Skip to content

Doubting గురించి బైబిల్ వచనాలు

105 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు జవాబిస్తూ, “నేను సైన్యాల యెహోవా దేవుని పట్ల ఎంతో రోషం కలిగి ఉన్నాను. ఇశ్రాయేలీయులు మీ నిబంధనను తిరస్కరించారు, మీ బలిపీఠాలను పడగొట్టారు, మీ ప్రవక్తలను ఖడ్గంతో చంపారు. నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు” అని చెప్పాడు.

  2. అప్పుడు యెహోవా అతనితో, “నీవు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లు, దమస్కు ఎడారికి వెళ్లు. అక్కడికి వెళ్లాక, హజాయేలును అరాము మీద రాజుగా అభిషేకించు.

  3. తర్వాత ఇశ్రాయేలు మీద నిమ్షీ కుమారుడైన యెహును రాజుగా, ఆబేల్-మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాను నీ తర్వాత ప్రవక్తగా అభిషేకించు.

  4. హజాయేలు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని యెహు చంపుతాడు, యెహు ఖడ్గం నుండి తప్పించుకునే వారిని ఎలీషా చంపుతాడు.

  5. అయినా ఇశ్రాయేలులో బయలుకు మోకరించని, వాన్ని ముద్దుపెట్టుకోని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచాను” అని చెప్పారు.

  6. తర్వాత అతడు, “బాణాలు చేత పట్టుకో” అన్నాడు, రాజు వాటిని తీసుకున్నాడు. ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “వాటితో నేలను కొట్టు” అన్నాడు. అతడు నేలను మూడుసార్లు కొట్టి ఆగాడు.

  7. దైవజనుడు అతని మీద కోప్పడి, “నీవు అయిదు లేదా ఆరు సార్లు కొట్టివుంటే, నీవు అరాము దేశాన్ని ఓడించి పూర్తిగా నాశనం చేసి ఉండేవాడివి. కాని, ఇప్పుడు దానిని మూడుసార్లు మాత్రమే ఓడిస్తావు” అని అన్నాడు.

  8. ఎలా నీవు చాలామందికి బుద్ధి నేర్పావో, ఎలా బలహీనమైన చేతులు బలపరిచావో ఆలోచించు.

  9. తొట్రిల్లినవారిని నీ మాటలు ఆదుకున్నాయి; క్రుంగిన మోకాళ్లను నీవు బలపరిచావు.

  10. అలాంటి నీకు ఇప్పుడు కష్టం కలిగితే నీవు నిరుత్సాహపడుతున్నావు; అది నిన్ను తాకగానే నీవు భయపడుతున్నావు.

  11. నీ దైవభక్తి నీకు ధైర్యం కాదా? నీ నిర్దోష ప్రవర్తన నీ నిరీక్షణ కాదా?

  12. నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా, ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను.

  13. తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు, ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు.

  14. ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు.

  15. బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు! న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు?

  16. నేను నిర్దోషినైనా కూడా నా నోరే నన్ను నిందిస్తుంది; నేను నిర్దోషినైనా అదే నన్ను దోషిగా ప్రకటిస్తుంది.

  17. “నేను నిర్దోషినినైనా నా గురించి నాకు శ్రద్ధ లేదు. నా ప్రాణాన్ని నేను తృణీకరిస్తున్నాను.

  18. ఏమి చేసినా ఒక్కటే; అందుకే నేను, దేవుడు నిర్దోషులని దుర్మార్గులని ఏ తేడా లేకుండ నాశనం చేస్తారు అని అంటున్నాను.

  19. ఉపద్రవం అకస్మాత్తుగా వచ్చి నాశనం చేస్తే, నిర్దోషుల దురవస్థను చూసి దేవుడు వెక్కిరిస్తారు.

  20. కాబట్టి నేను ఆయన ఎదుట భయపడుతున్నాను, వీటన్నిటిని ఆలోచించినప్పుడు నేను ఆయనకు భయపడుతున్నాను.

  21. దేవుడే నా హృదయం క్రుంగిపోయేలా చేశారు; సర్వశక్తిమంతుడు నన్ను భయపెట్టారు.

  22. చీకటి నన్ను చుట్టుముట్టినా, దట్టమైన చీకటి నా ముఖాన్ని కమ్మినా నేను నాశనమవ్వలేదు.

  23. “దేవా, నేను మీకు మొరపెడతాను, కాని మీరు జవాబు ఇవ్వరు; నేను నిలబడతాను అయినా మీరు నన్ను ఊర్కెనే చూస్తారు.

  24. నా పట్ల మీరు కఠినంగా మారారు; మీ బాహువు బలం చేత నా మీద దాడి చేస్తావు.

  25. నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.