Skip to content

Heave-Offering గురించి బైబిల్ వచనాలు

29 వచనాలు · 13 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మోషే అహరోనుతో అతని కుమారులలో మిగతా వారైన ఎలియాజరు, ఈతామారులతో ఇలా అన్నాడు, “యెహోవాకు సమర్పించిన హోమబలిలో మిగిలిన భోజనార్పణ పులుపు లేకుండ తీసుకుని బలిపీఠం ప్రక్కన తినండి, ఎందుకంటే అది అతిపరిశుద్ధమైనది.

  2. యెహోవాకు సమర్పించిన హోమబలులలో ఇది మీకు, మీ కుమారులకు ఇచ్చిన వాటా; దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినండి; ఎందుకంటే నాకు అలాగే ఆజ్ఞ ఇవ్వబడింది.

  3. కానీ నీవూ, నీ కుమారులు, మీ కుమార్తెలు పైకెత్తిన రొమ్ము భాగాన్ని, ప్రత్యేక అర్పణగా అర్పించిన తొడను తినవచ్చు. ఆచారరీత్య శుభ్రంగా ఉన్న స్థలంలో వాటిని తినండి; అవి నీకు, నీ పిల్లలకు ఇశ్రాయేలీయుల సమాధానబలులలో మీ వాటాగా ఇవ్వబడ్డాయి.

  4. ప్రత్యేక అర్పణ యైన తొడను పైకెత్తిన రొమ్ము భాగాన్ని హోమబలుల క్రొవ్వుతో పాటు తీసుకువచ్చి, యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇది నీకు, నీ పిల్లలకు శాశ్వత వాటాగా ఉంటుంది.”

  5. ఆ దేశం ఆహారాన్ని మీరు తినేటప్పుడు, ఒక భాగం యెహోవాకు అర్పణగా సమర్పించాలి.

  6. మీరు రుబ్బిన పిండితో చేసిన మొదటి రొట్టెను నూర్పిడి కళ్ళపు అర్పణగా అర్పించాలి.

  7. రాబోయే తరాలకు ఇలా మీ మొదటి పిండి ముద్ద నుండి యెహోవాకు అర్పణను అర్పించాలి.

  8. “నీవూ, యాజకుడైన ఎలియాజరు, సమాజం యొక్క కుటంబ యజమానులు, చెరపట్టబడిన మనుష్యులందరిని, జంతువులన్నిటిని లెక్కబెట్టాలి.

  9. ఆ కొల్లగొట్టిన వాటిని యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మిగితా సమాజానికి సమానంగా పంచాలి.

  10. యుద్ధంలో పోరాడిన సైనికుల భాగం నుండి, ప్రతి అయిదువందల నుండి అనగా మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా లేదా గొర్రెలైనా సరే ఒకరిని, ఒకదాన్ని యెహోవాకు పన్నుగా వేరు చేయాలి.

  11. ఈ పన్ను వారి భాగం నుండి తీసుకుని యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇవ్వాలి.

  12. ఇశ్రాయేలీయుల మిగతా సగం వాటా నుండి, మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా, గొర్రెలైనా, వీటిలో ఏవైనా సరే, ప్రతి 50 నుండి ఒకటి తీసుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇవ్వాలి.”

  13. కాబట్టి మోషే యాజకుడైన ఎలియాజరు యెహోవాకు మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.

  14. సైనికులు తీసుకున్న కొల్లగొట్టిన వాటిలో మిగిలి ఉన్న దోపుడుసొమ్ము 6,75,000 గొర్రెలు, 72,000 పశువులు, 61,000 గాడిదలు, 32,000 మంది పురుషులతో పడుకొనని కన్యలు.

  15. And threescore and twelve thousand beeves,

  16. And threescore and one thousand asses,

  17. And thirty and two thousand persons in all, of women that had not known man by lying with him.

  18. ఇది యుద్ధంలో పోరాడిన వారి సగం వాటా: 3,37,500 గొర్రెలు

  19. వీటిలో యెహోవాకు ఇచ్చినవి 675;

  20. 36,000 పశువులు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 72;

  21. 30,500 గాడిదలు, వీటిలో యెహోవాకు ఇచ్చినవి 61;

  22. 16,000 మంది మనుష్యులు, వీరిలో యెహోవాకు ప్రత్యేకింపబడినవారు 32.

  23. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే యాజకుడైన ఎలియాజరుకు యెహోవా భాగంగా ఇచ్చాడు.

  24. సైనికుల భాగం నుండి ఇశ్రాయేలు సమాజం కోసం మోషే వేరుగా ఉంచిన సగభాగం ఇది: 3,37,500 గొర్రెలు, 36,000 పశువులు, 30,500 గాడిదలు, 16,000 మంది మనుష్యులు.

  25. (Now the half that pertained unto the congregation was three hundred thousand and thirty thousand and seven thousand and five hundred sheep,