Skip to content

Pillars గురించి బైబిల్ వచనాలు

42 వచనాలు · 27 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. స్తంభాల మీద ఉన్న పీటలకు అల్లిన గొలుసులతో, ప్రతి పీటకు ఏడు అల్లిన గొలుసులను వేశాడు.

  2. ఆ స్తంభాలను మీది పీటలను అలంకరించడానికి చుట్టూ రెండు వరుసల దానిమ్మపండ్లు చేశాడు.

  3. మండపం స్తంభాల మీది పీటలపై నాలుగు మూరల ఎత్తు తామర పువ్వుల్లా చెక్కారు.

  4. ఆ రెండు స్తంభాల మీది పీటల మీద అల్లికపని ఉన్న గిన్నెలాంటి భాగం పైన రెండువందల దానిమ్మపండ్లు వరుసగా చుట్టూరా ఉన్నాయి.

  5. అతడు దేవాలయ మంటపంలో ఆ స్తంభాలను నిలబెట్టాడు. దక్షిణాన ఉన్న దానికి యాకీను అని, ఉత్తరాన ఉన్న దానికి బోయజు అని పేరు పెట్టాడు.

  6. ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి స్తంభాలను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. ఆ రోజు నుండి ఇంతవరకు అలాంటి చందనం దొరకలేదు కనబడలేదు.)

  7. ఆ తోటలో పాలరాతి స్తంభాలకున్న వెండి ఉంగరాలకు తెలుపు నార త్రాళ్లు ఊదా రంగు పట్టీలతో తగిలించి ఉన్నాయి. తెరలు కట్టడానికి వాటి మీద వెండి కమ్ములు, అవిసెనార త్రాళ్లకు తెరలు వ్రేలాడుతున్నాయి. చలువ రాయి పాల రాయి ముత్యం ఇతర విలువైన రాళ్లు పరచిన నేల మీద వెండి బంగారాలతో అలంకరించబడిన పరుపులు ఉన్నాయి.

  8. అవి నిత్యం ఉండేలా ఇనుపగంటతో రాతి మీద చెక్కి సీసంతో నింపితే బాగుండేది!

  9. ఆయన గద్దింపుకు ఆకాశాల స్తంభాలు కంపిస్తాయి.

  10. భూమి దాని ప్రజలంతా భయంతో వణికినప్పుడు, దాని స్తంభాలను గట్టిగా పట్టుకున్నది నేనే. సెలా

  11. దాని స్తంభాలు వెండివి, అడుగుభాగం బంగారం, దాని ఆసనం ఊదా రంగు బట్టతో అలంకరించబడింది, దాని లోపలి భాగం యెరూషలేము కుమార్తెల ద్వార ప్రేమతో అలంకరించబడింది.

  12. ఆయన కాళ్లు మేలిమి బంగారు దిమ్మల మీద నిలిపిన పాలరాతి స్తంభాలు. ఆయన రూపం లెబానోనులా, దాని దేవదారు వృక్షాలలా ఉంది.

  13. ఈ రోజు నేను మిమ్మల్ని దేశమంతటికి వ్యతిరేకంగా యూదా రాజులకు, దాని అధికారులకు, యాజకులకు, కోటగోడలు గల పట్టణంగా, ఇనుప స్తంభంగా ఇత్తడి గోడగా చేశాను.

  14. సంఘానికి మూలస్తంభాలుగా పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు దేవుడు నాకిచ్చిన కృపను గుర్తించినపుడు మమ్మల్ని స్వీకరించి మాతో సహవాస సూచనగా నాకు బర్నబాకు తమ కుడిచేతిని అందించారు. మేము యూదేతరుల దగ్గరకు, వారు యూదుల దగ్గరకు వెళ్లాలని అంగీకరించారు.

  15. త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా ఉన్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను.

  16. జయించినవారిని నా దేవాలయంలో ఒక స్తంభంగా నిలబెడతాను. అప్పుడు వారు దానిలో నుండి ఎన్నడూ బయటకు వెళ్లరు. వారి మీద నేను నా దేవుని పేరును పరలోకంలో ఉన్న నా దేవుని నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేము అనే నా దేవుని పట్టణం పేరును, నా క్రొత్త పేరును కూడా వ్రాస్తాను.

  17. బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తలమీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్లు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.