Skip to content

Patience గురించి బైబిల్ వచనాలు

76 వచనాలు · 37 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి మీరు ఏ కృపావరంలో లోటు లేకుండా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

  2. ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది.

  3. అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.

  4. కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో;

  5. దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కష్టమైన పనిలో నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో;

  6. పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో;

  7. అపొస్తలుల సూచకక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు పూర్తి సహనంతో నా వల్ల మీ మధ్య జరిగాయి.

  8. నీతిమంతులుగా తీర్చబడాలనే మన నిరీక్షణ నెరవేరాలని మనం విశ్వాసం కలిగి ఆత్మ ద్వారా ఆసక్తితో ఎదురుచూస్తున్నాము.

  9. మంచి చేయడంలో మనం అలసి పోవద్దు ఎందుకంటే మానక చేస్తే తగిన కాలంలో మనం పంటను కోస్తాము.

  10. మీరు పిలువబడిన పిలుపుకు యోగ్యులుగా నడుచుకోవాలని ప్రభువు యొక్క ఖైదీనైన నేను మిమ్మల్ని కోరుతున్నాను.

  11. ప్రేమలో ఒకరిని ఒకరు సహించుకుంటూ పూర్ణ వినయంతో సాత్వికంతో, దీర్ఝశాంతంతో ఉండండి.

  12. ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని,

  13. మీరు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, సహనాన్ని కలిగి ఉండేలా, ఆయన మహిమ ప్రభావాలను బట్టి సంపూర్ణ శక్తితో మీరు బలపరచబడాలని దేవున్ని నిరంతరం వేడుకుంటున్నాము.

  14. కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.

  15. ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి.

  16. దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసు క్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము.

  17. సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.

  18. కాబట్టి మీరు పొందుతున్న హింసలలో శ్రమలలో మీరు చూపుతున్న ఓర్పు విశ్వాసం గురించి దేవుని సంఘాల్లో మేము గొప్పగా చెప్తున్నాము.

  19. ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.

  20. సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్థ్యం గలవానిగా ఉండాలి.

  21. అతడు త్రాగుబోతై ఉండకూడదు, చేయి చేసుకునేవాడు కాక, మృదు స్వభావం గలవానిగా ఉండాలి, కొట్లాడేవానిగా, డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు.

  22. అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.

  23. ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు.

  24. దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.

  25. అయితే, నా బోధల గురించి, నా జీవిత విధానం, నా ఉద్దేశాలు, విశ్వాసం, ఓర్పు, ప్రేమ, దీర్ఘశాంతం,