Skip to content

Priests గురించి బైబిల్ వచనాలు

407 వచనాలు · 86 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను.

  2. దేశం పంటలన్నిటిలో యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాలు మీకు చెందుతాయి. నీ కుటుంబంలో ఆచార ప్రకారం పవిత్రులందరు వాటిని తినవచ్చు.

  3. “ఇశ్రాయేలీయులు యెహోవా కోసం ప్రతిష్ఠించిన ప్రతిదీ నీకు చెందుతుంది.

  4. ప్రతి గర్భం నుండి వచ్చిన యెహోవాకు అర్పించబడ్డ జ్యేష్ఠ సంతానం, మనుష్యులైన, జంతువులైన, మీకు చెందుతాయి. కానీ మీరు ప్రతి పెద్ద కుమారున్ని, అపవిత్ర జంతువుల తొలిచూలును విడిపించాలి.

  5. ఒక నెల వయస్సున్నప్పుడు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం అయిదు షెకెళ్ళ వెండితో విడిపించాలి, అంటే ఇరవై గెరాలు.

  6. “ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి.

  7. ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది.

  8. “లేవీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు ఇశ్రాయేలీయుల నుండి వారసత్వంగా దశమభాగం తీసుకున్నప్పుడు, ఆ దశమభాగంలో పదవ వంతు మీరు యెహోవాకు అర్పణగా సమర్పించాలి.

  9. ఇశ్రాయేలీయుల నుండి పుచ్చుకొనే దశమ భాగాలన్నిటి నుండి యెహోవాకు మీరు కూడా అర్పణలు ఇస్తారు. ఈ దశమ భాగాల నుండి యెహోవా భాగమును యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి.

  10. అప్పుడు యాజకుడు కొంత దేవదారు కర్రను, హిస్సోపు చెట్టురెమ్మను ఎర్ర దారాన్ని తీసుకుని పెయ్యను కాల్చి నిప్పులో వెయ్యాలి.

  11. తర్వాత యాజకుడు తన బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి. తర్వాత అతడు శిబిరంలో ప్రవేశించవచ్చు గాని సాయంత్రం వరకు ఆచారరీత్య అపవిత్రుడే.

  12. ఈ పన్ను వారి భాగం నుండి తీసుకుని యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇవ్వాలి.

  13. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇచ్చాడు.

  14. మోయాబు సమతల మైదానాల్లో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతంలో యెహోవా మోషేతో అన్నారు,

  15. “ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే స్వాస్థ్యం నుండి పట్టణాలను లేవీయులు నివసించడానికి ఇమ్మని ఆజ్ఞాపించు. పట్టణాల చుట్టూ ఉన్న పచ్చికబయళ్లు వారికి ఇవ్వాలి.

  16. అప్పుడు వారు నివసించడానికి పట్టణాలు కలిగి ఉంటారు వారి సొంత పశువుల కోసం, ఇతర జంతువుల కోసం పచ్చికబయళ్లు ఉంటాయి.

  17. “లేవీయులకు ఇచ్చే పట్టణాల చుట్టూ ఉండే పచ్చికబయళ్లు పట్టణ ప్రాకారానికి 1,000 క్యూబిట్‌ల దూరంలో ఉంటుంది.

  18. పట్టణం బయట తూర్పు దిక్కున 2,000 క్యూబిట్‌ల దక్షిణ దిక్కున 2,000 క్యూబిట్‌ల, పడమటి దిక్కున 2,000 క్యూబిట్‌ల, ఉత్తర దిక్కున 2,000 క్యూబిట్‌లు కొలవాలి, దాని కేంద్రంగా పట్టణం ఉంటుంది. వారు ఈ భూభాగాన్ని పట్టణాలకు పచ్చికబయళ్లుగా కలిగి ఉంటారు.

  19. “లేవీయులకు ఇచ్చే వాటిలో ఆరు పట్టణాలు ఆశ్రయపురాలుగా ఉండాలి. ప్రమాదవశాత్తు ఎవరినైనా చంపితే ఆ వ్యక్తి ఇక్కడకు పారిపోవచ్చు. వీటితో సహా 42 పట్టణాలు వారికి ఇవ్వాలి.

  20. మొత్తం 48 పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పచ్చికబయళ్లతో సహా లేవీయులకు ఇవ్వాలి.

  21. ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకునే వాటిలో లేవీయులకు ఇచ్చే పట్టణాలు ప్రతి గోత్రం వారి వారసత్వం నుండి ఇవ్వాలి. ఎక్కువ పట్టణాలు గల గోత్రం నుండి ఎక్కువ పట్టణాలు, తక్కువ ఉన్న వారి నుండి తక్కువ తీసుకోవాలి.”

  22. మీ దగ్గరకు వచ్చిన వివాదాలలో మీరు తీర్పు తీర్చడానికి చాలా కష్టంగా ఉన్న వివాదాలను అంటే రక్తపాతానికి సంబంధించినవి గాని వాదనలు గాని దాడులు గాని అలాంటి వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలానికి తీసుకెళ్లండి.

  23. లేవీయ యాజకుల దగ్గరకు, ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్లండి. వాటి గురించి విచారించండి, వారు మీకు తీర్పు ఇస్తారు.

  24. మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలంలో వారు మీకు తెలియజేసిన నిర్ణయాల ప్రకారం మీరు నడుచుకోవాలి. మీరు చేయాలని వారు మీకు చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి.

  25. వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు.