కంటెంట్‌కు వెళ్లండి

Strategy in War గురించి బైబిల్ వచనాలు

63 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పొలాల్లో, అరణ్యంలో హాయి మనుష్యులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపటం పూర్తి చేసిన తర్వాత, వారిలో ఎవరూ మిగలకుండా ప్రతి ఒక్కరు ఖడ్గం పాలయ్యాక, ఇశ్రాయేలీయులంతా హాయికి తిరిగివచ్చి దానిలో ఉన్నవారందరిని చంపివేశారు.

  2. ఆ రోజున హాయి పట్టణానికి చెందిన స్త్రీ పురుషులు మొత్తం పన్నెండువేలమంది చనిపోయారు.

  3. ఆ మూడువందల మందిని మూడు గుంపులుగా చేసి, వారందరి చేతుల్లో బూరను ఖాళీ కుండను, ప్రతి కుండలో దివిటీని పెట్టి ఇచ్చాడు.

  4. గిద్యోను వారితో, “నన్ను గమనించి వెంబడించండి, నేను దండును సమీపించినప్పుడు నేను చేసినట్లే మీరూ చేయండి.

  5. నేను, నాతో ఉన్నవారందరు మా బూరలు ఊదినప్పుడు, దండు చుట్టూ ఉన్న మీరు మీ బూరలు ఊదుతూ, ‘యెహోవా కోసం, గిద్యోను కోసం’ అంటూ కేకలు వేయండి.”

  6. నడి జాము వేళ మొదటి జాము కావలివారు మారే సమయంలో గిద్యోను, అతనితో ఉన్న వందమంది దండును సమీపించారు. వారు బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగులగొట్టారు.

  7. ఆ మూడు గుంపులవారు కూడా తమ బూరలను ఊది కుండలను పగులగొట్టారు. వారి ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో బూరలను పట్టుకుని, “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం!” అని కేకలు వేశారు.

  8. దండు చుట్టూ ప్రతి మనుష్యుడు తన స్థానంలో ఉండగా మిద్యాను సైన్యం కేకలువేస్తూ పారిపోయింది.

  9. మూడువందలమంది బూరలు ఊదినప్పుడు, యెహోవా ఆ దండులోని వారందరు తమ ఖడ్గాలతో ఒకరినొకరు చంపుకొనేలా చేశారు. ఆ సైన్యం సెరేరా వైపు ఉన్న బేత్-షిత్తాకు, తబ్బాతు దగ్గరున్న ఆబేల్-మెహోలా సరిహద్దు వరకు పారిపోయారు.

  10. నఫ్తాలి, ఆషేరు, మనష్షే గోత్రాల నుండి పిలువబడిన ఇశ్రాయేలీయులు వచ్చి మిద్యానీయులను తరిమారు.

  11. ఆ తర్వాత ఇశ్రాయేలు వారు గిబియా చుట్టూ మాటు వేశారు.

  12. మూడవ రోజు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వెళ్లి, మునుపటిలా గిబియాను ఎదురుగా యుద్ధానికి బారులు తీరారు.

  13. వారిని ఎదిరించడానికి బెన్యామీనీయులు బయటకు వచ్చి వారిని తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్లారు. మునుపటిలా వారు ఇశ్రాయేలీయులలో గాయపడిన వారిని చంపడం మొదలుపెట్టి, బేతేలుకు గిబియాకు వెళ్లే రహదారుల్లో, మైదానాల్లో సుమారు ముప్పైమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.

  14. “మునుపటిలా మనం వారిని ఓడిస్తున్నాం” అని బెన్యామీనీయులు అనేటప్పుడు ఇశ్రాయేలీయులు, “మనం పరుగెత్తి వారు తమ పట్టణం నుండి బయటకు వచ్చేలా చేద్దాం” అని చెప్పుకున్నారు.

  15. ఇశ్రాయేలు వారందరు తామున్న చోట్ల నుండి బయలుదేరి బయల్-తామారు దగ్గర బారులు తీరారు. అప్పుడు మాటున ఉన్న ఇశ్రాయేలీయులు తమ స్థలం నుండి గెబాకు పడమటి వైపు నుండి దాడి చేశారు.

  16. అప్పుడు ఇశ్రాయేలీయులలో పదివేలమంది శూరులైన యువకులు గిబియా ఎదురుగా వచ్చి దాడి చేశారు. యుద్ధం ఎంతో తీవ్రంగా ఉండడంతో బెన్యామీనీయులు తమకు ఆపద రాబోతుందని గ్రహించలేదు.

  17. యెహోవా ఇశ్రాయేలీయుల చేతిలో బెన్యామీనీయులను ఓడించారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు 25,100 మంది బెన్యామీనీయులను చంపారు. వారంతా కత్తి పట్టినవారే.

  18. అప్పుడు తాము ఓటమి పాలయ్యామని బెన్యామీనీయులు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు దారి ఇచ్చారు.

  19. మాటులో ఉన్నవారు గిబియాలో అకస్మాత్తుగా చొరబడి వారు పట్టణంలోని వారందరిని ఖడ్గంతో చంపారు.

  20. పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయాలని మాటున దాక్కున్న వారికి ఇశ్రాయేలీయులకు మధ్య సంకేతం ఏర్పాటు చేసుకున్నారు,

  21. అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి యుద్ధం చేశారు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులకు (దాదాపు ముప్పైమందిని) ప్రాణనష్టం కలిగిస్తూ, “మొదటి యుద్ధంలా మనం వారిని ఓడిస్తున్నాం” అని అన్నారు.

  22. అయితే పట్టణంలో నుండి పొగ పైకి లేవడం ఆరంభమైనప్పుడు, బెన్యామీనీయులు పట్టణమంతా ఆకాశం వైపు వెళ్తున్న పొగను చూశారు.

  23. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదురు దాడి చేశారు, విపత్తు తమను సమీపించిందని తెలుసుకొని బెన్యామీనీయులు హడలిపోయారు.

  24. కాబట్టి వారు ఇశ్రాయేలీయుల నుండి అరణ్యం వైపు పారిపోయారు, కానీ వారు యుద్ధం తప్పించుకోలేకపోయారు. పట్టణాల్లో నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు వారిని అక్కడ హతం చేశారు.

  25. వారు బెన్యామీనీయులను చట్టుముట్టి ఆగకుండా వారిని తరిమి గిబియాకు తూర్పుదిక్కు ప్రాంతం దగ్గర ఓడించారు.