Skip to content

Famine గురించి బైబిల్ వచనాలు: Sent as a judgment

56 వచనాలు · 51 కోణాలు

Sent as a judgment గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను మీ మొండి అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి, మీ పైన ఉన్న ఆకాశాన్ని ఇనుములా, మీ క్రింద ఉన్న భూమిని ఇత్తడిలా చేస్తాను.

  2. మీ బలము వ్యర్థమైపోతుంది ఎందుకంటే మీ నేల తన పంటలను ఇవ్వదు, పండదు. మీ భూమిలో ఉన్న చెట్లు ఫలం ఇవ్వవు.

  3. “ ‘మీరు నా పట్ల శత్రుత్వం కలిగి ఉంటే, నా మాట వినడానికి నిరాకరిస్తే, మీ పాపాలకు తగినంతగా నేను మీ బాధలను ఏడు రెట్లు పెంచుతాను.

  4. మీకు విరుద్ధంగా అడవి జంతువులు పంపుతాను, అవి మీ నుండి మీ పిల్లలను దోచుకుంటాయి, మీ పశువులను నాశనం చేస్తాయి, మీ మార్గాలన్నీ నిర్మానుష్యమయేలా మీ సంఖ్య తగ్గేలా చేస్తాయి.

  5. “ ‘ఇవన్నీ జరిగినా కూడా నా దిద్దుబాటును అంగీకరించకుండా నాకు విరుద్ధంగా ఉండడం కొనసాగిస్తే,

  6. నేనే మీ పట్ల శత్రువుగా ఉంటాను, మీ పాపాలకు ఇంకా ఏడు రెట్లు బాధిస్తాను.

  7. నిబంధన ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీపై ఖడ్గం తెస్తాను. మీరు మీ పట్టణాల్లోకి వెళ్లినప్పుడు, నేను మీ మధ్యకు తెగులును పంపుతాను, మీరు శత్రువు చేతుల్లోకి ఇవ్వబడతారు.

  8. నేను మీ రొట్టె సరఫరాను నిలిపివేసినప్పుడు, పదిమంది స్త్రీలు మీ రొట్టెను ఒక పొయ్యిలో కాల్చగలుగుతారు, వారు తూనికె చొప్పున రొట్టెను కొలిచి ఇస్తారు. మీరు తింటారు, కానీ మీరు సంతృప్తి చెందరు.

  9. “ ‘ఇవన్నీ జరిగినా కూడా మీరు నా మాట వినకుండా ఇంకా నాకు విరుద్ధంగా ఉంటే,

  10. అప్పుడు నా కోపంలో నేను మీ పట్ల శత్రుత్వం కలిగి ఉంటాను, నేనే మిమ్మల్ని మీ పాపాల కోసం ఇంకా ఏడు రెట్లు శిక్షిస్తాను.

  11. మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు.

  12. మీ తలమీద ఆకాశం ఇత్తడిలా మీ క్రింద నేల ఇనుములా ఉంటాయి.

  13. యెహోవా మీ దేశపు వర్షాన్ని దుమ్ము, పొడిగా మారుస్తారు; మీరు నాశనం అయ్యేవరకు అది ఆకాశాల నుండి దిగి వస్తుంది.

  14. మీరు పొలంలో చాలా విత్తనాలు విత్తుతారు, కానీ మిడుతలు దాన్ని మ్రింగివేస్తాయి కాబట్టి మీరు కొద్దిగా పంట కోస్తారు.

  15. మీరు ద్రాక్షతోటలు నాటి వాటిని శ్రమపడి సేద్యం చేస్తారు కాని ద్రాక్షరసం త్రాగరు, ద్రాక్షపండ్లు ఏరుకోరు, కారణం పురుగులు వాటిని తినేస్తాయి.

  16. మీకు ఒలీవచెట్లు ఉంటాయి గాని మీరు నూనె వాడరు, ఎందుకంటే ఒలీవలు రాలిపోతాయి.

  17. మీకు కుమారులు, కుమార్తెలు ఉంటారు, కానీ వారు మీ దగ్గర ఉండరు, ఎందుకంటే వారు చెరలోకి వెళ్లిపోతారు.

  18. మీ చెట్లను మీ పొలం పంటలను మిడతల గుంపులు వచ్చి ఆక్రమించుకుంటాయి.

  19. అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి, ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు. మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు. సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు.

  20. A fruitful land into barrenness, for the wickedness of them that dwell therein.

  21. చూడండి, ప్రభువును, సైన్యాలకు అధిపతియైన యెహోవా యెరూషలేములో నుండి యూదాలో నుండి జీవనాధారాన్ని, మద్దతును తీసివేయబోతున్నారు: అన్ని ఆహార సరఫరాలు, అన్ని నీటి సరఫరాలు,

  22. వీరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సోదె చెప్పేవారు, పెద్దలు,

  23. పంచదశాధిపతులను, ఘనత వహించినవారు, సలహాదారులు, నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు, తెలివిగల మాంత్రికులు, వీరందరిని తీసివేస్తారు.

  24. “నేను యవ్వనులను వారికి అధిపతులుగా నియమిస్తాను. పిల్లలు వారిని పరిపాలిస్తారు.”

  25. ప్రజలు ఒకరిని ఒకరు ఒకరి మీదికి ఒకరు, పొరుగువారి మీదికి పొరుగువారు. యువకులు పెద్దవారి మీదికి, అనామకులు ఘనుల మీదికి లేస్తారు.