Skip to content

Famine గురించి బైబిల్ వచనాలు

101 వచనాలు · 51 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు; మేము అలసిపోయాము, కాని విశ్రాంతి దొరకడం లేదు.

  2. ఇంకా ఆయన నాతో ఇలా అన్నారు: “మనుష్యకుమారుడా, నేను యెరూషలేములో ఆహార సరఫరాను నిలిపివేయబోతున్నాను. ప్రజలు ఆందోళనకు గురియై కొలత ప్రకారం ఆహారం తింటారు, అలాగే కొలత ప్రకారం నీరు త్రాగుతారు.

  3. ఆహారానికి నీటికి కొరత ఏర్పడుతుంది. వారు ఒకరినొకరు చూసి దిగులుపడతారు, వారి పాపం కారణంగా వారు నశించిపోతారు.

  4. నేను నిన్ను నాశనం చేయడానికి ఘోరమైన, నాశనకరమైన కరువు బాణాలను నీ మీదికి విసురుతాను. నేను నీ మీదికి ఇంకా ఇంకా ఎక్కువ కరువు రప్పించి, నీ ఆహార సరఫరాను నిలిపివేస్తాను.

  5. నేను నీ మీదికి కరువును, అడవి మృగాలను పంపుతాను, అవి మీకు సంతానం లేకుండా చేస్తాయి. తెగులు, రక్తపాతం నిన్ను తుడిచివేస్తాయి, నేను నీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తానని యెహోవానైన నేనే చెప్పాను.”

  6. రైతులారా, నిరాశ చెందండి, ద్రాక్షలను పెంచే వారలారా, విలపించండి, గోధుమ, యవల కోసం దుఃఖించండి, ఎందుకంటే పొలం పంట పాడైపోయింది.

  7. ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.

  8. యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి; బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి. నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా, రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి; ఎందుకంటే దేవుని మందిరంలోకి భోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.

  9. యెహోవా దినం దగ్గరపడింది; అయ్యో! ఆ దినం నాశనంలా సర్వశక్తుని నుండి వస్తుంది.

  10. మన కళ్లెదుటే దేవుని మందిరంలో ఆహారం నిలిపివేయబడలేదా సంతోషం ఆనందం నిలిచిపోలేదా?

  11. విత్తనాలు మట్టిగడ్డల క్రింద కుళ్లిపోతున్నాయి. ధాన్యం ఎండిపోవడంతో, గిడ్డంగులు పాడైపోయాయి ధాన్యాగారాలు పడగొట్టబడ్డాయి.

  12. తినడానికి మేత లేక పశువులు ఎంతగానో మూలుగుతున్నాయి! మందలు అటూ ఇటూ తిరుగుతున్నాయి; గొర్రెల మందలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి.

  13. యెహోవా మీకు నేను మొరపెడుతున్నాను, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లను అగ్ని కాల్చివేసింది పొలం లోని చెట్లన్నిటిని మంటలు కాల్చివేశాయి.

  14. కాలువలు ఎండిపోయాయి; అరణ్యంలో అగ్ని పచ్చికబయళ్లను కాల్చివేసింది మీ కోసం అడవి జంతువులు కూడా దాహంతో ఉన్నాయి.

  15. “మీ ప్రతి పట్టణానికి తినడానికి ఏమీ దొరక్కుండా చేశాను, ప్రతి పట్టణంలో ఆహారం లేకుండ చేశాను, అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  16. “కోతకాలానికి మూడు నెలలు ముందు వర్షం కురవకుండా చేశాను, నేను ఒక పట్టణం మీద వర్షం కురిపించి, మరో పట్టణం మీద కురిపించలేదు. ఒక పొలం మీద వర్షం కురిసింది; వర్షం లేనిచోటు ఎండిపోయింది.

  17. ప్రజలు నీళ్ల కోసం పట్టణం నుండి పట్టణానికి తడబడుతూ వెళ్లారు కాని వారికి త్రాగడానికి సరిపడా నీళ్లు దొరకలేదు. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.

  18. “ఎన్నోసార్లు నేను మీ తోటలను, ద్రాక్షతోటలను వడగాలి వల్ల కాటుక తెగుళ్ళ వల్ల పాడు చేశాను. మిడతలు మీ అంజూర చెట్లను ఒలీవ చెట్లను మ్రింగివేశాయి. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.

  19. కాబట్టి ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్పే మాట ఇదే: “వీధులన్నిటిలో విలాపం ఉండబోతుంది ప్రతి రాజ మార్గంలో వేదనతో కూడిన ఏడ్పులు. ఏడ్వడానికి రైతులను దుఃఖపడడానికి విలపించేవారిని పిలుస్తారు.

  20. ద్రాక్షతోటలన్నిటిలో శోకం ఉంటుంది, ఎందుకంటే నేను మీ మధ్యలో సంచరిస్తాను,” అని యెహోవా అంటున్నారు.

  21. కాబట్టి మీ కారణంగా ఆకాశం నుండి మంచు కురవలేదు భూమి పంటలు పండలేదు.

  22. పొలాలు పర్వతాల విషయంలో ధాన్యం క్రొత్త ద్రాక్షరసం విషయంలో నూనె విషయంలో భూమి పండించే చేసే ప్రతి దాని విషయంలో మనుష్యులు పశువుల విషయంలో చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”

  23. ఆ వధించబడిన గొర్రెపిల్ల మూడవ ముద్రను విప్పినప్పుడు, మూడవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను. అప్పుడు నాకు ఒక నల్లని గుర్రం కనబడింది. దాని మీద స్వారీ చేసేవాడు చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు.

  24. ఆ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “ఒక రోజు జీతానికి ఒక కిలో గోధుమలు, ఒక రోజు జీతానికి మూడు కిలోల యవల గింజలు. అయితే ఒలీవల నూనెను ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు!” అని చెప్పడం విన్నాను.

  25. ఆ వధించబడిన గొర్రెపిల్ల నాలుగవ ముద్రను విప్పినప్పుడు, నాలుగవ ప్రాణి, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను.