కంటెంట్‌కు వెళ్లండి

Strategy in War గురించి బైబిల్ వచనాలు

63 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ప్రజలు దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండమీద ఉండేది. దావీదు అక్కడికి చేరుకున్నప్పుడు అర్కీయుడైన హూషై తన పైవస్త్రాన్ని చింపుకుని తలమీద బూడిద పోసుకున్నాడు.

  2. దావీదు అతన్ని చూసి, “నీవు నాతో పాటు వస్తే నాకు భారంగా ఉంటుంది.

  3. నీవు పట్టణానికి తిరిగివెళ్లి అబ్షాలోముతో, ‘రాజా! నేను నీకు సేవకునిగా ఉంటాను. గతంలో మీ తండ్రికి సేవకునిగా ఉన్నాను కాని ఇకపై నీకు సేవకునిగా సేవ చేస్తాను’ అని చెప్పు, అప్పుడు నీవు నా తరుపున అక్కడ ఉండి అహీతోపెలు చేసే సలహాలను చెడగొట్టగలవు.

  4. అందుకు హూషై అబ్షాలోముతో, “ఈసారి అహీతోపెలు ఇచ్చిన సలహా మంచిది కాదు.

  5. హూషై ఇంకా మాట్లాడుతూ, నీ తండ్రి గురించి అతని మనుష్యుల గురించి నీకు తెలుసు; వారు యుద్ధవీరులు, కూనలను పోగొట్టుకున్న అడవి ఎలుగుబంటిలా భయంకరులు. అంతేకాక నీ తండ్రి అనుభవజ్ఞుడైన యుద్ధవీరుడు; అతడు సైన్యంతో రాత్రి గడపడు.

  6. ఇప్పుడు కూడా అతడు గుహలోనో మరో స్థలంలోనో దాక్కొని ఉంటాడు. అతడు కాబట్టి నీ దళాల మీద మొదట దాడి చేయాల్సివస్తే, దాని గురించి విన్నవారందరు, ‘అబ్షాలోమును అనుసరించే దళాల మధ్య వధ జరిగింది’ అని అంటారు.

  7. అప్పుడు సింహపు గుండె లాంటి గుండె కలిగిన మహా ధైర్యవంతులైన సైనికులు కూడా భయంతో కరిగిపోతారు, ఎందుకంటే నీ తండ్రి గొప్ప యుద్ధవీరుడని అతనితో ఉన్నవారంతా ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికి తెలుసు.

  8. “కాబట్టి నా సలహా ఏంటంటే, దాను నుండి బెయేర్షేబ వరకు సముద్రపు ఇసుకరేణువులంత అసంఖ్యాకంగా ఇశ్రాయేలీయులందరు నీ దగ్గర సమకూడాలి. నీవే స్వయంగా వారిని యుద్ధంలో నడిపించాలి.

  9. అప్పుడతడు ఎక్కడ కనబడినా మనం అతనిపై దాడి చేద్దాం; నేల మీద మంచు పడినట్లుగా మనం అతని మీద దాడి చేస్తే అతడు గాని అతని మనుష్యులు కాని ప్రాణాలతో తప్పించుకోలేరు.

  10. ఒకవేళ అతడు ఏదైన పట్టణానికి వెళ్తే, ఇశ్రాయేలీయులందరు ఆ పట్టణానికి త్రాళ్లు తీసుకువచ్చి, అక్కడ చిన్న రాయి కూడా మిగులకుండా ఆ పట్టణాన్ని లోయలోకి లాగివేస్తారు” అన్నాడు.

  11. అబ్షాలోము ఇశ్రాయేలీయులందరు అది విని, “అర్కీయుడైన హూషై చెప్పిన సలహా అహీతోపెలు చెప్పిన దానికంటే బాగుంది” అన్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి ఆపద రప్పించడానికి అహీతోపెలు చెప్పిన మంచి ఆలోచనను భగ్నం చేయాలని నిశ్చయించుకున్నారు.

  12. మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒక రాత్రిలోనే మోయాబులోని ఆరు పట్టణం పాడై నశిస్తుంది! ఒక రాత్రిలోనే మోయాబులోని కీరు పట్టణం పాడై నశిస్తుంది!

  13. కాబట్టి లేచి, రాత్రిపూట దాడి చేసి దాని కోటలను నాశనం చేద్దాం!”