కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. పొలాలు వాటిలోని సమస్తం ఆనంద ధ్వనులు చేయాలి. అడవి చెట్లు ఆనందంతో పాటలు పాడాలి.

  2. యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.

  3. యెహోవా పరిపాలిస్తారు, భూతలం ఆనందిస్తుంది; ద్వీపాలు, సముద్ర తీర ప్రదేశాలు సంతోషిస్తాయి.

  4. ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి; ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు పునాదులు.

  5. ఆయన ఎదుట నుండి మంటలు బయలుదేరి చుట్టూరా చేరి ఉన్న శత్రువులను దహించి వేస్తాయి.

  6. ఆయన మెరుపులు లోకాన్ని వెలుగిస్తాయి; అది చూసి భూమి కంపిస్తుంది.

  7. యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు.

  8. ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తాయి, ప్రజలంతా ఆయన మహిమను చూస్తారు.

  9. వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!

  10. యెహోవా! మీ తీర్పులను బట్టి సీయోను విని సంతోషిస్తూ ఉంది యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు.

  11. యెహోవా, భూమి అంతటికి పైగా ఉన్నావు; దేవుళ్ళందరి పైన మీరు మహోన్నతులు.

  12. యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక, ఎందుకంటే తన నమ్మకమైన వారి జీవితాలను ఆయన కావలి కాస్తారు దుష్టుల చేతి నుండి ఆయన విడిపిస్తారు.

  13. నీతిమంతుల మీద వెలుగు యథార్థవంతుల మీద ఆనందం ప్రకాశిస్తాయి.

  14. నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకోండి.

  15. యెహోవా పరిపాలిస్తారు, ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు; కెరూబులకు పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు, భూమి కంపించాలి.

  16. సీయోను పట్టణంలో యెహోవా వైభవోపేతంగా అందరికంటే పైన ఉన్నారు.

  17. వారు మీ భీకరమైన గొప్ప నామాన్ని స్తుతిస్తారు, మీరు పరిశుద్ధులు.

  18. రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల నీతి నాయ్యాలు జరిగిస్తారు.

  19. మన దేవుడైన యెహోవాను మహిమపరచండి ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి; ఆయన పవిత్రులు.

  20. దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; వారు దేవునికి ప్రార్థన చేశారు, ఆయన జవాబిచ్చారు.

  21. మేఘస్తంభంలో నుండి ఆయన మాట్లాడారు. వారు ఆయన చట్టాలు పాటించారు ఆయన ఇచ్చిన శాసనాలను వారు అమలుచేశారు.

  22. యెహోవా మా దేవా, మీరు వారికి జవాబిచ్చారు. మీరు వారికి క్షమించే దేవుడు, కాని వారు తప్పు చేసినప్పుడు మీరు వారిని శిక్షించారు.

  23. మన దేవుడైన యెహోవాను ఘనపరచండి ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర ఆయనను ఆరాధించండి. ఎందుకంటే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు.

  24. దావీదు కీర్తన. యెహోవా మీకు స్తుతిగానం చేస్తాను; మీ మారని ప్రేమను న్యాయాన్ని గురించి పాడతాను.

  25. నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? నేను నిందారహితమైన హృదయంతో నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను.