు పారిపోయారు.

  14. ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నాయకులు, నాలుగు లక్షలమంది ఆయుధాలు కలిగి దేవుని ప్రజల సమావేశానికి హాజరయ్యారు.

  15. ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివారు లేకుండ చేశారు, ఎందుకంటే, “హెబ్రీయులు కత్తులు ఈటెలు తయారుచేయించకూడదు” అని ఫిలిష్తీయులు అనుకున్నారు.

  16. అయితే సమూయేలు, “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్లు, స్త్రీల మధ్యలో నీ తల్లికి సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిలో అగగును ముక్కలుగా నరికాడు.

  17. దావీదు ఆ యుద్ధకవచం వేసుకుని కత్తి పట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు కాని అవి అతనికి అలవాటు లేకపోవడం వలన అతడు నడవలేకపోయాడు. అందుకతడు, “ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి వీటితో నేను వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు.

  18. సౌలు తన ఆయుధాలు మోసేవానితో, “నీ కత్తి దూసి నన్ను పొడవు, లేకపోతే సున్నతిలేని వీరు వచ్చి నన్ను దూషిస్తారు” అని అన్నాడు. కాని ఆ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి దానికి ఒప్పుకోలేదు; కాబట్టి సౌలు తన కత్తి తీసుకుని దాని మీద పడ్డాడు.

  19. ఆయుధాలు మోసేవాడు సౌలు చనిపోయాడని చూసి అతడు కూడా తన కత్తి మీద పడి చనిపోయాడు.

  20. నీవు నన్ను నిర్లక్ష్యం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఖడ్గం ఎన్నడూ విడిచిపెట్టదు.’

  21. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు చేరుకున్నపుడు, అమాశా వారిని కలుసుకోడానికి అక్కడికి వచ్చాడు. యోవాబు యుద్ధ వస్త్రాలు ధరించాడు దానిపైన ఉన్న నడికట్టుకు వ్రేలాడుతున్న ఒరలో కత్తి ఉంది. అతడు ముందుకు అడుగు వేసినప్పుడు ఒరలో నుండి కత్తి జారిపడింది.

  22. యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య రాజుకు తెలియజేశాడు. ఇశ్రాయేలులో కత్తి తిప్పగలవారు ఎనిమిది లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో అయిదు లక్షలమంది ఉన్నారు.

  23. అప్పుడు యెహోవా దూతతో మాట్లాడగా అతడు తన కత్తిని తిరిగి ఒరలో పెట్టాడు.

  24. మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము.

  25. కట్టే ప్రతి ఒక్కరు కడుతున్నప్పుడు తన కత్తి నడుముకు బిగించుకుని ఉన్నారు. బూర ఊదేవాడు నా దగ్గరే నిలబడ్డాడు.