కంటెంట్‌కు వెళ్లండి

The Burnt Offering గురించి బైబిల్ వచనాలు

46 వచనాలు · 49 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి.

  2. దంచి తీసిన ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.

  3. సాయంకాలం మరొక గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణ, పానార్పణ అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

  4. “యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గర రాబోయే తరాలన్ని క్రమంగా నిత్యం ఈ దహనబలిని అర్పించాలి. అక్కడే నేను మిమ్మల్ని కలుసుకొని మీతో మాట్లాడతాను.

  5. తర్వాత అతడు దహనబలిని వధించాడు. అహరోను కుమారులు రక్తాన్ని అతనికి అందించగా, అతడు దానిని బలిపీఠం చుట్టూరా చల్లాడు.

  6. వారు అతనికి దహనబలి తలను దాని ముక్కలను ఇవ్వగా, అతడు వాటిని బలిపీఠం మీద కాల్చాడు.

  7. లోపలి అవయవాలను, కాళ్లను కడిగి బలిపీఠం మీద ఉన్న దహనబలిపైన వాటిని కాల్చాడు.

  8. మరుసటిరోజు వారు యెహోవాకు అర్పణలు ఇచ్చి దహనబలులు అర్పించారు: వెయ్యి ఎద్దులు, వెయ్యి పొట్టేళ్లు, వెయ్యి మగ గొర్రెపిల్లలు, వాటితో పాటు పానార్పణలను ఇశ్రాయేలీయులందరి పక్షాన సరిపడా ఇతర బలులు అర్పించారు.

  9. ఆ రోజు వారు యెహోవా సన్నిధిలో చాలా ఆనందంతో విందు చేసుకున్నారు. అప్పుడు వారు దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పాలకునిగా, సాదోకును యాజకునిగా అభిషేకించారు.

  10. కాబట్టి సొలొమోను రాజుగా తన తండ్రియైన దావీదు స్థానంలో యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. అతడు అన్నిటిలో వృద్ధి చెందాడు, ఇశ్రాయేలీయులందరు అతనికి విధేయులయ్యారు.

  11. మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు.

  12. అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే.

  13. పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.

  14. నాకు ఆకలిగా ఉంటే నేను మీకు చెప్పను, లోకం నాది, అందులో ఉన్నవన్నీ నావి.

  15. ఎడ్ల మాంసం నేను తింటానా? మేకపోతుల రక్తం త్రాగుతానా?

  16. “ ‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ ఇతర బలులతో పాటు మీ దహనబలులను కలిపి, మాంసాన్ని మీరే తినండి!

  17. నేను మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి వారితో మాట్లాడినప్పుడు, నేను వారికి దహనబలులు బలుల గురించి మాత్రమే ఆజ్ఞలు ఇవ్వలేదు,

  18. నేను వారికి ఈ ఆజ్ఞ ఇచ్చాను: నాకు లోబడండి, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. మీకు మేలు జరిగేలా నా మార్గాలన్నిటిని అనుసరించండి.

  19. ఆయన మొదట ఇలా అన్నారు, “బలులు, అర్పణలు, దహనబలులు, పాపపరిహార బలులను కోరలేదు, అవి ధర్మశాస్త్ర ప్రకారమే అర్పించబడినప్పటికి వాటిని బట్టి మీరు సంతోషించలేదు.”

  20. తర్వాత ఆయన, “నేను ఇక్కడే ఉన్నాను, మీ చిత్తం చేయడానికి నేను వచ్చాను” అని చెప్పాడు. ఆయన రెండవదానిని స్థాపించడానికి మొదటి దానిని ప్రక్కన పెడతాడు.

  21. ఆ చిత్తాన్ని బట్టి, యేసు క్రీస్తు శరీరాన్ని అందరి కోసం ఒక్కసారే అర్పించుట ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడ్డాము.