- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Lion గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
సింహాసనానికి ఆరు మెట్లున్నాయి, దాని వెనుక భాగం గుండ్రంగా ఉంటుంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి.
ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు.
అతడు తన దారిన వెళ్తున్నప్పుడు ఒక సింహం ఎదురై అతన్ని చంపేసింది. అతని శవం త్రోవలోనే పడి ఉంది. దాని ప్రక్కన గాడిద సింహం నిలబడి ఉన్నాయి.
బాటసారులు కొందరు శవం దారిలో పడి ఉండడం, శవం దగ్గర సింహం నిలబడి ఉండడం చూసి, వెళ్లి ఆ వృద్ధుడైన ప్రవక్త ఉన్న పట్టణంలో ఆ సంగతి చెప్పారు.
ప్రయాణం నుండి అతన్ని వెనుకకు తీసుకువచ్చిన ప్రవక్త దాని గురించి విని, “అతడు యెహోవా మాటను ధిక్కరించిన దైవజనుడు. యెహోవా వాక్కు అతన్ని హెచ్చరించిన ప్రకారం సింహం అతన్ని చీల్చి చంపింది” అని అన్నాడు.
ఆ ప్రవక్త తన కుమారులను పిలిచి, “నా కోసం గాడిద మీద జీను వేయండి” అని అన్నాడు, వారు అలాగే చేశారు.
అప్పుడు అతడు బయటకు వెళ్లి, దారిలో శవం పడి ఉండడం, శవం దగ్గర గాడిద సింహం నిలబడి ఉండడం చూశాడు. సింహం శవాన్ని తినలేదు, గాడిదను చీల్చివేయలేదు.
వారు మొదట అక్కడ నివసించినప్పుడు, వారు యెహోవాకు భయపడలేదు; కాబట్టి ఆయన వారి మధ్యకు సింహాలను పంపించారు, అవి వారిలో కొంతమందిని చంపాయి.
అష్షూరు రాజుకు, “మీరు తీసుకువచ్చి సమరయ పట్టణాల్లో ఉంచిన ప్రజలకు ఈ దేశం యొక్క దేవుని నియమాలు తెలియవు. ఆయనకు ఏం కావాలో ప్రజలకు తెలియదు కాబట్టి సింహాలు వారిని చంపుతూ ఉన్నాయని వారు అష్షూరు రాజుకు చెప్పారు.”
“నీవు ఇశ్రాయేలీయుల అధిపతుల గురించి విలాప గీతం పాడి ఇలా చెప్పు:
“ ‘నీ తల్లి ఎలాంటిది అంటే సింహాల మధ్యలో ఆడసింహం లాంటిది. కొదమ సింహాల మధ్య పడుకుని తన పిల్లలను పెంచింది.
ఆమె వాటిలో ఒకదాన్ని పెంచినప్పుడు అది బలమైన సింహం అయ్యింది. అది వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది.
దాని గురించి ఇతర జనాంగాలు విని తమ గోతిలో దానిని పట్టుకున్నారు. దానికి గాలం తగిలించి ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు.
“ ‘అది చూసిన దాని తల్లి తన ఆశ నిరాశ అయ్యిందని తన పిల్లల్లో మరో దానిని తీసుకుని బలమైన సింహంగా తయారుచేసింది.
ఇది కూడా కొదమ సింహమై, మిగిలిన కొదమ సింహాలతో పాటు తిరుగుతూ వేటాడడం నేర్చుకొని మనుష్యులను తినే జంతువుగా మారింది.
అది వారి బలమైన కోటలను పడగొట్టి వారి పట్టణాలను పాడుచేసింది. దాని గర్జన విని దేశంతో పాటు దేశంలో ఉన్నదంతా పాడైపోయింది.
నాలుగు వైపుల ఉన్న దేశాల ప్రజలందరూ దానిని పట్టుకోవడానికి వచ్చి దాని కోసం తమ వలలు పన్ని తమ గోతిలో దానిని చిక్కించుకున్నారు.
దానికి గాలం తగిలించి బోనులో పెట్టి బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు. ఇశ్రాయేలీయుల పర్వతాలమీద దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా వారు దానిని చెరసాలలో ఉంచారు.
అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు.
ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు.
తర్వాత రాజు భవనానికి వెళ్లి రాత్రంతా ఉపవాసం ఉండి వినోదాలను జరగనియ్యలేదు. అతనికి నిద్రపట్టలేదు.
తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు.
రాజు సింహాల గుహ దగ్గరకు చేరుకుని దుఃఖ స్వరంతో, “దానియేలూ! సజీవ దేవుని సేవకుడా! నిత్యం నీవు సేవించే నీ దేవుడు సింహాల బారి నుండి నిన్ను రక్షించగలిగారా?” అని అన్నాడు.
దానియేలు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక!
నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించారు. అవి నాకు హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. రాజా! మీ ఎదుట కూడా నేను ఏ తప్పు చేయలేదు” అన్నాడు.