Skip to content

Sabbath గురించి బైబిల్ వచనాలు

239 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవానైన నేనే వారిని పవిత్రపరచానని వారు తెలుసుకునేలా, నాకు వారికి మధ్య సూచనగా సబ్బాతులను నియమించాను.

  2. “ ‘అరణ్యంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి, నా శాసనాలను తృణీకరించి, వాటికి లోబడేవారు బ్రతుకుతారని నేనిచ్చిన నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నేను నియమించిన సబ్బాతులను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి వారిపై నా ఉగ్రత కుమ్మరించి వారిని అరణ్యంలో నాశనం చేయాలనుకున్నాను.

  3. Because they despised my judgments, and walked not in my statutes, but polluted my sabbaths: for their heart went after their idols.

  4. సబ్బాతును పరిశుద్ధంగా పాటించండి; నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి మీకూ నాకు మధ్య సూచనగా ఉంటాయి” అని చెప్పాను.

  5. “ ‘అయినా వారి పిల్లలు నాపై తిరగబడ్డారు: వారు అనుసరించి బ్రతకాలని చెప్పి నేను ఇచ్చిన నా శాసనాలను వారు పాటించకుండా నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా నా సబ్బాతును అపవిత్రం చేశారు. కాబట్టి వారు అరణ్యంలో ఉండగానే నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి కోపాన్ని తీర్చుకోవాలని అనుకున్నాను.

  6. Because they had not executed my judgments, but had despised my statutes, and had polluted my sabbaths, and their eyes were after their fathers' idols.

  7. నీవు నా పరిశుద్ధ వస్తువులను తృణీకరించి నా సబ్బాతులను అపవిత్రం చేశావు.

  8. వారు నాకు కూడా ఇలా చేశారు: అదే సమయంలో వారు నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు; నా సబ్బాతులను కూడా అపవిత్రం చేశారు.

  9. “ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.

  10. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఆరు పని దినాల్లో తూర్పు ముఖంగా ఉన్న లోపలి ఆవరణ ద్వారం మూసివేయబడాలి, అయితే సబ్బాతు దినాన అమావాస్య రోజున దానిని తెరవాలి.

  11. సబ్బాతులలో, అమావాస్యల్లో దేశ ప్రజలు ఆ ద్వారం దగ్గర నిలబడి యెహోవాను ఆరాధించాలి.

  12. సబ్బాతు దినాన యువరాజు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఆరు మగ గొర్రెపిల్లలను ఒక పొట్టేలును అర్పించాలి.

  13. పొట్టేలుతో పాటు ఒక ఏఫా పిండిని, గొర్రెపిల్లలతో పాటు తన శక్తికొలది పిండిని భోజనార్పణగా అర్పించాలి. ప్రతి ఏఫా పిండితో పాటు ఒక హిన్ నూనె అర్పించాలి.

  14. ఆమె ఉత్సవ వేడుకలన్నిటిని: ఆమె వార్షిక పండుగలు, అమావాస్యలు, ఆమె సబ్బాతు దినాలు అన్ని ఆగిపోయేలా చేస్తాను.

  15. అలా చేస్తూ, “మనం ధాన్యం అమ్ముకోడానికి, అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, ధర ఎక్కువ చేస్తూ, దొంగ త్రాసుతో మోసగిస్తారు,

  16. ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన శిష్యులకు ఆకలివేసి కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు.

  17. అది చూసిన పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు.

  18. అందుకు ఆయన వారితో, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?

  19. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని తాను తనతో ఉన్నవారు తిన్నారు కదా!

  20. యాజకులు సబ్బాతు దినాన దేవాలయం విధులను నిర్వహించడం కూడా సబ్బాతు దినాన్ని అపవిత్ర పరచినట్లే అయినాసరే వారు నిర్దోషులని ధర్మశాస్త్రంలో చదవలేదా?

  21. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నేను చెప్తున్నాను.

  22. ‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అనే మాటల అర్థం ఒకవేళ మీకు తెలిసి ఉంటే, మీరు నిర్దోషులకు తీర్పు తీర్చేవారు కారు.

  23. ఎందుకంటే మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి ప్రభువు” అని చెప్పారు.

  24. అక్కడ చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు. యేసు మీద నేరం మోపడానికి కారణం వెదుకుతున్న కొందరు, “సబ్బాతు దినాన బాగుచేయడం ధర్మశాస్త్రానుసారమా?” అని అడిగారు.

  25. అందుకు యేసు వారితో, “మీలో ఎవనికైనా ఒక గొర్రె ఉండి అది సబ్బాతు దినాన గుంటలో పడితే దానిని పట్టుకుని బయటకు తీయకుండా ఉంటారా?