Skip to content

Shoe గురించి బైబిల్ వచనాలు

16 వచనాలు · 9 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఒక దారం పోగైననూ, చెప్పులవారైననూ నేను ఆశించను, తద్వార నీవు, ‘నేనే అబ్రామును ధనికుడయ్యేలా చేశాను’ అని చెప్పకుండ ఉంటావు.

  2. అందుకు దేవుడు, “దగ్గరకు రావద్దు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు” అన్నారు.

  3. అతని సోదరుని విధవరాలు పెద్దల సమక్షంలో అతని దగ్గరకు వెళ్లి, అతని కాలి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, “తన సోదరుని కుటుంబాన్ని నిలబెట్టని వ్యక్తికి ఇలాగే జరుగుతుంది” అని చెప్పాలి.

  4. అయినప్పటికీ యెహోవా అంటున్నారు, “నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన నలభై సంవత్సరాల్లో, మీ బట్టలు గాని, కాళ్ల చెప్పులు గాని పాతగిల్లలేదు.

  5. నీ ద్వారపు గడియలు ఇనుపవి, ఇత్తడివి నీ బలం నీ రోజులకు సమానంగా ఉంటుంది.

  6. అందుకు యెహోవా సేనాధిపతి యెహోషువతో, “నీవు నిలబడిన స్ధలం పవిత్రమైనది, కాబట్టి నీ చెప్పులు తీసివేయి” అని చెప్పగానే యెహోషువ అలాగే చేశాడు.

  7. (ఇప్పుడు ఇశ్రాయేలులో పూర్వకాలంలో, ఆస్తిని విడిపించడం గాని బదిలీ చేయడం గాని నిర్ధారణ చేయడానికి, ఒక పక్షం వాడు తన చెప్పు తీసి ఇతర పక్షం వానికి ఇచ్చేవాడు. ఇశ్రాయేలులో లావాదేవీలను చట్టబద్ధం ఇలాగే చేసేవారు.)

  8. కాబట్టి ఆ సమీపబంధువు బోయజుతో, “నీవే దానిని కొనుక్కో” అని చెప్పి, తన చెప్పును తీశాడు.

  9. వారిలో ఒక్కరు కూడా అలిసిపోరు, తూలిపోరు. వారిలో ఒక్కరు కూడా కునుకరు నిద్రపోరు. వారి నడికట్టు విడిపోదు. వారి చెప్పుల వారు తెగిపోదు.

  10. నీకు అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు వేసి, మంచి చర్మంతో చేసిన చెప్పులు నీ పాదాలకు తొడిగించాను. నీకు సన్నని అవిసె నారబట్టలు వేసి ఖరీదైన పట్టు వస్త్రంతో నిన్ను కప్పాను.

  11. చనిపోయినవారి కోసం దుఃఖించకుండ నిశ్శబ్దంగా నిట్టూర్చు. నీ తలపాగాను కట్టుకుని నీ కాళ్లకు చెప్పులు వేసుకో; నీ మీసం గెడ్డం కప్పుకోవద్దు; సంతాపంగా ఇతరులు తెచ్చిన ఆహారం తినవద్దు.”

  12. యెహోవా చెప్పే మాట ఇదే: “ఇశ్రాయేలు చేసిన మూడు పాపాల గురించి, వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, వారు నిర్దోషులను వెండి కోసం అమ్మారు, బీదలను చెప్పుల కోసం అమ్మారు.

  13. బీదలను వెండికి కొంటారు, చెప్పులిచ్చి అవసరతలో ఉన్నవారిని కొంటారు, పాడైపోయి గింజలు కూడా అమ్మివేస్తారు.

  14. ఆయన ఇచ్చిన సందేశమిది: “నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు.

  15. అప్పుడు యోహాను వారందరితో అన్నాడు, “నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నాకన్నా శక్తిమంతుడు ఒకడు వస్తాడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు.

  16. “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు.