Skip to content

Pharisees గురించి బైబిల్ వచనాలు

22 వచనాలు · 7 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అప్పుడు, కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు దగ్గరకు వచ్చి, “ఉపదేశకుడా, నీ నుండి ఒక సూచన చూడాలని ఉంది” అన్నారు.

  2. అందుకు యేసు వారితో, “దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు.

  3. ఆ తర్వాత యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పరిసయ్యులు ఆ మాటలను విని అభ్యంతరపడ్డారు అని నీకు తెలుసా!” అని అడిగారు.

  4. కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఏ కారణంగానైనా ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు.

  5. అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును తన మాటల్లోనే ఎలా చిక్కించాలని ఆలోచించారు.

  6. హేరోదీయులతో పాటు తమ అనుచరులను ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, “బోధకుడా, నీవు యథార్థవంతుడవని, సత్యానికి అనుగుణంగా దేవుని మార్గాన్ని బోధిస్తావని మాకు తెలుసు. ఎవరు అనేదానిపై నీవు దృష్టి పెట్టవు కాబట్టి ఇతరులచే నీవు ప్రభావితం కావు.

  7. అయితే కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పు” అని అడిగారు.

  8. అయితే యేసు, వారి చెడు ఉద్దేశాన్ని గ్రహించి, వారితో, “వేషధారులారా, మీరు ఎందుకు నన్ను చిక్కున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు?

  9. పన్నుకట్టే ఒక నాణెము నాకు చూపించండి” అన్నారు. అందుకు వారు ఒక దేనారం తెచ్చారు.

  10. ఆయన వారిని, “దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు.

  11. వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు.

  12. వారు ఈ మాటలు విని, ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఆయనను విడిచి వెళ్లిపోయారు.

  13. పరిసయ్యులు ధర్మశాస్త్ర ప్రావీణ్యులు యోహాను చేత బాప్తిస్మం పొందక, తమ పట్ల దేవుని ఉద్దేశాన్ని నిరాకరించారు.

  14. పరిసయ్యులలో ఒకడు యేసును తనతో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానించాడు, ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజనబల్ల దగ్గర కూర్చున్నారు.

  15. యేసు మాట్లాడడం చాలించిన తర్వాత, ఒక పరిసయ్యుడు తనతో కలిసి భోజనం చేయమని యేసును ఆహ్వానించాడు; కాబట్టి ఆయన వెళ్లి భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు.

  16. ఒక సబ్బాతు దినాన, అధికారిగా ఉండిన ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి యేసు వెళ్లినప్పుడు, కొందరు ఆయన ఏమి చేస్తాడా అని ఆయనను గమనిస్తున్నారు.

  17. యూదుల న్యాయసభ సభ్యుడైన నీకొదేము అనేవాడు పరిసయ్యులలో ఉన్నాడు.

  18. అధికారులలో లేదా పరిసయ్యులలో ఎవరైనా ఆయనను నమ్మారా?

  19. అప్పుడు కొందరు పరిసయ్యుల తెగలోని విశ్వాసులు లేచి, “యూదేతరులు తప్పనిసరిగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, సున్నతి చేయించుకోవాలి” అని వారికి చెప్పారు.

  20. “నేను కిలికియ ప్రాంతపు తార్సు పట్టణంలో పుట్టిన యూదుడను, కాని ఈ పట్టణంలోనే పెరిగి పెద్దవాడినయ్యాను, గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర మన పితరుల ధర్మశాస్త్ర విద్యను పూర్తిగా అభ్యసించాను. మీరందరిలా నేను కూడా దేవుని కోసం ఆసక్తి కలవాన్ని.

  21. అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణను బట్టి ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు.

  22. వారికి నేను చాలా కాలం నుండి పరిచయస్తుడినే కాబట్టి వారికి ఇష్టమైతే, నేను పరిసయ్యునిగా జీవిస్తూ మా మతాచారాలను ఖచ్చితంగా పాటించే వాడినని వారే సాక్ష్యం ఇవ్వగలరు.