Skip to content

Liberality గురించి బైబిల్ వచనాలు

149 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.

  2. వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు.

  3. దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.

  4. మీ ప్రజల్లో హెబ్రీ పురుషులే గాని స్త్రీలే గాని మీకు అమ్ముకుని ఆరు సంవత్సరాలు మీకు సేవ చేస్తే, ఏడవ సంవత్సరంలో మీరు వారిని స్వేచ్ఛగా వెళ్లనివ్వాలి.

  5. మీరు వారిని విడుదల చేసినప్పుడు, వారిని వట్టి చేతులతో పంపకూడదు.

  6. మీ మందలో నుండి మీ నూర్పిడి కళ్ళం నుండి, మీ ద్రాక్ష గానుగ తొట్టి నుండి వారికి ధారాళంగా ఇచ్చి పంపాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన దానికి తగినట్టుగా వారికి ఇవ్వాలి.

  7. మీరు ఈజిప్టులో దాసులై ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విమోచించారని జ్ఞాపకం ఉంచుకోండి. అందుకే నేను ఈ రోజు మీకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను.

  8. కాని ఒకవేళ దాసుడు మీ దగ్గర సంతోషంగా ఉండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్న కారణంగా, “నేను మిమ్మల్ని విడిచి వెళ్లను” అని అంటే,

  9. మీరు కదురు తీసుకుని, వాని చెవిని తలుపుకు ఆనించి తలుపు లోనికి దిగేలా కదురుతో గుచ్చాలి. అప్పుడు వాడు మీకు జీవితకాల దాసునిగా ఉంటాడు. మీ దాసికి కూడా అలాగే చేయాలి.

  10. మీ దాసులను స్వేచ్ఛగా పోనివ్వడానికి మీరు కష్టం భావించవద్దు, ఎందుకంటే ఆరు సంవత్సరాలు వారు మీకు చేసిన సేవ మామూలు కూలివారు చేసే దానికన్నా రెట్టింపు ఉంటుంది. మీరు అలా చేస్తే మీ దేవుడైన యెహోవా మీరు చేసేవాటన్నిటిలో మిమ్మల్ని దీవిస్తారు.

  11. లేవీయులైన యాజకులకు అంటే, లేవీ గోత్రమంతటికి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని వారసత్వం గాని ఉండదు. యెహోవాకు సమర్పించబడిన హోమబలుల పైనే వారు బ్రతకాలి, ఎందుకంటే అది వారి వారసత్వము.

  12. వారి తోటి ఇశ్రాయేలీయులతో వారికి వారసత్వం ఉండదు; యెహోవా వాగ్దానం చేసినట్టుగా యెహోవాయే వారి వారసత్వము.

  13. ప్రజలు అర్పణలుగా తీసుకువచ్చే పశువులు, గొర్రెలు మేకల నుండి యాజకులకు చెందవలసిన వాటా: భుజం, లోపలి అవయవాలు, చెంపలు.

  14. మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవ నూనెలలో ప్రథమ ఫలాలు, అలాగే గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు మొదటి నూలు వారికే ఇవ్వాలి.

  15. యెహోవా పేర నిలిచి ఎల్లప్పుడు సేవ చేయటానికి అతని గోత్రాలన్నిటిలో అతన్ని అతని సంతానాన్ని మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్నాడు.

  16. ఒక లేవీయుడు అతడు నివసించే ఇశ్రాయేలులో ఎక్కడైనా మీ పట్టణాల్లో ఒకదాని నుండి వెళ్తే, యెహోవా ఎంచుకునే ప్రదేశానికి పూర్తి శ్రద్ధతో వస్తే,

  17. అతడు తన దేవుడైన యెహోవా పేరిట అక్కడ సేవచేసే తన తోటి లేవీయులందరిలా సేవ చేయవచ్చు

  18. కుటుంబ ఆస్తులు అమ్మిన దానిలో డబ్బు వచ్చినప్పటికీ, వారి ప్రయోజనాలలో అతడు సమానంగా పంచుకోవాలి.

  19. మీరు మీ పొలంలో పంట కోసినప్పుడు, మీరు ఒక పనను పట్టించుకోకపోతే, దాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లవద్దు. మీ చేతుల యొక్క అన్ని పనులలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించేలా విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.

  20. మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి.

  21. మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.

  22. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉంటిరని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  23. “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు.

  24. మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా యూదాలోని యెరూషలేముకు వెళ్లి మందిరాన్ని నిర్మించవచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, యెరూషలేములో ఉన్న దేవుడైన వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక.

  25. మిగిలి ఉన్నవారు ఇప్పుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం ప్రజలు వారికి వెండి, బంగారాలను, సామాగ్రిని, పశువులను యెరూషలేములోని దేవుని ఆలయానికి స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి.’ ”