Skip to content

Obedience గురించి బైబిల్ వచనాలు

136 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మేఘస్తంభంలో నుండి ఆయన మాట్లాడారు. వారు ఆయన చట్టాలు పాటించారు ఆయన ఇచ్చిన శాసనాలను వారు అమలుచేశారు.

  2. ఆయనకు భయపడేవారి పట్ల యెహోవా మారని ప్రేమ వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,

  3. ఆయన నిబంధనను పాటించేవారిపట్ల, ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది.

  4. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి.

  5. యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

  6. యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. స్తుతి నిత్యం ఆయనకే చెందును.

  7. యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడేవారు ధన్యులు, వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు.

  8. ఆయన శాసనాలను పాటిస్తూ తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు,

  9. అత్యంత జాగ్రత్తగా పాటించాలని మీరు వారికి శాసనాలిచ్చారు.

  10. మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది!

  11. అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు నేను అవమానపాలు కాను.

  12. నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి.

  13. నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.

  14. మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను.

  15. మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.

  16. నేను మీ శాసనాలను పాటిస్తున్నాను, వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి.

  17. నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను; మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను.

  18. యెహోవా, మీ శాసనాలను గట్టిగా పట్టుకుని ఉంటాను; నాకు అవమానం కలగనివ్వకండి.

  19. యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి, అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను.

  20. నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం, మీ ధర్మశాస్త్రానికి లోబడతాను.

  21. నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.

  22. యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  23. నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది.

  24. నేను నా మార్గాలను గమనించి నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను.

  25. మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను.