Skip to content

Liberality గురించి బైబిల్ వచనాలు

149 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. పేదవారిపై శ్రద్ధచూపువారు ధన్యులు; అలాంటి వారిని యెహోవా కష్ట దినాన విడిపిస్తారు.

  2. యెహోవా వారిని కాపాడి సజీవంగా ఉంచుతారు, వారు దేశంలో ఆశీర్వదింపబడిన వారుగా పిలువబడతారు. ఆయన వారిని తమ శత్రువుల కోరికకు అప్పగించరు.

  3. యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు; వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు.

  4. యాత్రకీర్తన. యెహోవా, దావీదును, అతనికి కలిగిన అన్ని బాధలను జ్ఞాపకము చేసుకోండి.

  5. అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు, యాకోబు యొక్క బలవంతునికి మ్రొక్కుబడి చేశాడు:

  6. “యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు, యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు, నేను నా ఇంట్లోకి ప్రవేశించను, నా మంచం మీద పడుకోను, నా కళ్ళకు నిద్ర లేదా నా కనురెప్పలకు కునుకు రానివ్వను.”

  7. I will not give sleep to mine eyes, or slumber to mine eyelids,

  8. Until I find out a place for the LORD, an habitation for the mighty God of Jacob.

  9. నీ ధనముతో, నీ పంటలో ప్రథమ ఫలముతో యెహోవాను ఘనపరచు;

  10. అప్పుడు నీ ధాన్యాగారాలు నిండి సమృద్ధిగా ఉంటాయి, నీ గానుగ తొట్టెలు క్రొత్త ద్రాక్షరసంతో పొంగిపొర్లుతాయి.

  11. ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందినవారు కలరు; ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇస్తూ దరిద్రులైన వారు కలరు.

  12. దీవించే మనస్సు గలవారు వృద్ధిచెందుతారు, నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి.

  13. మీ ధాన్యాన్ని సముద్రం గుండా రవాణ చేయండి; చాలా రోజుల తర్వాత దాని నుండి మీరు లాభం పొందవచ్చు.

  14. ఏడు ఎనిమిదింటిలో పెట్టుబడి పెట్టండి; దేశంలో ఎలాంటి విపత్తు వస్తుందో మీకు తెలియదు.

  15. ‘మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు నుండి, తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజు నుండి, అంటే యెహోవా ఆలయ పునాది వేయబడిన రోజు నుండి జరిగిన వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచించండి:

  16. గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ”

  17. నా మందిరంలో ఆహారం ఉండేలా పదవ భాగాన్నంతా నా ఆలయానికి తీసుకురండి. ఇలా చేసి నన్ను పరీక్షించండి, నేను పరలోక ద్వారాలను తెరచి పట్టలేనంతగా దీవెనలు కుమ్మరిస్తానో లేదో చూడండి అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  18. మీ పైరును పురుగులు తినివేయకుండా చేస్తాను, అవి మీ పొలం పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్ల పండ్లు అకాలంలో రాలవు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. “అప్పుడు మీ దేశం ఆనందంగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల ప్రజలు మిమ్మల్ని ధన్యులంటారు” అని సైన్యాలకు యెహోవా ప్రకటిస్తున్నాడు.

  20. “మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండ జాగ్రత్తపడండి. ఎందుకంటే మీరు అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి దగ్గర ఫలం పొందరు.

  21. “కాబట్టి మీరు ఎవరికైనా దానం చేస్తే ఇతరుల నుండి ఘనత పొందాలని సమాజమందిరాల్లోను వీధుల్లోను ప్రకటించుకునే వేషధారుల్లా బూరలు ఊదించుకోకండి. అలాంటివారు తమ పూర్తి ప్రతిఫలం పొందుకున్నారని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను.

  22. అయితే మీరు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే, మీ కుడి చేయి చేసేది మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి.

  23. మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.

  24. అందుకు యేసు, “నీవు ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే వెళ్లి, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదవారికి పంచిపెట్టు అప్పుడు పరలోకంలో నీవు ధనం కలిగి ఉంటావు. తర్వాత వచ్చి నన్ను వెంబడించు” అని చెప్పారు.

  25. అయితే ఆ యవ్వనస్థుడు ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే గొప్ప ఆస్తి కలవాడు.